జల శక్తి మంత్రిత్వ శాఖ

స్వచ్ఛ ఐకానిక్ స్థలాలు - నాలుగో దశలో భాగంగా 12 దర్శనీయ ప్రదేశాలను 'స్వచ్చ పర్యాటక గమ్యస్థానాలు'గా మారుస్తామని జల్‌మంత్రిత్వశాఖ ప్రకటించింది.

Posted On: 25 FEB 2021 4:35PM by PIB Hyderabad

స్వచ్ భారత్ మిషన్ గ్రామీన్ (ఎస్‌బిఎం-జి) చొరవతో స్వచ్ ఐకానిక్ ప్లేసెస్ (ఎస్‌ఐపి) కింద దేశంలోని గొప్ప వారసత్వ, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రదేశాలను 'స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా' మార్చాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంకల్పించారు. అందులో భాగంగా తాగునీరు మరియు పారిశుధ్యం (డిడిడబ్ల్యుఎస్), జల్ శక్తి మంత్రిత్వ శాఖలు ఎస్‌ఐపి యొక్క 4వ  దశ కింద క్రింది పన్నెండు (12) ఐకానిక్ సైట్ల ఎంపికను ప్రకటించింది.

1. అజంతా గుహలు, మహారాష్ట్ర
2. సాంచి స్థూపం, మధ్యప్రదేశ్
3. కుంభల్‌గఢ్ కోట, రాజస్థాన్
4. జైసల్మేర్ కోట, రాజస్థాన్
5. రామ్‌దేవ్రా, జైసల్మేర్, రాజస్థాన్
6. గోల్కొండ కోట, హైదరాబాద్, తెలంగాణ
7.  సన్ టెంపుల్, కోణార్క్, ఒడిశా
8. రాక్ గార్డెన్, చండీగఢ్
9. దాల్ సరస్సు, శ్రీనగర్, జమ్మూ & కాశ్మీర్
10. బాంకే బిహారీ ఆలయం, మధుర, ఉత్తర ప్రదేశ్
11. ఆగ్రా కోట, ఆగ్రా, ఉత్తర ప్రదేశ్
12 కలిఘాట్ ఆలయం, పశ్చిమ బెంగాల్

ఈ ప్రదేశాల వద్ద మరియు చుట్టుపక్కల పారిశుధ్యం మరియు పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా దేశీయ మరియు విదేశీ సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం . ఎస్ఐపి ప్రధాన లక్ష్యం ఈ ప్రదేశాలలో ప్రత్యేకించి పరిధుల్లో పరిశుభ్రత యొక్క ఉన్నత స్థాయిని సాధించడం.  ఈ ప్రాజెక్టును గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు సంబంధిత రాష్ట్ర / కేంద్రపాలిత ప్రభుత్వాల సహకారంతో అమలు చేస్తాయి. ఈ పథకాన్ని తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ (డిడిడబ్ల్యుఎస్), జల్ శక్తి మంత్రిత్వ శాఖలు సమన్వయం చేస్తున్నాయి.

***



(Release ID: 1700805) Visitor Counter : 223