ఆర్థిక మంత్రిత్వ శాఖ

స్టాండ‌ప్ ఇండియా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి రూ. 24,985.27 కోట్ల విలువైన 1,11,619 రుణాల కేటాయింపు

Posted On: 16 MAR 2021 5:03PM by PIB Hyderabad

గ్రీన్ ఫీల్డ్ ఎంట‌ర్‌ప్రైజ్ లో  ఉత్ప‌త్తి, సేవా లేక వాణిజ్యం చేయ‌ద‌ల‌చుకున్న వారిలో ఒక్కొక్క బ్రాంచి క‌నీసం ఒక షెడ్యూల్డు కులం (ఎస్‌సి), లేక షెడ్యూల్డ్ తెగ (ఎస్‌టి) రుణ‌గ్ర‌హీత‌, ఒక మ‌హిళా రుణ‌గ్ర‌హీత‌కు రూ 10 ల‌క్ష‌ల నుంచి రూ1 కోటి వ‌ర‌కు షెడ్యూల్డు క‌మర్షియ‌ల్ బ్యాంకులు రుణంగా ఇచ్చే సౌల‌భ్యాన్ని క‌ల్పించే ల‌క్ష్యంతో ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌క‌మే స్టాండ‌ప్ ఇండియా ప‌థ‌కం. 
రాజ్య‌స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌కు మంగ‌ళ‌వారంనాడు లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇస్తూ కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్య‌వ‌హారాల స‌హాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్ల‌డించారు. 
మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ, ప‌థ‌కం అమ‌లు నుంచి 02.03.2021వ‌ర‌కు రూ. 24, 985.27 కోట్ల విలువ క‌లిగిన మొత్తం 1,11,619  రుణాల‌ను ఈ ప‌థ‌కం కింద అందించిన‌ట్టు మంత్రి తెలిపారు. 
ఆర్థిక సంవ‌త్స‌రం 2021-2022 ఆర్థిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్ ఉప‌న్యాసంలో ఆర్థిక మంత్రి చేసిన ప్ర‌క‌ట‌నకు అనుగుణంగా, దీనికింద రుణాల‌కు అవ‌స‌ర‌మైన మార్జిన్ మ‌నీని 25% నుంచి 15% వ‌ర‌కు త‌గ్గించార‌ని, వ్య‌వ‌సాయానికి సంబంధ కార్య‌క‌లాపాల‌ను ప‌థ‌కంలో జోడించామ‌ని మంత్రి పేర్కొన్నారు.  
ఈ ప‌థ‌కాన్ని ప్ర‌భావ‌వంతంగా అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంద‌ని కూడా మంత్రి తెలిపారు. సంభావ్య రుణ‌గ్ర‌హీత ఆన్‌లైన్ పోర్ట‌ల్ (www.standupmitra.in) ద్వారా ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించే అవ‌కాశం, చేయూత‌, తీవ్ర‌మైన ప్ర‌చార కార్య‌క‌లాపాలు, స‌ర‌ళీక‌రించిన రుణ అప్లికేష‌న్ ఫార్మ్‌, ప‌ర‌ప‌తి గ్యారంటీ ప‌థ‌కం, ల‌క్ష్యిత గ్రూపుల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌తివారం కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌చారం త‌దిత‌రాలు ఇందులో ఉంటాయ‌ని వివ‌రించారు. ‌

***



(Release ID: 1705244) Visitor Counter : 82


Read this release in: Urdu , English , Hindi , Bengali