భారత ఎన్నికల సంఘం
వివిధ రాష్ట్రాల్లోని పార్లమెంటరీ/అసెంబ్లీ
నియోజకవర్గాల ఉపఎన్నికల షెడ్యూల్
Posted On:
16 MAR 2021 5:30PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల ఖాళీలను, వివిధ రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.:
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
నియోజకవర్గం సంఖ్య, పేరు
|
-
|
ఆంధ్రప్రదేశ్
|
23-తిరుపతి (ఎస్.సి.)
|
-
|
కర్ణాటక
|
2-బెల్గాం
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
నియోజకవర్గం సంఖ్య, పేరు
|
-
|
గుజరాత్
|
125– మోర్వాహడాఫ్ (ఎస్.టి.)
|
-
|
ఝార్ఖండ్
|
13-మధుపూర్
|
-
|
కర్ణాటక
|
47-బసవకల్యాణ్
|
-
|
కర్ణాటక
|
59–మస్కీ (ఎస్.టి.)
|
-
|
మధ్యప్రదేశ్
|
55-దామోహ్
|
-
|
మహారాష్ట్ర
|
252-పండర్ పూర్
|
-
|
మిజోరాం
|
26-సెర్చిప్ (ఎస్.టి.)
|
-
|
నాగాలాండ్
|
51-నోక్సెన్ (ఎస్.టి.)
|
-
|
ఒడిశా
|
110-పిపిలీ
|
-
|
రాజస్థాన్
|
179- సహారా
|
-
|
రాజస్థాన్
|
24-సుజన్ గఢ్ (ఎస్.సి.)
|
-
|
రాజస్థాన్
|
175-రాజ్ సమంద్
|
-
|
తెలంగాణ
|
87-నాగార్జునసాగర్
|
-
|
ఉత్తరాఖండ్
|
49-సల్ట్
|
ఆయా ప్రాంతాల్లో జరిగే స్థానిక పర్వదినాలు, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాలు, వాతావరణ పరిస్థితులు, బలగాల తరలింపు, కరోనా వ్యాప్తి, తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ నియోజకవర్గాలన్నింటికీ ఈ కింద సూచించిన కార్యక్రమం ప్రకారం ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.:
ఎన్నికల కార్యక్రమం తేదీ, వారం
|
Date and Day
|
నోటిఫికేషన్ జారీ చేసే తేదీ 23-03-2021 (మంగళవారం)
|
23.03.2021
(Tuesday)
|
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 30-03-2021 (మంగళవారం)
|
30.03.2021
(Tuesday)
|
నామినేషన్లు పరిశీలించే తేదీ 31-03-2021 (బుధవారం)
|
31.03.2021
(Wednesday)
|
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 03-04-2021 (శనివారం)
|
03.04.2021
(Saturday)
|
పోలింగ్ తేదీ 17-04-2021 (శనివారం)
|
17.04.2021
(Saturday)
|
ఓట్లలెక్కింపు తేదీ 02-05-2021 (ఆదివారం)
|
02.05.2021
(Sunday)
|
ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీ 04-05-2021 (మంగళవారం)
|
04.05.2021
(Tuesday)
|
- ఓటర్ల జాబితా
పైన పేర్కొన్న పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2021, జనవరి 1వ తేదీనాటికి అర్హులైన ఓటర్లతో జాబితాల తుది ప్రచురణ పూర్తయింది.
- ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు (ఇ.వి.ఎం.లు), వి.వి.ప్యాట్లు
ఈ ఉపఎన్నికలకోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లోను ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను, వి.వి.ప్యాట్లను వినియోగించాలని కమిషన్ నిర్ణయించింది. ఉప ఎన్నికల నిర్వహణకోసం తగినన్ని ఇ.విఎం.లు, వి.వి.ప్యాట్లు అందుబాటులో ఉంచారు. ఈ యంత్రాల సహాయంతో పోలింగ్ సజావుగా నిర్వహించడానికి అవరమైన అన్ని చర్యలూ తీసుకున్నారు.
