రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఫార్మాసూటిక‌ల్స్‌కు ఉత్పాద‌క‌త‌తో ముడిప‌డిన ప్రొత్సాహక ప‌థ‌కాన్ని ఆమోదించిన కేంద్ర కేబినెట్‌

Posted On: 24 FEB 2021 3:47PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఫార్మాసూటిక‌ల్స్‌కు ఉత్పాద‌క‌త‌తో ముడిప‌డిన ప్రోత్సాహ‌క ప‌థ‌కాన్ని (పిఎల్ఐ) 020-21 ఆర్థిక సంవ‌త్స‌రం  నుంచి 2028-29 వ‌ర‌కు వ‌ర్తించేలా ఆమోదించింది. 

ఈ ప‌థ‌కం దేశీయ ఉత్ప‌త్తిదారుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. ఇది ఉపాధి క‌ల్పించ‌డ‌మే కాకుండా వినియోగ‌దారుల‌కు అందుబాటు ధ‌ర‌లో మందులు ల‌భ్య‌మ‌య్యేవిధంగా చూస్తుంది.

ఈ ప‌థ‌కం దేశంలొ ఉన్న‌త విలువ‌గ‌ల ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హించ‌నుంది.  అలాగే ఎగుమ‌తుల‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌నుంది.  2022-23 నుంచి 2027-28 మ‌ధ్య ఆరేళ్ల కాలంలో మొత్తం ఇంక్రిమెంట‌ల్ అమ్మకాలు 2,94.000 కోట్ల రూపాయ‌లు, ఇంక్రిమెంట‌ల్ ఎగుమ‌తులు  1,96,000 కోట్ల రూపాయ‌ల‌కు చేరుకోగ‌ల‌వ‌ని అంచ‌నా.

ఈ ప‌థ‌కం నైపుణ్యం క‌లిగిన‌, నైపుణ్యం లేని ప‌నివారికి ఉపాధి క‌ల్పించ‌నుంది. ఈ రంగం పురోగ‌తి కార‌ణంగా ప్ర‌త్య‌క్షంగా 20,000 మందికి ప‌రొక్షంగా 80,000 మందికి ఉపాధి క‌ల్పించ‌గ‌ల‌ద‌ని అంచ‌నా.

సంక్లిష్ట‌మైన‌, ఉన్న‌త స్థాయి ఉత్ప‌త్తుల ఆవిష్క‌ర‌ణ‌ల‌ను అభివృద్ధి చేసేందుకు త‌గిన ప్రోత్సాహకం ఇవ్వ‌నుంది. వివిధ ర‌కాల వినూత్న చికిత్స‌లు, ఇన్ విట్రో డ‌యాగ్న‌స్టిక్ ప‌రిక‌రాల త‌యారీ లో అలాగే కీల‌క ఔష‌ధాల విష‌యంలో స్వావ‌లంబ‌న సాధించ‌నున్నాం.

 

టార్గెట్ గ్రూపులు:

ఇండియాలో రిజిస్ట‌ర్ అయిన్ ఫార్మాసూటిక‌ల్ ఉత్ప‌త్తుల‌ను వాటి అంతర్జాతీయ త‌యారీ రాబడి (జిఎంఆర్‌) ఆధారంగా గ్రూప్ చేస్తారు.  ఫార్మాసూటిక‌ల్ రంగంలో విస్తృతంగా దీనిని వ‌ర్తింప‌చేయ‌డానికి , అలాగే ఈ ప‌థ‌కం ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చేలా చూసేందుకు ఈ గ్రూపింగ్ చేస్తారు.మూడు గ్రూపుల ద‌ర‌ఖాస్తుదారుల‌కు సంబంధించిన అర్హ‌తా నిబంధ‌న‌లు కిందివిధంగా ఉంటాయి.

