నీతి ఆయోగ్
‘భారతదేశంలో విద్యుత్ వాహనాలకు ఆర్ధిక సహాయాన్ని సమీకరించడం’ పై ఒక కొత్త నివేదికను విడుదల చేసిన - నీతీ ఆయోగ్ మరియు ఆర్.ఎమ్.ఐ. ఇండియా
2030 లో 3.7 లక్షల కోట్ల రూపాయల అంచనాకు చేరనున్న - భారతదేశ ఈ.వి. ఫైనాన్సింగ్ పరిశ్రమ
ఎలక్ట్రిక్ వాహనాల కోసం తక్కువ ఖర్చుతో పాటు, ఆర్ధిక ఋణ సహాయాన్ని పెంచడానికి పరిష్కారాలను ప్రతిపాదిస్తున్న - కొత్త నివేదిక
Posted On:
09 MAR 2021 1:27PM by PIB Hyderabad
‘భారతదేశంలో విద్యుత్ వాహనాలకు ఆర్ధిక ఋణ సహాయాన్ని సమీకరించడం’ పై, నీతీ ఆయోగ్ మరియు ఆర్.ఎమ్.ఐ. ఇండియా సంస్థ సంయుక్తంగా ఒక కొత్త నివేదికను విడుదల చేసాయి. విద్యుత్ వాహనాలకు (ఈ.వి.లకు) భారతదేశ పరివర్తనలో ఆర్ధిక ఋణ సహాయం పాత్ర గురించి ఈ నివేదికలో ప్రముఖంగా పేర్కొనడం జరిగింది. వచ్చే దశాబ్దంలో విద్యుత్ వాహనాలు, మౌలిక సదుపాయాలు, బ్యాటరీలలో పరివర్తనకు మొత్తం 266 బిలియన్ డాలర్లు (19.7 లక్షల కోట్ల రూపాయలు), మేర మూలధన పెట్టుబడి అవసరమౌతుందని కూడా ఈ నివేదిక విశ్లేషించింది.
ఈ రోజున 60 బిలియన్ డాలర్లు (4.5 లక్షల కోట్ల రూపాయలు) గా ఉన్న, భారతదేశం యొక్క రిటైల్ వెహికల్ ఫైనాన్స్ పరిశ్రమ యొక్క ప్రస్తుత పరిమాణంలో 80 శాతం - 2030 లో విద్యుత్ వాహనాల ఆర్ధిక ఋణ సహాయం కోసం మార్కెట్ పరిమాణం 50 బిలియన్ డాలర్లు అంటే, 3.7 లక్షల కోట్ల రూపాయల మేర ఉంటుందని కూడా, ఈ నివేదిక గుర్తించింది.
"విద్యుత్ వాహనాల ఆస్తులు, మౌలిక సదుపాయాల వైపు మూలధనంతో పాటు ఆర్ధిక ఋణ సహాయాన్ని సమీకరించడం, ప్రస్తుత పరిస్థితుల్లో, ఎంతైనా అవసరం," అని నీతీ ఆయోగ్, సి.ఈ.ఓ., అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. "విద్యుత్ వాహనాల దేశీయ స్వీకరణను వేగవంతం చేయడానికి చేస్తున్న కృషితో పాటు, విద్యుత్ వాహనాలు, విడి భాగాలతో పాటు ముందస్తు రసాయన బ్యాటరీల తయారీని, ప్రపంచవ్యాప్త పోటీకి తగినట్టుగా రూపొందించడం కోసం, విద్యుత్ వాహనాల ఖర్చును తగ్గించడానికి, మూలధన ప్రవాహాన్ని పెంచడానికి, బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల అవసరం మనకు ఎంతైనా ఉంది.” అని, ఆయన వివరించారు.
సాంకేతిక పరిజ్ఞానం ఖర్చు, మౌలిక సదుపాయాల లభ్యత, వినియోగదారుల ప్రవర్తనతో సంబంధం ఉన్న అవరోధాలను అధిగమించడంపై, భారతదేశ విద్యుత్ వాహనాల పర్యావరణ వ్యవస్థ, ఇప్పటివరకు దృష్టి పెట్టింది. భారతదేశ విద్యుత్ రవాణా వ్యవస్థ పరివర్తనను వేగవంతం చేయడానికి, ఆర్ధిక ఋణ సహాయం కల్పించడమే, తదుపరి క్లిష్టమైన అవరోధంగా ఉంది.