- ఓటర్ల గుర్తింపు
ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం,..ఈ ఉపఎన్నికల్లో కూడా పోలింగ్ సందర్భంగా ఓటర్ల గుర్తింపు నిర్ధారణప్రక్రియ తప్పనిసరిగా చేపట్టాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపునకు ఓటరు ఫొటో గుర్తింపు కార్డును (ఇ.పి.ఐ.సి.ని) ప్రధాన గుర్తింపు పత్రంగా పరిగణిస్తారు. అయితే,..ఓటర్ల జాబితాలో పేరున్న ఏ ఒక్కరు కూడా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోకుండా చూసేందుకు ఈ కింద ప్రత్యామ్నాయ కార్డులను, పత్రాలను కూడా గుర్తింపు ధ్రువీకరణకు అనువైనవిగా పరిగణించాలని కూడా నిర్ణయించారు:
- ఆధార్ కార్డు,
- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు,
- బ్యాంకులు లేదా పోస్టాఫీసులు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్కులు,
- కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు,
- డ్రైవింగ్ లైసెన్సు,
- పర్మనెంట్ అక్కౌంట్ నంబర్ (పాన్) కార్డు,
- జాతీయ జనాభా జాబితా (ఎన్.పి.ఆర్.) కింద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్.జి.ఐ.) జారీ చేసిన స్మార్ట్ కార్డు,
- భారతీయ పాస్ పోర్టు,
- ఫొటోతో కూడిన పెన్షన్ పత్రం,
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు./ప్రభుత్వ రంగ సంస్థలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన సర్వీసు గుర్తింపు కార్డులు,
- ఎం.పి.లకు/ఎమ్మెల్యేలకు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు.
- ఎన్నికల ప్రవర్తనా నియమావళి
ఉపఎన్నికలు జరగాల్సిన పార్లమెంటరీ/అసెంబ్లీ నియోజకవర్గాలు పాక్షికంగా, లేదా సంపూర్ణంగా ఏయే జిల్లాల పరిధిలోకి వస్తే, ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణం అమలులోకి వచ్చినట్టుగా పరిగణిస్తారు. ఇందుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అంశాలవారీగా పాక్షికంగా సవరణలు ఉంటాయి. ఇందుకు సంబంధించి అవసరమైన ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ జారీ చేసింది. (https://eci.gov.in/ అన్న కమిషన్ వెబ్ సైట్లో ఉత్తర్వులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. (ఉత్తర్వు నకలును జతపరిచారు). అందరు అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వర్తింపజేస్తారు.
- ఓటరు సమాచార స్లిప్పులు (వి.ఐ.ఎస్.)
ఓటర్ల జాబితాలోని తన పోలింగ్ కేంద్రం వరుస సంఖ్యను, పోలింగ్ తేదీని, పోలింగ్ సమయం తదితర వివరాలను ఓటరు తెలుసుకునేలా చేసేందుకు ఫొటో ఓటర్ స్లిప్పు స్థానంలో ‘ఓటరు సమాచార స్లిప్పు’లు జారీ చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన ఒక లేఖద్వారా కమిషన్ ఈ విషయం తెలియజేసింది. ఈ ఓటరు సమాచార సిప్పుల్లో పోలింగ్ కేంద్రం, పోలింగ్ తేదీ, పోలింగ్ సమయం, తదితర వివరాలు పొందుపరచబడి ఉంటాయి. అందులో ఓటరు ఫొటో గ్రాఫ్ ఉండదు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకున్న ఓటర్లందంరికీ పోలింగ్ తేదీకి ఐదు రోజులు ముందుగా ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ జరుగుతుంది. సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి ఈ స్లిప్పులను పంపిణీ చేయిస్తారు. అయితే, ఈ ఓటరు సమాచార స్లిప్పును ఓటర్ల గుర్తింపునకు రుజువు పత్రంగా వినియోగించడానికి అనుమతించరు. ఓటరు ఫొటో స్లిప్పును గుర్తింపునకు రుజువు పత్రంగా పరిగణించే పద్ధతిని ఎన్నికల కమిషన్ 2019 ఫిబ్రవరి 28నుంచి నిలిపివేసిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవలసి ఉంది.
- కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఉప ఎన్నికలకు పాటించవలసిన స్థూలమైన మార్గదర్శక సూత్రాలు
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ గత ఏడాది ఆగస్టు 21వ తేదీన జారీ చేసిన స్థూలమైన మార్గదర్శక సూత్రాలను ఈ ఉప ఎన్నికల సందర్భంగా కచ్చితంగా అనుసరించవలసి ఉంది. ఈ మార్గదర్శక సూత్రాలను కూడా కమిషన్ వెబ్ సైట్లో పొందుపరిచారు.
గత ఏడాది బీహార్ శాసనసభ ఎన్నిక నిర్వహణ సందర్భంగా జారీ చేసిన ఉత్తర్వులు, ఐదు రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతపు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన ఉత్తర్వులు తాజా ఉపఎన్నికల్లో కూడా వర్తిస్తాయి.
******
(Release ID: 1705633)
Visitor Counter : 191