ఆర్థిక మంత్రిత్వ శాఖ
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ సోదాలు
प्रविष्टि तिथि:
19 MAR 2021 12:45PM by PIB Hyderabad
తమిళనాడు, పుదుచ్చేరిలలో తదుపరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గట్టి నిఘా
కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆదాయపు పన్ను శాఖ 16.03.2021 న, చెన్నైలోని అయిదు ప్రాంగణాల్లో సోదాలను నిర్వహించింది. ఈ అయిదు ప్రాంగణాలు అయిదు సంస్థలకు చెందినవి. వీరు తమ రెగ్యులర్ వ్యాపారంతో పాటు, క్యాష్ హ్యాండిల్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యల ఫలితంగా రూ .5.32 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు ఆదాయపు పన్ను విభాగం 17/03/2021న నూలు వ్యాపారం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు పీపీఈ కిట్లు, బ్యాగులు, బేబీ కేర్ కిట్ల సరఫరాలో నిమగ్నమైన ఒక వ్యాపార సమూహంపై శోధన, స్వాధీనం కార్యకలాపాలను నిర్వహించింది. తమిళనాడులోని తిరుపూర్, ధరపురం, చెన్నైలోని ఎనిమిది ప్రాంగణాల్లో ఈ శోధనలు జరిగాయి. కొనుగోళ్లు, ఇతర ఖర్చులను పెంచడం, లాభాలను తక్కువ చేసి చూపించే ప్రక్రియలో ఈ బృందం నిమగ్నమైందని సోదాలు వెల్లడించాయి. ఈ బృందం ఇలా లెక్కలకు చూపని ఆదాయంను భూమిపై పెట్టుబడి పెట్టడానికి మరియు వ్యాపార విస్తరణకు ఉపయోగించినట్టుగా సమాచారం. ఈ సోదాలలో లెక్కకు చూపని రూ.11.50 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు లెక్కించని మొత్తం ఆదాయం రూ.80 కోట్లుగా తేలింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. లెక్కలకు చూపని నగదు స్వాధీనం కారణంగా.. ఈ తరహా సొమ్మును ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. తత్ఫలితంగా ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉచిత, న్యాయమైన పోలింగ్ జరిపే లక్ష్యానికి దోహదం చేస్తుంది. ఆదాయపు పన్ను శాఖ తన పర్యవేక్షణను మరింత వేగవంతం చేసింది. తదుపరి అసెంబ్లీ ఎన్నికలలో నగదు కదలికను నిశితంగా గమనిస్తోంది.
****
(रिलीज़ आईडी: 1706165)
आगंतुक पटल : 232