శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మహిళలకు బాసటగా నిలుస్తున్న శాస్త్ర సాంకేతిక శాఖ
- ఎస్‌టీఈఎం రంగాలలో మంచి భవిష్యత్తు కల్పించేందుకు జీవితంలోని అన్ని ప్రయణాలు, దశలలో మహిళలకు మద్దతునిస్తున్న డీఎస్‌టీ కార్యక్రమాలు
Posted On:
07 MAR 2021 10:06AM by PIB Hyderabad
అంతర్జాతీయ మహిళా దినోత్సవం దిశగా:
భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతాల నుండి వచ్చిన పాఠశాలల విద్యార్థుల బృందం కనబరుస్తున్న ఆసక్తి అద్భుతంగా నిలుస్తోంది, వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువహతిని సందర్శించారు. అప్పుడు వారు నాసాకు చెందిన వివిధ శాస్త్రవేత్తలను కలుసుకొని మరియు వారితో సంభాషించారు. విజ్ఞాన్ జ్యోతి అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు శాస్త్ర, సాంకేతికతలో గల వివిధ అవకాశాలు మరియు 3డి ప్రింటింగ్, ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్, డిజైన్, పాలిమర్స్, సోలార్ సెల్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్ని గురించి పరిచయం చేశారు. యువతులను సైన్స్ పట్ల ఆసక్తి చూపమని ప్రోత్సహించే విధంగా కేంద్ర సైన్స్ &టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ (డీఎస్‌టీ) ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది డిసెంబర్, 2019 నుండి 50 జవహర్ నవోదయ విద్యాలయాలలో (జేఎన్‌వీ) విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు 2021-22 సంవత్సరానికి గాను మరో 50 జేఎన్‌వీలకు ఇది విస్తరించబడింది. విజ్ఞాన్ జ్యోతి కార్యకలాపాలలో భాగంగా విద్యార్థి - తల్లిదండ్రుల కౌన్సెలింగ్, ప్రయోగశాలలు మరియు జ్ఞాన కేంద్రాల సందర్శన, రోల్ మోడళ్లతో పరస్పర చర్యలు, సైన్స్ క్యాంప్‌లు, అకాడెమిక్ సపోర్ట్ క్లాసులు, రిసోర్స్ మెటీరియల్ పంపిణీ మరియు టింకరింగ్ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్ అకాడెమిక్ మద్దతులో భాగంగా వీడియో క్లాసులు, స్టడీ మెటీరియల్స్, రోజువారీ ప్రాక్టీస్ సమస్యలు, సందేహాల క్లియరింగ్ సెషన్‌లు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎస్‌టీఈఎ లో మహిళల భాగస్వామ్యం అనేక సామాజిక మరియు మనస్తత్వ అవరోధాల కారణంగా ప్రవేశ స్థాయి నుండి అత్యున్నత దశ వరకు పరిమితం చేయబడింది. దైహిక అవరోధాలు మరియు నిర్మాణాత్మక కారకాల కారణంగా విద్యా మరియు పరిపాలనా నిచ్చెన పైకి వెళ్ళడంలో వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. ఎస్‌టీఈఎంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి డీఎస్‌టీ యొక్క నిబద్ధత దేశంలో యువ మరియు ప్రతిభావంతులైన అమ్మాయిలను గుర్తించడం విజ్ఞాన్ జ్యోతి కార్యక్రమం ద్వారా సైన్స్ పట్ల వారిలో ఆసక్తిని రేకెత్తించడం ద్వారా ప్రారంభమవుతుంది. విజ్ఞాన్ జ్యోతి కార్యక్రమం ద్వారా సైన్స్ పట్ల వారి ఆసక్తి కలిగిస్తుంది మరియు తరువాత మహిళలు తమ సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందడానికి తగు వాతావరణాన్ని సృష్టించి విస్తరించింది. జెండర్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇన్‌స్టిట్యూ షన్ (జీఏటీఐ) అనేది ఆయా సంస్థలలో లింగ సమతుల్యతను తీసుకువచ్చే ప్రయత్నం. మహిళా -విశ్వవిద్యాలయాలలో మరియు భారత-అమెరికాలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి యూనివర్శిటీ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ ఉమెన్ యూనివర్సిటీల కన్సాలిడేషన్ (సీయుఆర్ఐఈ) లక్ష్యంగా పెట్టుకుంది. దీనికితోడు ఫెలోషిప్ ఫర్ విమెన్ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ (డబ్ల్యుఐఎస్‌టీఈఎంఎం) వారి సామర్థ్యాన్ని, ఉత్సాహాన్ని పెంచడానికి కొన్ని ఉత్తమ అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థలకు మహిళలను పరిచయం చేస్తుంది. మహిళలకు శాస్త్ర సాంకేతికతలో
సమ్మిళిత చేయడం మరియు అవగాహనను కల్పించేందుకు గాను జీఏటీఐని ప్రారంభించడం జరిగింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ మరియు మెడిసిన్ తదితర రంగాలలో లింగ సమానత్వం కల్పించేందుకు గాను
జీఏటీఐకి శ్రీకారం చుట్టడమైంది. సీయుఆర్ఐఈ కార్యక్రమం నుంచి లభిస్తున్న మద్దతు ఫలితంగా సీయుఆర్ఐఈ- మద్దతు కలిగిన విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) మరియు పీహెచ్‌డీ స్థాయిలలో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. దీని కారణంగా ఎన్ఈటీ / జీఏటీఈ అర్హత కలిగిన విద్యార్థుల సంఖ్యను కూడా పెరిగింది. అధునాతన ప్రయోగశాలలు ఉన్నందున అదనపు నిధులు కూడా పెంచబడ్డాయి, దీని ఫలితంగా అధిక ప్రభావ కారకాల పత్రికలలో వీరి ప్రచురణలు ప్రచురితమవుతున్నాయి. ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు భవిష్యత్తు కోసం నైపుణ్యం కలిగిన మానవ శక్తిని సిద్ధం చేయడానికి గాను ఏఐ- స్నేహపూర్వక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 6 సీయుఆర్ఐఈ లబ్ధిదారులైన విశ్వవిద్యాలయాలలో డీఎస్‌టీ ఒక కృత్రిమ మేధస్సు ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. ఇండో- అమెరికా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం (ఐయుఎస్ఎస్‌టీఎఫ్) వారి సౌజన్యంతో చేపట్టిన కొత్త డబ్ల్యుఐఎస్‌టీఈఎంఎం కార్యక్రమం అనేక మంది మహిళా శాస్త్రవేత్తలకు అంతర్జాతీయంగా పరిచయం చేసింది. పరిశోధనలకు సంబంధించిన పలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో శిక్షణ కోసం 40 మంది మహిళా శాస్త్రవేత్తలు రెండు బ్యాచ్‌లలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని (యుఎస్ఏ) ప్రముఖ సంస్థలను సందర్శించారు. వివిధ యంత్రాంగాలతో సైన్స్ అండ్ టెక్నాలజీలో లింగ సమానత్వాన్ని తీసుకురావాలనే ఆదేశంతో డీఎస్‌టీ వివిధ మహిళా-ప్రత్యేక పథకాలు చేపడుతోంది. ఎస్‌టీఈఎం రంగాలలో వారివారి వృత్తిని నిర్మించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి అన్ని చర్యలు మరియు దశలలో మహిళలకు తగు మద్దతునిస్తున్నాయి.
******
(Release ID: 1703124)
Visitor Counter : 148