 

(ఎ) గ్రూప్ :ఎ : అంత‌ర్జాతీయ త‌యారీ రాబ‌డి ( 2019-20) సంవ‌త్స‌రానికి ఫార్మ‌సూటిక‌ల్ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి రూ 5,000 కోట్ల రూపాయ‌ల‌కంటే ఎక్కువ ఉన్న ద‌ర‌ఖాస్తుదారులు

 

(బి)  గ్రూప్ బి: 2019-20 ఆర్ఙ‌త‌క సంవ‌త్స‌రానికి  ఫార్మాసూటిక‌ల్ ఉత్ప‌త్తుల అంత‌ర్జాతీయ త‌యారీ రాబ‌డి 500 కోట్ల రూపాయ‌ల నుంచి రూ 5000 కోట్ల మ‌ధ్య (వాటితో క‌లిపి) ఉన్న ద‌ర‌ఖాస్తుదారులు 

(సి):  2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఫార్మాసూటిక‌ల్ ఉత్ప‌త్తుల అంత‌ర్జాతీయ త‌యారీ రాబ‌డి 500 కోట్ల రూపాయ‌ల‌కంటే త‌క్కువ ఉన్న ద‌ర‌ఖాస్తుదారులు. ఈ గ్రూపులో ఎం.ఎస్‌.ఎం.ఇ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి వారి స‌వాళ్లు, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఒక స‌బ్‌గ్రూప్‌ను ఏర్పాటు చేస్తారు.

 ప్రోత్సాహ‌కాల ప‌రిమాణం:

పాల‌నాప‌ర‌మైన వ్య‌యంతోపాటు మొత్తం ప్రోత్సాహకం ఈ ప‌థ‌కం కింద సుమారు రూ 15,000 కోట్ల రూపాయ‌లు గా ఉంది. ఈ ప్రోత్సాహ‌కం కేటాయింపులు వివిధ టార్గెట్ గ్రూప్‌ల మ‌ధ్య ఇలా ఉండ‌నుంది.

(ఎ) గ్రూప్ ఎ:  రూ 11,000 కోట్లు

(బి) గ్రూప్ బి:  రూ 2,.250 కోట్లు

(సి) గ్రూప్ సి:  రూ 1,750 కోట్లు

గ్రూప్ ఎ , గ్రూప్ సి ద‌ర‌ఖాస్తుదారుల‌కు కేటాయించిన ప్రోత్సాహ‌కాన్ని ఏ ఇత‌ర కేట‌గిరీకి మ‌ళ్లించ‌రారు. అయితే, గ్రూప్ బి ద‌ర‌ఖాస్తుదారుల‌కు కేటాయించిన ప్రోత్సాహ‌కం ఉప‌యోగించకుండా మిగిలిన‌ట్ట‌యితే దానిని గ్రూప్ ఎ ద‌ర‌ఖాస్తుదారుల‌కు మ‌ళ్ళించ‌వ‌చ్చు.

 త‌యారైన స‌ర‌కు ఇంక్రిమెంట‌ల్ అమ్మ‌కాల‌ను లెక్కించేందుకు  2019-20 ఆర్ధిక సంవ‌త్స‌రాన్ని బేస్ సంవ‌త్స‌రంగా ప‌రిగ‌ణిస్తారు.

 

వివిధ ఉత్ప‌త్తుల‌ ర‌కాలు:

ఈ ప‌థ‌కం కింద ఫార్మాసూటిక‌ల్ ఉత్ప‌త్తుల‌ను మూడు కేట‌గిరీల కింద వ‌ర్గీక‌రించి వ‌ర్తింప‌చేస్తారు.

కేట‌గిరీ -1

బ‌యో ఫార్మాసూటిక‌ల్స్‌, సంక్లిష్ట జెనిరిక్ ఔష‌ధాలు. పేటెంటెట్ క‌లిగిన ఔష‌ధాలు లేదా పేటెంట్ గ‌డువు ముగియ‌డం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ఔష‌ధాలు, సెల్ ఆధారిత లేదా జీన్ చికిత్స ఔష‌ధాలు, ఆర్ఫ‌న్ డ్ర‌గ్స్‌, హెచ్‌పిఎంసి, పుల్లులాన్‌, ఎంట‌రిక్ వంటి స్పెష‌ల్ ఎంప్టీడ్ర‌గ్స ఉన్నాయి. అలాగే సంక్లిష్ట ఎక్స్‌సిసిపిఇంట్‌లు, ఫైటో ఫార్మాసూటికల్స్‌, ఆమోదిత ఇత‌ర ఔష‌ధాలు ఉన్నాయి.

