ఆయుష్

జాతీయ ఆయుష్ మిష‌న్ కింద ఆయుష్ ఆసుప‌త్రులు ‌

Posted On: 15 MAR 2021 3:53PM by PIB Hyderabad

 ప్ర‌జారోగ్యం రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధీనంలోకి వ‌చ్చే అంశం అయినందున‌, ఆయుష్ ఆసుప‌త్రులు ఆయా రాష్ట్ర/  కేంద్ర పాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాల ప‌రిధిలోకి వ‌స్తాయి. అయితే, కేంద్రం స్పాన్స‌ర్ చేస్తున్న ఆయుష్ మిష‌న్ (ఎన్ ఎఎం) కింద‌, 50 ప‌డ‌క‌ల స‌మ‌గ్ర ఆయుష్ ఆసుప‌త్రిని ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం అందుకునే అవ‌కాశం ఉంది. రాష్ట్ర/  కేంద్ర‌పాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాలు ఎన్ ఎఎం మార్గ‌ద‌ర్శకాల‌కు అనుగుణంగా ఈ కార్య‌క‌లాపాల కోసం గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ను కోరేందుకు అర్హులు. ఆయుష్ మంత్రిత్వ శాఖ 2015-16 సంవ‌త్స‌రంలో పాట్నాలో 50 ప‌డ‌క‌ల స‌మ‌గ్ర ఆయుష్ ఆసుప‌త్రిని ఒక దానిని ఏర్పాటు చేసేందుకు ఆమోదాన్ని తెలిపింది. ఆయుష్ ఆసుప‌త్రిని పాట్నాలో ఏర్పాటు చేసేందుకు 2015-16లో 102.70ల‌క్ష‌ల‌ను, 2019-20లో 200.00 ల‌క్ష‌ల మేర‌కు కేటాయింపుల‌ను ఆమోదించింది. 
బీహార్‌లో వైద్య సేవ‌ల‌ను, సౌక‌ర్యాల‌ను అందిస్తున్న ఐదు ప్ర‌భుత్వ ఆయుర్వేదిక్ ఆసుప‌త్రులు, వైద్య క‌ళాశాల‌లుః
ప్ర‌భుత్వ ఆయుర్వేద‌ కళాశాల & ఆసుప‌త్రి, పాట్నా 
ప్ర‌భుత్వ ఆయోధ్య శివ‌కుమారి ఆయుర్వేద‌ క‌ళాశాల & ఆసుప‌త్రి, బేగూస‌రాయ్
ప్ర‌భుత్వ శ్రీ‌య‌తీంద్ర నారాయ‌ణ్ అష్టాంగ ఆయుర్వేద క‌ళాశాల‌& ఆసుప‌త్రి, భ‌గ‌ల్‌పూర్
ప్ర‌భుత్వ మ‌హారాణి రామేశ్వ‌రి భార‌తీయ చిక‌త్స్య విజ్ఞాన్ సంస్థాన్‌, ద‌ర్భంగ‌
ప్ర‌భుత్వ శ్రీ ధ‌న్వంత‌రి ఆయుర్వేద‌ క‌ళాశాల & ఆసుప‌త్రి, బ‌క్స‌ర్ 
ప్ర‌స్తుతం బీహార్ లో ఆయుర్వేద వైద్య విద్య‌ను ప్ర‌భుత్వ ఆయుర్వేద క‌ళాశాల & ఆసుప‌త్రి, పాట్నా,  ప్ర‌భుత్వ ఆయోధ్య శివ‌కుమారి ఆయుర్వేద‌ క‌ళాశాల & ఆసుప‌త్రి, బేగూస‌రాయ్ అందిస్తున్నాయి. 
బీహార్ స‌హా రాష్ట్ర‌/  కేంద్ర‌పాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాల ద్వారా కేంద్ర ప్రాయోజిత ప‌థ‌క‌మైన నేష‌న‌ల్ ఆయుష్ మిష‌న్‌ను ఆయుష్ మంత్రిత్వ శాఖ అమ‌లు చేయ‌డ‌మే కాక‌, వారి వారి రాష్ట్ర వార్షిక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు (SAAPs)లో పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌కు అనుగుణంగా తోడ్పాటును అందిస్తోంది. 
ఈ విష‌యాన్ని సోమ‌వారం నాడు లోక్‌స‌భకు ఇచ్చిన లిఖిత పూర్వ‌క స‌మాధానంలో ఆయుర్వేద‌, యోగ‌& నాచురోప‌తి, యునాని, సిద్ధ‌, హోమియోప‌తి వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి కిర‌ణ్ రిజిజు (అద‌న‌పు చార్జి) వెల్ల‌డించారు. ‌

***
 



(Release ID: 1704981) Visitor Counter : 86


Read this release in: English , Urdu