వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది ఖరీఫ్ పంటల సీజన్ లో 14.52% పెరిగిన వరి సేకరణ


ఇంతవరకు 670.44 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ

సేకరించిన మొత్తం వరిలో పంజాబ్ లోనే 202.82 లక్షల మెట్రిక్ టన్నుల ( 30.25% ) వరి సేకరణ

3,10,264.93 కోట్ల విలువ చేసే పప్పుధాన్యాలు, నూనెగింజలను సేకరించిన ప్రభుత్వ సంస్థలు

కనీస మద్దతు ధర కార్యక్రమం వల్ల 18,97,002 రైతులకు ప్రయోజనం

Posted On: 05 MAR 2021 4:07PM by PIB Hyderabad

ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో గత సీజన్ లలో  సేకరించిన విధంగానే కనీస మద్దతు ధరలను చెల్లిస్తూ ఖరీఫ్ పంటలను సేకరిస్తున్నది. 

కేంద్రపాలిత ప్రాంతాలు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, తెలంగాణ,తమిళనాడు, ఛత్తీస్ ఘర్, జమ్మూకాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్,ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, అస్సాం, పశ్చిమబెంగాల్ మరియు త్రిపుర రాష్ట్రాలలో 2020-21 ఖరీఫ్ కాలంలో వరి సేకరణ సజావుగా కొనసాగుతోంది. 04.03.2021 వరకు 670.44  లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించడం జరిగింది. గత ఏడాది ఇదేకాలంతో పోల్చి చూస్తే వరి సేకరణ 14.52% పెరిగింది. గతఏడాది ఇదేకాలంలో ఇదే సమయానికి 585.41 లక్షల  మెట్రిక్ టన్నుల వరిని సేకరించారు. సేకరించిన మొత్తం 670.44 లక్షల మెట్రిక్ టన్నుల వరిలో 30.25% అంటే 202.82  లక్షల మెట్రిక్ టన్నుల వరిని పంజాబ్ లోనే సేకరించడం జరిగింది. 

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో కనీస మద్దతు ధర చెలిస్తూ సేకరించిన 1,26,580.51 కోట్ల రూపాయల విలువ చేసే వరిని సేకరించడం ద్వారా 97.90 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించడం జరిగింది. 

ఇంతేకాకుండా, రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు 2020-21 ఖరీఫ్ 2021 రబీ పంటకాలాల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, గుజరాత్ ,హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్  మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మద్దతు ధర పథకం కింద 94.39 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను సేకరించడానికి అనుమతులు జారీఅయ్యాయి. 1.23 లక్షల మెట్రిక్ టన్నుల ఎండు కొబ్బరిని సేకరించడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు అనుమతులు జారీఅయ్యాయి. పప్పుధాన్యాలు,నూనెగింజలు, ఎండు కొబ్బరి సేకరణకు ప్రతిపాదనలు అందిన తరువాత ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతులను ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కనీస మద్దతు ధర కంటే మార్కెట్ ధరలు తక్కువగా వున్న సమయంలో సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదు చేసుకున్న రైతుల నుంచి నేరుగా సేకరించడానికి రాష్ట్రాలు నామినేట్ చేసే నియమించే సేకరణ సంస్థల ద్వారా కేంద్ర నోడల్ సంస్థలకు అవకాశం కలుగుతుంది. 

తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో 04.03.2001 వరకు 2020-21 ఖరీఫ్,2021 రబీ పంట కాలాల్లో 1,670.83 కోట్ల రూపాయల విలువ చేసే 3,10,264.93 మెట్రిక్ టన్నుల పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, వేరుశెనగ మరియు సోయాబీన్ పంటలను సేకరించి 1,68,311 మంది రైతులకు ప్రయోజనం కలిగించడం జరిగింది.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 3961 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారి నుంచి 52.40 కోట్ల రూపాయల విలువ చేసే 5089 మెట్రిక్ టన్నులఎండు కొబ్బరిని సేకరించడం జరిగింది. పప్పుధాన్యాలు, నూనెగింజలు మార్కెట్ కు చేరిన తరువాత సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయించే తేదీ నుంచి వాటిని  సేకరించడానికి  సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత అవసరమైన సౌకర్యాలను కల్పిస్తాయి. 

పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పత్తి గింజల సేకరణ సజావుగా కొనసాగుతున్నది. 04.03.2021 వరకు ఈ రాష్ట్రాల్లో 26,716.31 కోట్ల రూపాయల విలువ చేసే 91,80,412 బేళ్ల పత్తిని 18,97,002 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ సేకరించడం జరిగింది.  

 

****

 



(Release ID: 1702850) Visitor Counter : 168