నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
నవీకరణయోగ్య శక్తి సంబంధిత సహకారం అంశం లో భారతదేశాని కి, ఫ్రాన్స్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
03 MAR 2021 1:04PM by PIB Hyderabad
నవీకరణయోగ్య శక్తి సంబంధిత సహకారం లో భారతదేశానికి, ఫ్రాన్స్ గణతంత్రానికి మధ్య ఓ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలు చేయడాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టి కి తీసుకు రావడమైంది. ఈ ఎమ్ఒయు పై కిందటి నెల లో సంతకాలయ్యాయి.
నూతన మరియు నవీకరణయోగ్య శక్తి రంగం లో పరస్పర ప్రయోజనం, సమానత్వం, ఆదాన ప్రదానం ల ప్రాతిపదిక న ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించుకోవడానికి ఒక ప్రాతిపదిక ను ఏర్పరచాలనేది ఈ ఎమ్ఒయు ధ్యేయం గా ఉంది. సౌర శక్తి, పవన శక్తి, హైడ్రోజన్, బయోమాస్ ఎనర్జిల కు సంబంధించిన సాంకేతికత లు ఈ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం పరిధి లోకి వస్తాయి.
ఈ ఎమ్ఒయు లో: -
• విజ్ఞానశాస్త్ర సంబంధిత సిబ్బంది కి, సాంకేతిక సిబ్బంది కి శిక్షణనివ్వడం; వారిని రెండు దేశాలూ పరస్పరం ఆదాన ప్రదానం చేసుకోవడం;
• విజ్ఞానశాస్త్ర పరమైన, సాంకేతిక విజ్ఞానశాస్త్ర పరమైన సమాచారాన్ని, డేటా ను రెండు దేశాలూ పరస్పరం వెల్లడి చేసుకోవడం;
• వర్క్ షాపులను, చర్చ సభల ను నిర్వహించడం; ఉపకరణాలను, సాంకేతిక సమాచారాన్ని బదలాయించడం;
• సంయుక్తం గా పరిశోధనల ను, సాంకేతిక విజ్ఞానం సంబంధిత ప్రాజెక్టుల ను అభివృద్ధి పరచడం.. అనేవి భాగాలు గా ఉంటాయి.
ఈ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం నవీకరణ యోగ్య శక్తి రంగం లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడం లో తోడ్పడుతుంది. దీని ద్వారా 2030వ సంవత్సరాని కల్లా 450 గీగావాట్ (జిడబ్ల్యు) మేరకు స్థాపిత నవీకరణయోగ్య శక్తి సామర్ధ్యాన్ని సాధించుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకొనే ప్రక్రియ కు ఊతం లభించనుంది.
***
(Release ID: 1702230)
Visitor Counter : 159