(బి) కేట‌గిరీ 2: ఇందులో క్రియాశీల ఫార్మాసూటిక‌ల్ ఉత్ప‌త్తులు, కీల‌క ప్రారంభ మెటీరియ‌ల్‌, డ్ర‌గ్ ఇంట‌ర్‌మీడియ‌ట్‌లు ఉన్నాయి.

(సి) కేట‌గిరీ 3: ( ఇందులో కేటగిరి 1, కేట‌గిరి 2 కింద చేర‌ని ఔష‌ధాలు )  ఉన్నాయి.

 రీ ప‌ర్ప‌స్‌డ్ డ్ర‌గ్స్‌, ఆటో ఇమ్యూన్ డ్ర‌గ్స్‌, కాన్స‌ర్ వ్య‌తిరేక ఔష‌ధాలు, షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించే ఔష‌ధాలు, యాంటీ ఇన్ఫెక్టివ్ ఔష‌ధాలు, గుండె చికిత్స కు,మాన‌సిక వ్యాధులు, యాంటీ రిట్రోవైర‌ల్ ఔష‌ధాలు త‌దిత‌రాలు ఉన్నాయి. అలాగే ఇన్‌విట్రో డ‌యాగ్నస్టిక్ ఉప‌క‌ర‌ణాలు, ఇత‌ర ఆమోదిత ఔష‌ధాలు, ఇండియాలో త‌యారు చేయ‌ని ఔష‌ధాలు ఉన్నాయి.

 ఈ ప‌థ‌కం కింద ప్రోత్సాహ‌కం రేటు  కేట‌గిరీ -1 , కేట‌గిరి 2 ఉత్ప‌త్తుల‌కు మొదటి నాలుగు సంవ‌త్స‌రాల‌కు వాటి ఇంక్రిమెంట‌ల్ అమ్మ‌కాల విలువ‌పై 10 శాతం వ‌ర‌కు ఉంటుంది.5 వ‌సంవ‌త్స‌రం 8 శాతం, ఆరో సంవ‌త్స‌రం ఉత్ప‌త్తికి  6 శాతం ఉంటుంది.

కేటగిరి 3 ఉత్ప‌త్తుల‌కు మొదటి నాలుగు సంవ‌త్స‌రాల‌కు ఇంక్రిమెంట‌ల్ అమ్మ‌క‌పు విలువ‌పై 5 శాతం , ఐదో సంవ‌త్స‌రం నాలుగు శాతం, ఆరో సంవ‌త్స‌రం ఉత్పత్తిపై 3 శాతం ప్రోత్సాహ‌కం ఉండ‌నుంది

ఈ ప‌థ‌కం అమ‌లు అయ్యే కాలం 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 2028-29 ఆర్థిక సంవ‌త్స‌రం . 2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రం ద‌ర‌ఖాస్తులు ప్రాసెస్ అయ్యే కాలం కూడా ఇందులో క‌ల‌సి ఉంటుంది. ఆప్ష‌న‌ల్ జెస్టేష‌న్ కాలం ఒక సంవ‌త్స‌రం ( 2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రం), ఆరు సంవ‌త్స‌రాల‌కు ప్రోత్సాహ‌కం, 2028-29 ఆర్ధిక సంవ‌త్స‌రానికి 2027-28 ఆర్ధిక సంవ‌త్స‌రం అమ్మ‌కాల‌పై ప్రోత్సాహ‌కం పంపిణీ వంటివి ఇందులో ఉంటాయి.

