ఆర్థిక మంత్రిత్వ శాఖ
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ సోదాలు
Posted On:
07 MAR 2021 12:52PM by PIB Hyderabad
చెన్నై కేంద్రంగా పని చేస్తున్న రెండు గ్రూపుల లావాదేవీల విషయమై ఆదాయపు పన్ను శాఖ 04.03.2021న సోదాలు నిర్వహించింది. ఇందులో తమిళనాడులో ప్రముఖ బులియన్ వ్యాపారి కేసు ఒకటి కాగా.. మరొకటి దక్షిణ భారత దేశంలో అతిపెద్ద ఆభరణాల రిటైలర్ సంస్థది. చెన్నై, ముంబయి, కోయంబత్తూర్, మదురై, తిరుచి, త్రిస్సూర్, నెల్లూరు, జైపూర్, ఇండోర్‌లలోని మొత్తం 27 ప్రాంగణాల్లో సోదాలతో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ సోదాలలో బులియన్ వ్యాపారి ప్రాంగణంలో లెక్కకు చూపని నగదు అమ్మకాలు, దాని శాఖల నుండి చేసిన బోగస్ నగదు క్రెడిట్‌లకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఆధారాలు లభించాయి. కొనుగోళ్ల ముందస్తు చెల్లింపు ముసుగులో డమ్మీ ఖాతాల్లో నగదు క్రెడిట్స్; నోట్ల రద్దు కాలంలో ఎలాంటి వివరణ లేని నగదు డిపాజిట్లు; బోగస్ రుణదాతలకు చెల్లింపులు; భారీగా వివరించలేని స్టాక్ వైవిధ్యాలను సోదాల్లో గుర్తించారు. ఆభరణాల రిటైలర్ ప్రాంగణంలో లభించిన ఆధారాలలో పన్ను చెల్లింపుదారుడు స్థానిక ఫైనాన్షియర్ల నుండి నగదు రుణాలను అందుకున్నట్టు మరియు తిరిగి చెల్లించినట్టుగా ఉంది; బిల్డర్లకు నగదు రుణాలు ఇవ్వడం, రియల్ ఎస్టేట్ ఆస్తులలో నగదు పెట్టుబడులు పెట్టడం; లెక్కలు చూపకుండా బంగారు కడ్డీల కొనుగోళ్లు; తప్పుడు అప్పులను చూపడం; పాత బంగారాన్ని చక్కటి బంగారం మరియు ఆభరణాల తయారీకి మార్చడంలో ఎక్కువగా వ్యర్థాలుగా చూపడం వంటివి ఉన్నాయి. ఇప్పటివరకు చేసిన సోదాలలో బయటకు వెల్లడించని రూ.1,000 కోట్లు. లెక్కించని నగదు రూ.1.2 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
****
(Release ID: 1703123)
Visitor Counter : 127