సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పథకంలో మార్పులు

Posted On: 17 MAR 2021 1:59PM by PIB Hyderabad

పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పథకాన్ని 2020-21 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించడానికి, సవరించడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. ప్రస్తుతమున్న పద్ధతి నుంచి కేంద్ర, రాష్ట్రాల మధ్య 60:40 భాగస్వామ్య నిష్పత్తిలోకి నిధుల విధానాన్ని  మార్చడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల విషయంలో ఈ నిష్పత్తి 90:10గా ఉంటుంది. 2021-22 నుంచి, ఈ పథకం కింద కేంద్రం వాటా మొత్తం డీబీటీ పద్ధతిలో నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి జమవుతుంది. ఉపకార వేతనాలు పక్కదారి పట్టకుండా, బలమైన సైబర్‌ భద్రతతో, ఆన్‌లైన్ విధానంలో ఈ పథకం అమలు జరుగుతుంది. 

    డా.అంబేడ్కర్‌ పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనం పేరిట, ఈబీసీ విద్యార్థుల కోసం, కేంద్ర ప్రాయోజిత ప్రత్యేక పథకం 2014-15 నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతోంది. పోస్ట్‌ మెట్రిక్యులేషన్ లేదా ఉన్నత విద్య చదువుతున్న ఈబీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

    కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రతన్‌ లాల్‌ కటారియా ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.

***


(Release ID: 1705706) Visitor Counter : 141