ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                         ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ భారత్ యోజన
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                15 MAR 2021 2:40PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ఆర్థిక సంవత్సరం 21-22 బడ్జెట్ ఉపన్యాసంలో భాగంగా 1 ఫిబ్రవరి, 2021న ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన (పిఎంఎఎస్ బివై)ను సుమారు ఆరేళ్ళకు (ఆర్థిక సంవత్సరం 25-26) వరకు రూ. 64,180 కోట్ల వ్యయంతో ప్రకటించారు. ఇది జాతీయ ఆరోగ్య మిషన్ కు అదనం. 
ఈ పథకం కింద ఆర్థిక సంవత్సరం 25-26 నాటికి సాధించాలనుకున్న ప్రధాన చొరవలుః 
అత్యధిక దృష్టి పెట్టిన 10 రాష్ట్రాలలో 17,788 గ్రామీణ హెల్త్ మరియు వెల్ నెస్ సెంటర్లకు మద్దతు
అన్ని రాష్ట్రాలలో 11,024 పట్టణ హెల్త్ మరియు వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు చేయడం.
అత్యధిక దృష్టి పెట్టిన 11 రాష్ట్రాలలో సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను 3382 బ్లాకులు, అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయడం;
సుమారు 602 జిల్లాలలో క్రిటికల్ కేర్ ఆసుపత్రి బ్లాకులను, 12 కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయడం. 
వ్యాధి నియంత్రణ జాతీయ కేంద్రం (ఎన్‌సిడిసి)లను, దాని 5 ప్రాంతీయ శాఖలను, 20 మెట్రోపాలిటన్ ఆరోగ్య నిఘా యూనిట్లను బలోపేతం చేయడం;
 అన్ని ప్రజారోగ్య ప్రయోగశాలలను అనుసంధానం చేసేందుకు సమగ్ర ఆరోగ్య సమాచార పోర్టల్ ను అన్ని రాష్ట్రాలు/  కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరింపచేయడం;
 17 కొత్త ప్రజారోగ్య యూనిట్ల నిర్వహణను, ప్రస్తుత 33 పబ్లిక్ హెల్త్ యూనిట్లను ఎంట్రీ పాయింట్ల వద్ద  అంటే 32 కొత్త విమానాశ్రయాలు, 11 నౌకాశ్రయాలు, 7 ల్యాండ్‌క్రాసింగ్‌ల వద్ద బలోపేతం చేయడం;
సుమారు 15 ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లను, 2 మొబైల్ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం;
ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఆగ్నేయాసియా ప్రాంతం కోసం ప్రాంతీయ పరిశోధన వేదిక అయిన వన్ హెల్త్ కోసం ఒక జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం, 9 జీవభ్రదత స్థాయి III ప్రయోగశాలలను, 4 ప్రాంతీయ జాతీయ వైరాలజీ సంస్థలను ఏర్పాటు చేయడం.
ఈ పథకం కింద చర్యలలో భాగంగా, అన్ని స్థాయిలలో అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలలో సంరక్షణ కోసం  అన్ని శ్రేణులలోని ఆరోగ్య సంరక్షణ విధానాల, వ్యవస్థల సామర్ధ్యాలను అభివృద్ధి చేయడమే కాకుండా ప్రస్తుతం ఉనికిలో ఉన్నభవిష్యత్తులో రాబోయే మహమ్మారి/  విపత్తులకు సమర్ధవంతంగా స్పందించేలా ఆరోగ్య వ్యవస్థలను తయారు చేయడంపై దృష్టి పెడుతుంది. జాతీయ, ప్రాంతీయ, జిల్లా, బ్లాకు స్థాయిలతో పాటు మెట్రోపాలిటన్ ప్రాంతాలలో కూడా పర్యవేక్షణ ప్రయోగశాలల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఐటి ఆధారిత వ్యాధి పర్యవేక్షణ వ్యవస్థను నిర్మించడమే కాక, ఎంట్రీ పాయింట్లలో ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను, వ్యాధుల వ్యాప్తిని నివారించే, పోరాడాలని పిఎంఎఎస్‌బివై లక్ష్యిస్తోంది. కోవిడ్ -19తో పాటుగా ఇతర సాంక్రమిక వ్యాధులతో పాటుగా కోవిడ్ -19 వంటి మహమ్మారులకు మధ్యకాలిక, దీర్ఘకాలిక స్పందనను తెలియచెప్పేందుకు, మానవులలో, జంతువులలో సాంక్రమిక వ్యాధులు ప్రబలడాన్ని కనుగొని, నివారించేలా స్పందించేందుకు ఆధారాలను ఉత్పత్తి చేయడం కోసం బయోమెడికల్ రీసెర్చ సహా పరిశోధనలకు మద్దతు ఇవ్వడమే కాకుండా పెట్టుబడులను పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
జాతీయ ఆరోగ్య విధానం (ఎన్‌హెచ్‌పి), 2017 ప్రజారోగ్య వ్యయాన్ని 2025 నాటికి నిర్ణీత కాలంలో ప్రస్తుతమున్న జిడిపిలో 1.15% నుంచి 2.5%కి పెంచాలని యోచిస్తోంది. 
ఈ విషయాన్ని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే సోమవారంనాడు లోక్‌సభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు. 
 
***
 
                
                
                
                
                
                (Release ID: 1704975)
                Visitor Counter : 480