ప్రస్తుతం, తుది వినియోగదారులు, అధిక వడ్డీ రేట్లు, అధిక బీమా రేట్లు, వాహనం విలువ కంటే తక్కువ ఋణం మంజూరు కావడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
ఈ సవాళ్లను పరిష్కరించడానికి, నీతీ ఆయోగ్ మరియు ఆర్.ఎం.ఐ. 10 పరిష్కారాలతో ఒక టూల్-కిట్ ను రూపొందించాయి. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్ధిక సంస్థలు (ఎన్.బి.ఎఫ్.సి) వంటి ఆర్థిక సంస్థలతో పాటు, పరిశ్రమలు, ప్రభుత్వం కూడా అవసరమైన మూలధనాన్ని సమకూర్చడానికి ఈ పరిష్కారాలను ఉపయోగించవచ్చు.
రాకీ మౌంటైన్ సంస్థ, సీనియర్ ప్రిన్సిపాల్, శ్రీ క్లే స్ట్రేంజర్ మాట్లాడుతూ, "వాహనాలకు ఆర్ధిక ఋణ సహాయాన్ని అందించే విధానాన్ని తిరిగి రూపొందించడంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించడం వంటి ప్రక్రియలు, 2030 నాటికి భారతదేశ రహదారులపై తిరిగే 50 మిలియన్ విద్యుత్ వాహనాలు తిరిగేలా విస్తరించడంలో కీలకం అవుతాయి." అని, పేర్కొన్నారు. "ఈ పరిష్కారాలు, ఆర్ధిక ఋణ సహాయంలో జోక్యం చేసుకోడానికి అధిక-పరపతి ప్రాంతాలను సూచిస్తాయి, వీటిలో ఎక్కువ శాతం భారతదేశానికి వర్తిస్తాయని మేము నమ్ముతున్నాము." అని, ఆయన అభిప్రాయపడ్డారు.
నివేదికలో సిఫారసు చేయబడిన 10 పరిష్కారాలలో ప్రాధాన్యత-రంగ రుణాలు మరియు వడ్డీ రేటు రాయితీ వంటి ఆర్థిక విధానాలు ఉన్నాయి. కాగా, మిగిలినవి, ఉత్పత్తి హామీలు, అభయపత్రాలను అందించడం ద్వారా ఓ.ఈ.ఎమ్. లు, ఆర్థిక సంస్థల మధ్య మంచి భాగస్వామ్యాన్ని సృష్టించడానికి సంబంధించినవి ఉన్నాయి. వీటితో పాటు, ఇంకా, అభివృద్ధి చెందిన, అధికారిక ద్వితీయ మార్కెట్టు, ఈ.వి. లను తిరిగి విక్రయించే విలువను మెరుగుపరుస్తుంది, వాటి బ్యాంకింగ్ సామర్థ్యాన్ని, ఇది మెరుగుపరుస్తుంది. నీతీ ఆయోగ్ లో సీనియర్ నిపుణులు శ్రీ రణధీర్ సింగ్ మాట్లాడుతూ, "ఈ.వి. ఫైనాన్స్ లో గుర్తించబడిన అడ్డంకులను వినూత్న ఫైనాన్సింగ్ మోడళ్లతో నిర్మాణాత్మక పద్ధతిలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది" అని, సూచించారు.
ఆర్ధిక ఋణ సహాయానికి అవసరమైన సిఫార్సులతో పాటు, డిజిటల్ లెండింగ్, బిజినెస్ మోడల్ ఇన్నోవేషన్, రవాణా సదుపాయాలూ, అగ్రిగేటర్ విద్యుదీకరణ లక్ష్యాలు, ఈ.వి. ల కోసం ఓపెన్ డేటా రిపోజిటరీని సృష్టించడం వంటి అంశాలతో కూడిన సిఫార్సులు కూడా ఇందులో ఉన్నాయి.
విద్యుత్ చైతన్యానికి పరివర్తన చెందిన భారతదేశంలో పెట్టిన పెట్టుబడికి, దేశంలో గణనీయమైన ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాలను సృష్టించే అవకాశం ఉందని కూడా నివేదిక పేర్కొంది. ఈ.వి. ల ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతూనే, కొత్త వ్యాపార నమూనాలు మరియు ఫైనాన్సింగ్ సాధనాలు ఆమోదం పొందుతాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ముందస్తు స్వీకరణకు దారితీసి, దేశీయ తయారీని ప్రోత్సహిస్తాయి, రాబోయే దశాబ్దంలో భారతదేశ ఈ.వి. మార్కెట్ వృద్ధికి సిద్ధంగా ఉంది.
నివేదికను ఇక్కడ పొందవచ్చు :
http://niti.gov.in/sites/default/files/2021-01/RMI-EVreport-VF_28_1_21.pdf
*****
(Release ID: 1703721)
Visitor Counter : 276