 

నేప‌థ్యం:

భార‌త‌దేశ ఫార్మాసూటిక‌ల్ ప‌రివ్ర‌మ పరిమాణంలో ప్ర‌పంచంలోనే 3వ అతిపెద్ద ప‌రిశ్ర‌మ‌. విలువ ప్ర‌కారం చూస్తే 40 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు. అంత‌ర్జాతీయంగా ఎగుమ‌తి అవుతున్న ఔష‌ధాలు, మందుల‌లో మ‌న దేశం 3.5 శాతం వాటా క‌లిగి ఉంది. ఇండియా సుమారు 200  దేశాల‌కు, అత్యంత నియంత్రిత మార్కెట్‌లు అయిన అమెరికా, యుకె. యూరోపియ‌న్ యూనియ‌న్‌, కెన‌డా త‌దిత‌ర ప్రాంతాల‌కు ఔష‌ధాల‌ను  ఎగుమ‌తి  చేస్తుంది. ఫార్మాసూటిక‌ల్ రంగం అభివృద్ధి , త‌యారీ రంగ అభివృద్ధికి ఇండియాలో అద్భుత అవ‌కాశాలు ఉన్నాయి. వివిధ ఫార్మా కంపెనీల‌కు అత్యంత ఆధునిక స‌దుపాయాలు ఉన్నాయి. అత్యంత నైపుణ్యం క‌లిగిన , సాంకేతిక నైపుణ్యాలు క‌లిగిన మాన‌వ వ‌న‌రులు ఉన్నాయి. దేశంలో ఎన్నొ పేరెన్నిక గ‌న్న ఫార్మా సూటిక‌ల్ విద్యా సంస్థ‌లు , ప‌రిశోధ‌న సంస్థ‌లు  గ‌ట్టి మ‌ద్ద‌తు నిచ్చే ఇత‌ర అనుబంధ ప‌రిశ్ర‌మ‌లు ఎన్నో ఉన్నాయి.

ప్ర‌స్తుతం త‌క్కువ విలువ క‌లిగిన జెనిరిక్ మందులు భార‌తీయ ఎగుమ‌తుల‌లో ప్ర‌ధాన పాత్ర వ‌హిస్తున్నాయి. దేశంలో  పేటెంట్ ఔష‌ధాల‌కు సంబంధించి  డిమాండ్ లో ఎక్కువ భాగం దిగుమ‌తుల ద్వారా స‌మ‌కూర్చుకుంటున్నారు . దీనికి కార‌ణం భార‌తీయ ఫార్మా సూటిక‌ల్ రంగానికి అత్యున్న‌త విలువ క‌లిగిన ఉ త్ప‌త్తులు,అందుకు అవ‌స‌ర‌మైన ఫార్మా ప‌రిశోధ‌న అభివృద్ధి లేక‌పోవ‌డ‌మే. దేశీయంగా, అంత‌ర్జాతీయంగా ఈ రంగంలోని సంస్థ‌ల‌ పెట్టుబ‌డుల‌ను  పెంచ‌డానికి, వైవిధ్యంతో కూడిన కేట‌గిరీల‌లో ఉత్ప‌త్తుల‌ను విస్త‌రించ‌డానికి త‌గిన‌ప్ర‌ణాళిక క‌లిగిన ల‌క్షిత ప్రోత్సాహ‌క విధానం అవ‌స‌రం. ప్ర‌త్యేకించి అత్యంత విలువ క‌లిగిన బ‌యో ఫార్మాసూటిక‌ల్స్‌, సంక్లిష్ట జ‌న‌రిక్ ఉత్ప‌త్తులు, పేటెంటెడ్ ఉత్ప‌త్తులు లేదా గ‌డువు తీరుతున్న పేటెంట్  ఉత్ప‌త్తులు , సెల్ ఆధారిత లేదా జీన్ థెర‌పీ ఉత్ప‌త్తులు ఇందులో ఉన్నాయి.ఈ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా  ప్ర‌స్తుత ప్రోత్సాహ‌క ప‌థ‌కం ఉంది.

 

***



(Release ID: 1700657) Visitor Counter : 162