రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ప్రభుత్వానికి రూ.174.43 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ చెల్లించిన బెల్‌

Posted On: 08 MAR 2021 2:43PM by PIB Hyderabad

రక్షణ రంగంలో నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), 2020-21 ఆర్థిక సంవత్సరానికి 140 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది.

    రాష్ట్రపతి వద్దనున్న వాటాలపై వచ్చిన డివిడెండ్‌ 174,43,63,569.20 రూపాయలకుగాను, బెల్‌ సీఎండీ శ్రీ ఎం.వి.గౌతమ, రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌కు చెక్కును అందించారు. బెల్‌, 140 శాతం మధ్యంతర డివిడెండ్‌ను (ఒక్కో షేరుపై రూ.1.40) తన వాటాదారులకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రకటించింది.

    మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించడం బెల్‌కు వరుసగా ఇది 18వ ఏడాది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో, 280 శాతం డివిడెండ్‌ను ఆ సంస్థ చెల్లించింది.

***



(Release ID: 1703221) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Hindi , Punjabi