ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆగ్రాలోని ఐసీఎంఆర్‌- ఎన్‌జేఐఎల్ & ఓఎండీలో కొత్త పరిశోధన భవనం ‘దేశికన్ భవన్’ను ప్రారంభించిన డాక్టర్ హర్ష్ వర్ధన్


Posted On: 06 MAR 2021 4:10PM by PIB Hyderabad

ఆగ్రాలోని ఐసీఎంఆర్‌- ఎన్‌జేఐఎల్ & ఓఎండీ ప్రాంగ‌ణంలో కోవిడ్‌-19 రోగ‌నిర్ధార‌క స‌దుపాయంతో కూడిన కొత్త పరిశోధన‌ భవనం.. దేశికన్ భవన్ను గౌరవనీయ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్ష్‌వర్ధన్ ప్రారంభించారు.

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, కేంద్ర ఆరోగ్య పరిశోధన శాఖ‌ల కార్యదర్శి ప్రొఫెసర్ బలరామ్ భార్గవల స‌మ‌క్షంలో మంత్రి ఈ భ‌వ‌నాన్ని ప్రారంభించారు. జంతువుల ప్రయోగం, కోవిడ్‌-19 నిర్ధారణ, వివిధ మైకోహాక్టెరియుల మొత్తం జన్యు శ్రేణి: జాతులు, టీబీల‌కు వ్యతిరేకంగా ఔషధాల‌ అభివృద్ధికి  ఔషధ మొక్కల నుండి ఫైటోకెమికల్ వెలికితీత వంటి పరిశోధన సౌకర్యాల కోసం ఈ భవనం అంకితం చేయబడింది. ఈ భ‌వ‌నంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 డయాగ్నొస్టిక్ లాబొరేటరీ సామర్థ్యం.. రోజుకు 1200 నమూనాలను ప‌రీక్షించ‌డం. ఈ కోవిడ్‌ డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లో బయో సేఫ్టీ లెవల్ -II (బీఎస్ఎల్‌ I) క్యాబినెట్‌లు, ఆటోమేటెడ్ ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్టర్లు, రియల్ టైమ్ పీసీఆర్‌లతో కూడిన‌ మెషీన్‌లతో లోడ్ చేయబడతాయి. దీనితో రోగనిర్ధారణ ఫలితాలు ఒక రోజులో వెల్ల‌డించేందుకు వీలుపుడుతుంది. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో చేసిన కృషికి గాను డీజీ, ఐసీఎంఆర్ ను గౌర‌వ మంత్రి ప్ర‌ధానంగా ప్ర‌శంసించారు. భవిష్యత్తులో వెలుగులోకి వ‌చ్చే వివిధ అంటు వ్యాధులను నివారించడానికి, నిర్వహ‌ణ‌లో ఇది ఎంత‌గానో సహాయపడుతుంద‌ని అన్నారు. 2025 నాటికి దేశంలో టీబీని అంతం చేయాల‌నే మ‌న ప్రియ‌త‌మ ప్ర‌ధాన మంత్రి స్వ‌ప్నాన్ని సాకారం చేసే దిశ‌గా ఐసీఎంఆర్ సంస్థ‌ చేస్తున్న క్షయవ్యాధి నిర్ధారణ‌, చికిత్స చ‌ర్య‌ల‌ను మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు. మైక్రోబాక్టీరియల్ పరిశోధన రంగంలో ఐసీఎంఆర్ ఎన్‌జీఐఎల్ & ఓఎమ్‌డిలో జరుపుతున్న కృషిని డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ ప్రశంసించారు. కోవిడ్‌-19 తీవ్ర‌త‌ను గుర్తించ‌డం, నిర్వ‌హించడంలో ఐసీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ విశేషంగా కృషి చేసింద‌ని డీజీ, ఐసీఎంఆర్ ను వ్యాఖ్యానించారు.

ఇది మహమ్మారి సత్వర నిర్వహణకు దోహదపడింద‌ని తెలిపారు. తీవ్ర ప్ర‌య‌త్నంతో ఐసీఎంఆర్ కోవిడ్‌-19 నిమిత్తం టీకాను 81 శాతం స‌మ‌ర్థ‌త‌తో అందుబాటులోకి తెచ్చింద‌ని అన్నారు. ఐసీఎంఆర్‌ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీపాద్ ఎ పాటిల్ మాట్లాడుతూ ఇన్‌స్టిట్యూట్‌లో కుష్టు వ్యాధి, టీబీకి సంబంధించిన రోగి సంరక్షణ కార్యకలాపాల గురించి వివ‌రించారు. ఐసీఎంఆర్‌- ఎన్‌జేఐఎల్ & ఓఎండీ వద్ద కొత్త భవనంలోని పరిశోధన సౌకర్యాల గురించి వివరించారు. కొత్త భవన‌ము ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఇన్‌స్టిట్యూట్ మొదటి డైరెక్టర్ డాక్టర్ కె.వి. దేశికన్ పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో గోరఖ్‌పూర్‌లోని ఐసీఎంఆర్- రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రజినీ కాంత్, బీఎంహెచ్‌ఆర్‌సీ డైరెక్టర్ డాక్టర్ ప్రభా దేశికన్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, స్థానిక యంత్రాంగం, ఎంపీ, రాష్ట్ర మంత్రులు, ఆగ్రా విశ్వవిద్యాలయానికి చెందిన‌ ఉప‌కుల‌పతి, ఎస్ ఎన్ మెడికల్ కళాశాలతో పాటుగా ఇతర సంస్థల ప్రిన్సిపాల్స్ కూడా హాజ‌రు అయ్యారు.

ఇన్‌స్టిట్యూట్‌ గురించి:

ఐసీఎంఆర్‌- నేషనల్ జల్మా ఇన్‌స్టిట్యూట్ ఫర్ లెప్రసీ అండ్ అదర్ మైకోబాక్టీరియల్ డిసీజెస్, ఆగ్రా సంస్థ‌ను జపాన్ లెప్రసీ మిషన్ ఫర్ ఆసియా (జల్మా) 1967లో స్థాపించింది. అనంత‌రం దీనిని 1976 లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు అప్పగించారు. ఐసీఎంఆర్‌-ఎన్‌జేఐఎల్ అండ్ ఓఎండీ

ఈ కింద‌న సూచించిన వివిధ వైద్య అంశాల‌లో కుష్టు వ్యాధి, టీబీ, ఇతర మైయో బాక్టీరియల్ వ్యాధులకు సంబంధించి ప్రాథమిక, అనువర్తిత పరిశోధనల్ని నిర్వహిస్తుంది: (i) ప్రారంభ రోగ నిర్ధారణ మరియు చికిత్స, ట్రాన్స్మిషన్ డైనమిక్స్ (ii) కుష్టు వ్యాధి (ii) క్షేత్ర అధ్యయనాలు (iv) కార్యాచరణ పరిశోధన (v) మైకోబాక్టీరియల్ వ్యాధులపై ప్రయోగశాల పరిశోధన, కుష్టు వ్యాధికి ఎంఐపీ వ్యాక్సిన్.

****


(Release ID: 1702940) Visitor Counter : 188


Read this release in: English , Urdu , Hindi , Punjabi