వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
Posted On:
16 MAR 2021 5:54PM by PIB Hyderabad
సాంప్రదాయ స్వదేశీ పద్ధతులతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 2020-21 నుంచి భారతీయ ప్రకృతి కృషి పధతి (బిపికెపి) పథకాన్ని పరంపరగట్ కృషి వికాస్ యోజన (పికెవివై) ఉప పథకంగా అమలు చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ రోజు లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి ఈ సమాచారం అందించారు. దేశంలో తమిళనాడుతో సహా ఎనిమిది రాష్ట్రాల్లో 4.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణం సహజ పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు సాగుతున్నాయని మంత్రి వివరించారు. బిపికెపి పథకం కింద పొలాల అభివృద్ధి, సామర్ధ్య పెంపుదల కోసం హెక్టారు భూమికి 12200 రూపాయలను ఆర్థిక సహాయాన్ని 3 సంవత్సరాల పాటు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సింథటిక్ రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి జీవపదార్ధాలు, ఆవు పేడ-మూత్ర వినియోగాన్ని ప్రోత్సహిస్తూ పంటల సంరక్షణకు సహజ పద్దతులను అమలు చేయడాన్ని ఈ పథకం ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు. దీనికోసం శిక్షణ పొందిన సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని వీరు ఎప్పటికప్పుడు పంటల పెరుగుదలను పర్యవేక్షిస్తూ విశ్లేషణ చేపడతారని మంత్రి తెలిపారు.
బిపికెపి కింద విడుదల చేసిన నిధుల వివరాలు
క్ర.సం.
|
రాష్ట్రాలు
|
విస్తీర్ణం ( హెక్టార్లలో )
|
విడుదల చేసిన మొత్తం (లక్ష రూపాయల్లో)
|
1.
|
ఆంధ్రప్రదేశ్
|
100000
|
750.00
|
2.
|
ఘర్
|
85000
|
1352.52
|
3.
|
కేరళ
|
84000
|
1336.60
|
4.
|
హిమాచల్ ప్రదేశ్
|
12000
|
286.42
|
5
|
జార్ఖండ్
|
3400
|
54.10
|
6.
|
ఒడిశా
|
24000
|
381.89
|
7.
|
మధ్యప్రదేశ్
|
99000
|
393.82
|
8.
|
తమిళనాడు
|
2000
|
31.82
|
మొత్తం
|
409400
|
4587.17
|
(Release ID: 1705293)
Visitor Counter : 207