ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేస్తున్న 17 రాష్ట్రాలు రూ.37,000 కోట్ల అదనపు రుణ సౌకర్యం పొందాయి

Posted On: 11 MAR 2021 12:00PM by PIB Hyderabad

పదిహేడు (17) రాష్ట్రాలు " ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని" విజయవంతంగా అమలు చేశాయి, సంస్కరణను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో తాజాగా ఉత్తరాఖండ్ చేరింది.

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధాన సంస్కరణను పూర్తిచేసే రాష్ట్రాలు స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) లో 0.25 శాతం అదనపు రుణాలు తీసుకోవడానికి అర్హులు. దీని ప్రకారం, ఈ రాష్ట్రాలకు అదనపు రుణం తీసుకునే అనుమతి రూ. 37,600 కోట్లు ఖర్చుల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చింది. ఈ 17 రాష్ట్రాలకు అనుమతించిన అదనపు రుణాలు రాష్ట్రాల వారీగా ఈ కింద పేర్కొన్నారు. 

  ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానం అనేది పౌర-కేంద్రీకృతమైన ఒక ముఖ్యమైన సంస్కరణ. దీని అమలు జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) మరియు ఇతర సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు దేశవ్యాప్తంగా ఏదైనా చౌక ధరల దుకాణం (ఎఫ్‌పిఎస్) వద్ద రేషన్ లభ్యతను నిర్ధారిస్తుంది.

ఈ సంస్కరణ ముఖ్యంగా వలస జనాభాను ఎక్కువగా కార్మికులు, రోజువారీ కూలీలు, రాగ్ పికర్స్ వంటి పట్టణ పేదలు, వీధివాసులు, వ్యవస్థీకృత మరియు అసంఘటిత రంగాలలో తాత్కాలిక కార్మికులు, గృహ కార్మికులు మొదలైనవారికి ప్రయోజనం చేకూరుతుంది. వారు తరచుగా తమ నివాస స్థలాన్ని మార్చుకుంటారు. అందువల్ల స్వావలంబన దిశగా వారి జీవనం సాగుతుంది. ఈ టెక్నాలజీ ఆధారిత సంస్కరణ వలస లబ్ధిదారులకు దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన చౌక ధరల దుకాణాలను ఏ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఇ-పోస్) నుండైనా వారికి పొందడానికి అర్హమైన ఆహార ధాన్యాల  కోటాను పొందటానికి వీలు కల్పిస్తుంది.

ఈ సంస్కరణ లబ్ధిదారులను మరింత మెరుగుగా లక్ష్యం చేసుకోవటానికి, బోగస్ / డూప్లికేట్ / అనర్హమైన కార్డ్ హోల్డర్లను తొలగించడానికి మెరుగుపరుస్తుంది, ఫలితంగా మెరుగైన సంక్షేమం అందడమే కాకుండా మరియు లీకేజీ తగ్గుతుంది. ఇంకా, రేషన్ కార్డు నిరంతరాయమైన అంతర్-రాష్ట్ర పోర్టబిలిటీని నిర్ధారించడానికి, అన్ని రేషన్ కార్డుల ఆధార్ అనుసంధానం, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఇ-పోస్) పరికరాల ఏర్పాటుతో అన్ని చౌక ధర దుకాణాల (ఎఫ్‌పిఎస్) ఆటోమేషన్ ద్వారా లబ్ధిదారుల బయోమెట్రిక్ ప్రామాణీకరణ అవసరం. అందువల్ల, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) లో 0.25 శాతం అదనపు రుణ పరిమితి ఈ క్రింది రెండు చర్యలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే రాష్ట్రాలకు అనుమతించబడుతుంది:

(i)    రాష్ట్రంలో లబ్దిదారులందరి రేషన్ కార్డులు ఆధార్ తో అనుసంధానం 

(ii)   రాష్ట్రంలో అన్ని చౌకధర దుకాణాలు (ఎఫ్పిఎస్ లు) ఆటోమేషన్. 

కోవిడ్-19 మహమ్మారి బహుళ సవాళ్లను ఎదుర్కోవటానికి అవసరమైన వనరుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం 2020 మే 17 న రాష్ట్రాల రుణాలు పరిమితిని వారి జిఎస్‌డిపిలో 2 శాతం పెంచింది. ఈ ప్రత్యేక పంపిణీలో సగం అంటే జిఎస్‌డిపిలో 1 శాతం రాష్ట్రాలు పౌర-కేంద్రీకృత సంస్కరణలను చేపట్టడానికి అనుసంధానించబడి ఉన్నాయి. ఖర్చుల విభాగం గుర్తించిన సంస్కరణల కోసం నాలుగు పౌర-కేంద్రీకృత ప్రాంతాలు... (ఎ) ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానం అమలు, (బి) సులభతరం వ్యాపార సంస్కరణలు, (సి) పట్టణ స్థానిక సంస్థ / వినియోగ సంస్కరణలు మరియు (డి) విద్యుత్ రంగ సంస్కరణలు.                      

ఒకే దేశం ఒకే రాష్ట్రం విధానం పూర్తి చేసినందుకు రాష్ట్రాల వారీగా అనుమతిచ్చిన అదనపు రుణం పొందే సౌకర్యం 

 

 

క్రమ సంఖ్య 

రాష్ట్రం 

                                                   నగదు (రూ.కోట్లలో)

1.

ఆంధ్రప్రదేశ్ 

2,525

2.

గోవా 

223

3.

గుజరాత్ 

4,352

4.

హర్యానా 

2,146

5.

హిమాచల్ ప్రదేశ్ 

438

6.

కర్ణాటక 

4,509

7.

కేరళ 

2,261

8.

మధ్యప్రదేశ్ 

2,373

9.

మణిపూర్ 

75

10.

ఒడిశా 

1,429

11.

పంజాబ్ 

1,516

12.

రాజస్థాన్ 

2,731

13.

తమిళనాడు 

4,813

14.

తెలంగాణ 

2,508

15.

త్రిపుర 

148

16.

ఉత్తరాఖండ్ 

702

17.

ఉత్తర్ ప్రదేశ్ 

4,851

           

****


(Release ID: 1704113) Visitor Counter : 394