నీతి ఆయోగ్

క్లౌడ్ నైపుణ్యాభివృద్ధి మెరుగుదల, విద్యా సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు అంకుర సంస్థల అభివృద్ధికి కృషి చేయనున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఎడబ్ల్యుఎస్

Posted On: 18 MAR 2021 4:24PM by PIB Hyderabad

విద్యార్థుల్లో క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా దేశంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించి, క్లౌడ్  ద్వారా విద్యా సమస్యల పరిష్కారానికి సాంకేతిక మార్గాలను రూపొందించే అంశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయసహకారాలను అందించడానికి కలసి పనిచేయాలని అటల్ ఇన్నోవేషన్ మిషన్అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్) నిర్ణయించాయి. దీనికి సంబందించిన ఒప్పందంపై అటల్ ఇన్నోవేషన్ మిషన్,ఎడబ్ల్యుఎస్  సంతకాలు చేశాయి. దీనిప్రకారం భారతదేశంలో  ఎడబ్ల్యుఎస్ విక్రయాలుమార్కెటింగ్ కార్యకలాపాలను  అమెజాన్ వెబ్ సర్వీసెస్ చేపడుతుంది. ఒప్పందం కింద క్లౌడ్ సంబంధిత అంశాలపై విద్యార్థులుఅధ్యాపకులకు త్వరితగతిన అవగాహన కల్పించడానికి అమెజాన్ సంస్థ ప్రపంచవ్యాపితంగా అమలుచేస్తున్న  ఎడబ్ల్యుఎస్ ఎడ్యుకేట్ కార్యక్రమాలను దేశంలో  అటల్ ఇన్నోవేషన్ మిషన్ అమలు చేస్తుంది. ఈ కార్యక్రమం కింద ప్రోగ్రామ్ క్లౌడ్ కంప్యూటింగ్ లో  ప్రాథమిక అంశాలైన  క్లౌడ్ స్టోరేజ్వర్చువల్ కంప్యూట్ పవర్వెబ్ హోస్టింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్మెషిన్ లెర్నింగ్  మరియు వర్చువల్ రియాలిటీ లాంటి అంశాలపై  దేశంలో వున్న 7000 కి పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.  అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పర్యవేక్షకుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఎడబ్ల్యుఎస్ కార్యక్రమాలను అమలు చేస్తుంది. విద్యార్థులకు అవసరమైన వనరులుపరికరాలను సమకూర్చి వారు క్లౌడ్ లో పరిష్కారాలను కనుగొనేలా చూడడానికి  ఎడబ్ల్యుఎస్ సహకరిస్తుంది. 

వినూత్న విద్య మరియు అభ్యాస పరిష్కారాలను రూపొందించే అంశంలో అంకుర సంస్థల స్థాపనను ప్రోత్సహించడానికి దోహదపడే ఎడ్ టెక్ కార్యక్రమాన్ని అటల్ ఇన్నోవేషన్ మిషన్ అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాన్నిదాదాపు 80  అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్లలో అమలు చేస్తారు. వీటిద్వారా లబ్ద్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను అటల్ ఇన్నోవేషన్ మిషన్ చేపడుతుంది. 

  ఎడబ్ల్యుఎస్ తో కుదిరిన అవగాహన వల్ల దేశంలో యువతలో డిజిటల్వెబ్ ఆధారిత పరికరాల వినియోగంలో శిక్షణ ఇవ్వడం ద్వారా  వినూత్న నూతన ఆవిష్కరణలు చోటుచేసుకోవడానికిఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి అవకాశం కలుగుతుందని  అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ ఆర్.  రమణన్ తెలిపారు. దేశంలో వున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ కేంద్రాల్లో ఎడ్ స్టార్ట్ కార్యక్రమంతో అంకుర సంస్థల స్థాపనను ప్రోత్సహించడంతో పాటు వాటి ఆవిష్కరణలకు వాణిజ్య సహకారాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. 

2025 నాటికి భారతదేశంలో డిజిటల్ నైపుణ్యం కలిగిన కార్మికులు తొమ్మిది రెట్లు ఎక్కువగా అవసరముంటారని ఎఐఎస్పిఎల్ఎడబ్ల్యుఎస్ ఇండియాదక్షిణాసియా అధ్యక్షుడు రాహుల్ శర్మ వెల్లడించారు. ఈ అంశం ఆల్ఫాబెటా సంస్థతో కలసి ఎడబ్ల్యుఎస్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యిందని ఆయన చెప్పారు. క్లౌడ్ కంప్యూటింగ్ సాంకేతిక అభివృద్ధిపారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చి డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ తో కలసి భారతదేశానికి చెందిన విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచి వారికి తగిన శిక్షణ ఇస్తామని అన్నారు. 

ఈ కార్యక్రమాలతో పాటు వర్కుషాపులుసదస్సుల నిర్వహణక్లౌడ్ అంశాలపై పోటీలను నిర్వహించడంస్థానిక సమస్యల పరిష్కార అంశాలలో కూడా  అటల్ ఇన్నోవేషన్ మిషన్ తో కలసి ఎడబ్ల్యుఎస్ పనిచేస్తుంది. 

***(Release ID: 1705911) Visitor Counter : 12


Read this release in: English , Urdu , Hindi , Punjabi