పర్యటక మంత్రిత్వ శాఖ
దారా షికో లైబ్రరీ భవనానికి “అడాప్ట్ ఎ హెరిటేజ్: అప్ని ధరోహర్, అప్ని పెహ్చాన్” ప్రాజెక్ట్ కింద 28 వ అవగాహన ఒప్పందం
प्रविष्टि तिथि:
16 MAR 2021 11:36AM by PIB Hyderabad
"అడాప్ట్ ఎ హెరిటేజ్: అప్ని ధరోహర్, అప్ని పెహ్చాన్" ప్రాజెక్ట్ కింద 28 వ అవగాహన ఒప్పందం 2021 మార్చి 15 న ఢిల్లీలోని దారా షికో లైబ్రరీ భవనానికి లభించింది. ఈ ప్రాజెక్టును కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతో సహా ప్రభుత్వ వాటాదారులు అమలు చేస్తారు; కళ, సాంస్కృతిక, భాష విభాగం (పురావస్తు శాఖ ద్వారా) నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ మరియు ప్రైవేట్ సంస్థలు అంటే మాన్యుమెంట్ మిత్రాస్, ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ట్రస్ట్ (టిఏఏసిహెచ్టి) మరియు మ్యూజియం & ఆర్ట్స్ కన్సల్టెన్సీ (ఎంఏసి) సంయుక్త కన్సార్టియంగా పనిచేస్తున్నాయి .
ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, చెత్త డబ్బాలు, బెంచీలు, మరుగుదొడ్లు, వివరణాత్మక సంకేతాలు మరియు దిశాత్మక సంకేతాలు, తాగునీటి సౌకర్యాలు, విద్యుద్దీపాలంకరణ (బయట, లోపలా కూడా) వంటి భవనం మరియు బహిరంగ ప్రదేశం యొక్క పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధి, కార్యకలాపాలు మరియు నిర్వహణను చేపట్టడం మాన్యుమెంట్ మిత్రాస్ ప్రణాళిక. బూత్‌లు, టచ్ స్క్రీన్‌లు & గోడలు), పురాతన వస్తువులు / కళాఖండాలు, సెక్యూరిటీ & అడ్వాన్స్‌డ్ నిఘా వ్యవస్థ (పిటిజెడ్ ఆధారిత సిసిటివి కెమెరాల మాదిరిగా) మొదలైనవి నిల్వ చేయడానికి గదిని ఏర్పాటు మరియు ఫలహారశాల (అవుట్డోర్ కేఫ్), సావనీర్ షాప్, బ్రోచర్లు మరియు కరపత్రాలు, లైబ్రరీ మరియు రీడింగ్ ఏరియా, ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లు, వెబ్‌సైట్ డిజైనింగ్, యాప్-బేస్డ్ బహుభాషా ఆడియో-గైడ్, వై-ఫై మొదలైన ఆధునిక సౌకర్యాలు.
అవగాహన ఒప్పందం వ్యవధి ఐదేళ్ల ప్రారంభ కాలానికి, ఆ తర్వాత మాన్యుమెంట్ మిత్రా పనితీరు ఆధారంగా పొడిగిస్తారు.
*******
(रिलीज़ आईडी: 1705288)
आगंतुक पटल : 194