ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల కార్యక్రమం- 57వ రోజు
2 కోట్ల 91 లక్షలకు పైగా కోవిడ్ డోసుల పంపిణీ నిన్న సాయంత్రం 7 వరకు 9.74 లక్షల టీకా డోసులు
Posted On:
13 MAR 2021 8:44PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 2 కోట్ల 91 లక్డ్షలు దాటింది. 2021 జనవరి 16న టీకాల కార్యక్రమం ప్రారంభం కాగా ముందుగా ఆరోగ్య సిబ్బందికి టీకాలు ఇచ్చారు. ఫిబ్రవరి2 నుంచి కోవిడ్ యోధులకు టీకలు మొదలుకాగా మార్చి1 నుంచి 60 ఏళ్ళు పైబడినవారికి, 45 ఏళ్ళు దాటి దీర్ఘకాల వ్యాధులున్నవారికి టీకాలు ఇవ్వటం ప్రారంభించారు.
నిన్న సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం మొత్త 2,91,92,547కోవిడ్ టీకా డోసులు ఇచ్చారు. ఇందులో 73,31,498 డోసులు మొదటి విడత ఆరోగ్య సిబ్బందికి, 58,297 డోసులు రెండో విడత ఆరోగ్య సిబ్బందికి, 72,96,474 డోసులు కోవిడ్ యోధులకు మొదటీ డోస్ గాను, 10,53,732 డోసులు కోవిడ్ యోధులకు రెండో డోస్ గాను ఇవ్వగా 60 ఏళ్ళు పైబడినవారికి 78,66,241 మొదటి డోసులు, 45 ఏళ్ళు పైబడి ఇతర దీర్ఘకాలవ్యాధులున్నవారికి13,86,305 డోసులు ఇచ్చారు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘక్జాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
73,31,498
|
42,58,297
|
72,96,474
|
10,53,732
|
13,86,305
|
78,66,241
|
టీకాలు మొదలైన 57వ రోజైన నిన్న ఒక్కరోజే సాయంత్రం 7 వరకు 9,74,090 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో మంది లబ్ధిదారులు 8,05,014 మొదటి డోస్ అందుకోగా, 1,69,076 మంది అరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు రెండో డోస్ అందుకున్నారు.
తేదీ: మార్చి 13, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘక్జాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
37,923
|
64,267
|
60,729
|
1,04,809
|
1,31,837
|
5,74,525
|
8,05,014
|
1,69,076
|
****
(Release ID: 1704720)
Visitor Counter : 186