ఆర్థిక మంత్రిత్వ శాఖ
50.03 కోట్ల రూపాయల ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ మోసానికి పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్టు చేసిన ఢిల్లీ సిజిఎస్‌టి కమిషనరేట్ అధికారులు.
Posted On:
28 FEB 2021 10:50AM by PIB Hyderabad
తూర్పుఢిల్లీకి చెందిన సెంట్రల్ గూడ్స్ , సర్వీసెస్ టాక్స్ (సిజిఎస్‌టి) కమిషనరేట్ అధికారులు , జిఎస్‌టికి సంబంధించిన నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పత్రాలురూపొందించి వాటిని పాస్ చేస్తున్న ఒక నకిలీ సంస్థలను , దాని ఆపరేటర్‌ను కనుగొన్నారు. నకిలీ సంస్థల నెట్ వర్క్‌ను విశాల్ అనే వ్యక్తి నడుపుతుండడాన్ని అధికారులు గుర్తించారు. అతను వృత్తిరీత్యా అడ్వకేట్, ఇతను ఢిల్లీలోని కర్‌కర్‌డూమా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నట్టు గుర్తించారు.
విశాల్ తన పేరుమీద నకిలీ సంస్థను సృష్టించి దానిని తన నివాసం చిరునామాతో రిజిస్టర్ చేయించాడు. ఆ తర్వాత అతను ఎలాంటి వ్యాపారం లేని పలు నకిలీ సంస్థలు సృష్టించేందుకు అతను వివిధ వ్యక్తుల కెవైసిలను సమర్పించాడు. నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను పాస్ చేసే ఉద్దేశంతోనే అతను ఈ నకిలీ సంస్థలను సృష్టించినట్టు గుర్తించారు. ఆ రకంగా అతను ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లజేసేందుకు ప్రయత్నించాడు. అతని ఇంటిని సోదా చేసినపుడు పలు కెవైసిలు, చెక్కులు కనుగొన్నారు. ఇన్‌వాయిస్ మొత్తంపై రెండు శాతం కమిషన్‌తో అతను తన క్లయింట్‌లకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ను పాస్ చేస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం 50.03 కోట్ల రూపాయల మొత్తానికి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను అతను పాస్ చేసినట్టు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి న వివరాలు ఇంకా దర్యాప్తులో ఉన్నందున ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.
నిందితుడు విశాల్ నేరపూరిత కుట్రతో ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు కుట్రపన్నినట్టు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి అతిను సిజిఎస్‌టి చట్టం 2017 లోని సెక్షన్ 132 (1), (బి), 132 (1) (సి) ల కింద నేరాలకు పాల్పడినట్టు కేసు నమోదు చేశారు. సెక్షన్ 132 (5) కింద ఇవి కాగ్నయిజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలు. పైన పేర్కొన్న చట్టం ప్రకారం ఇవి క్ సెక్షన్ 132 కింద సబ్ సెక్షన్ 1 క్లాజ్ 1 ప్రకారం శిక్షార్హమైన నేరాలు. దీనితో విశాల్‌ను సిజిఎస్‌టి చట్టం2017 సెక్షన్ 69(1) ప్రకారం అరెస్టుచేసి డిప్యూటి మేజిస్ట్రేట్ ఎదుట 27-02-2021 న హాజరుపరచగా, అతనిని 13-03-2021 వరకు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి రిమాండ్‌కు పంపారు. ఈ కేసును తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
జిఎస్‌టి సెంట్రల్ టాక్స్ ను తీసుకువచ్చినప్పటినుంచి ఢిల్లీజోన్ 4019.95 కోట్ల రూపాయల జిఎస్‌టి ఎగవేతకు సంబంధించి 27 అరెస్టులు చేసింది.
***
(Release ID: 1701497)
Visitor Counter : 141