ఆయుష్

ఔషధ మొక్కల పెంపకానికి ప్రోత్సాహం

Posted On: 09 MAR 2021 3:33PM by PIB Hyderabad

దేశంలో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 'ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజనపథకాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర ఆయుర్వేదం,యోగా ప్రకృతి వైద్యం,యునాని,సిద్ద హోమియోపతి మంత్రిత్వశాఖ సహాయమంత్రి (అదనపు భాద్యతలు) శ్రీ కిరణ్ రిజిజు తెలిపారు. ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన మంత్రి కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలపవలసి ఉందని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఆర్ధిక మంత్రిత్వశాఖ ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 4000 కోట్ల రూపాయల ప్యాకేజిని ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రాంతాలలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ కింద రాష్టాలలో ఎంపిక చేసిన జిల్లాల్లో ప్రాధాన్యత కలిగిన  ఔషధ మొక్కలను సాగుచేయడానికి వాటికి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఈ కింది మార్గదర్శకాల ప్రకారం అమలు చేయడం  జరుగుతోంది. 

i)  రైతు భూమిలో ప్రాధాన్యత కలిగిన ఔషధ మొక్కల పెంపకం.

ii)నాణ్యమైన మొక్కలను అందించడానికి నర్సరీలను నెలకొల్పడం 

iii) కోత తరువాత  పంటలను రక్షించడం 

iv) ప్రాధమిక శుద్ధి, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన లాంటివి. 

ఈ పధకం కింద 140 రకాల ఔషధ మొక్కల సాగుకు అయ్యే ఖర్చుల్లో 30%,50% మరియు 70%వరకు సబ్సిడీగా అందిస్తారు. 

ఆయుష్ మంత్రిత్వ శాఖ, జాతీయ ఔషధ మొక్కల బోర్డులు అమలు చేస్తున్న 'ఔషధ మొక్కల పరిరక్షణ, అభివృద్ధి, సుస్థిర యాజమాన్య' పథకంలో భాగంగా ఈ కింది కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. 

i) పొలాలు /పొలాల వెలుపల సంరక్షణ 

ii)ఉమ్మడి అటవీ నిర్వహణ కమిటీలు (జెఎఫ్‌ఎంసి) / పంచాయతీలు / వాన్ పంచాయతీలు / జీవవైవిధ్య నిర్వహణ కమిటీలు (బిఎంసిలు) / స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జి) లతో జీవనోపాధి కార్యక్రమాల అనుసంధానం

iii) శిక్షణ / వర్క్‌షాప్‌లు / సెమినార్లు / సమావేశాలు లాంటి ఐఇసి కార్యకలాపాలు

iv) పరిశోదన మరియు అభివృద్ది

v) ఔషధ మొక్కలఉత్పత్తులకు ప్రోత్సాహం , మార్కెటింగ్ మరియు వ్యాపారం 

పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా లభ్యత, మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయుష్ మంత్రిత్వశాఖ దేశంలో రైతుల భూముల్లో 140 రకాల ఔషధ మొక్కలను సాగు చేయడానికి  అయ్యే ఖర్చుల్లో 30%,50% మరియు 70%వరకు సబ్సిడీగా అందిస్తోంది. ఇంతవరకు జాతీయ ఆయుష్ మిషన్ పథకం కింద ఆయుష్ మంత్రిత్వశాఖ 56396  హెక్టార్లలో ఔషధ మొక్కల సాగుకు సహకారం అందించిందని మంత్రి వివరించారు. 2015-16 నుంచి 2020-21 ఆర్ధిక సంవత్సరాల్లో ఔషధ మొక్కల సాగులో వున్న భూముల వివరాలను మంత్రి వివరించారు. 

ఆయుష్ మంత్రిత్వశాఖ సిద్ధం చేసిన  'ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజన' పథకానికి కేంద్రమంత్రివర్గం లభించిన తరువాత దేశవ్యాపితంగా దానిని అమలు చేస్తారు. 

***



(Release ID: 1703543) Visitor Counter : 234


Read this release in: English , Urdu , Bengali