ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం-50వ రోజు


ఇప్పటివరకు 2కోట్ల 6 లక్షలకు పైగా కోవిడ్ టీకా డోసులు

ఈరోజు సాయంత్ర 7 వరకు 11.64 లక్షల టీకాడోసులు

Posted On: 06 MAR 2021 9:49PM by PIB Hyderabad

ఈరోజువరకు దేశవ్యాప్తంగా వేసిన మొత్తం కోవిడ్ టీకాల సంఖ్య 2 కోట్ల ఆరు లక్షలు దాటింది. దేశవ్యాప్త టీకాల కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16న మొదలు కాగా కోవిడ్ యోధులకు ఫిబ్రవరి 2 నుంచి ఇవ్వటం మొదలుపెట్టారు. తరువాత దశ మార్చి 1న మొదలైంది. ఈ దశలో 45 ఏళ్ళ వయసు పైబడి పైబడి దీర్ఘకాలవ్యాధులతో బాధపడేవారు, 60 ఏళ్ళు దాటినవారు టీకాలు తీసుకుంటున్నారు.  

సాయంత్రం 7 గంటలవరకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం ఈ రోజు వరకు 2,06,62,073 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో 69,72,859 మంది మొదటి డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, 35,22,671 మంది రెండో డోస్ తీసుకున్న  ఆరోగ్య సిబ్బంది ఉండగా 65,02,869 మంది మొదటి డోస్ తీసుకున కోవిడ్ యోధులు, 1,97,853 మంది రెండో డోస్ తీసుకున్న కోవిడ్ యోధులు,  4,60,782 మంది 60 ఏళ్ళు పైబడ్డవారు, 30,05,039 మంది 45 ఏళ్ళుదాటి ఇతర దీర్ఘకాల వ్యాధులతోబాధపడేవారు ఉన్నారు.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు  

 60 ఏళ్ళు పైబడ్డవారు

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

69,72,859

35,22,671

65,02,869

1,97,853

4,60,782

30,05,039

 

దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో 50వ రోజైన నేటి సాయంత్రం 7 గంటలవరకు మొత్తం11,64,422 మందికి టీకా డోసులిచ్చారు.  అందులో 9,44,919 లబ్ధిదారులు మొదటి డోస్ అందుకోగా  2,19,503 మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు రెండో డోస్ అందుకున్నారు. తుది నివేదిక రాత్రిపొద్దుపోయాక అందుతుంది.

తేదీ: మార్చి 6, 2021 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు 

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

57198

165841

146880

53662

114036

626805

944919

219503

 ***



(Release ID: 1702950) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Hindi , Marathi