గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
జాతీయ పట్టణ డిజిటల్ మిషన్ (ఎన్.యు.డి.ఎం) తో పాటు పట్టణ పాలనను మెరుగుపరచడానికి అనేక డిజిటల్ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి
పట్టణ పాలనకు పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానం
ఇండియా అర్బన్ డేటా ఎక్స్ఛేంజ్ (ఐ.యు.డి.ఎక్స్) ప్రొడక్షన్ వెర్షన్, స్మార్ట్-కోడ్ ప్లాట్-ఫామ్ కూడా ప్రారంభించబడింది
ఐ.యు.డి.ఎక్స్ తో సురక్షితమైన, నమ్మదగిన సమాచార పంపిణీ విధానం
సమాచారం సమకూర్చేవారికీ, సమాచారం వినియోగించుకునేవారికీ అనుకూలమైన ఇంటర్ఫేస్ విధానం
ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం కొత్త స్మార్ట్ సిటీస్ వెబ్-సైట్ మరియు జియోస్పేషియల్ నిర్వహణ సమాచార విధానం - ఎమ్.ఐ.ఎస్. అభివృద్ధి చేయబడింది
Posted On:
23 FEB 2021 6:13PM by PIB Hyderabad
'కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన' గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దృష్టి సారించే, పౌర-కేంద్రీకృత పాలనను రూపొందించే దిశగా, పట్టణ మరియు సాంకేతిక రంగాల నుండి అపారమైన ఉత్తేజాన్ని పొందడానికి, జాతీయ పట్టణ డిజిటల్ మిషన్ అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ (ఇంచార్జ్) మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పురి, పేర్కొన్నారు. జాతీయ పట్టణ డిజిటల్ మిషన్ (ఎన్.యు.డి.ఎం)తో పాటు, ఇతర కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పౌరులందరికీ సేవ చేయాలనే వాగ్దానాన్ని నెరవేర్చడానికి మంత్రిత్వ శాఖ అన్ని యు.ఎల్.బి.లతో, చిన్న పని నుండి పెద్ద పని వరకు పూర్తిచెయ్యాలి మరియు మద్దతు ఇవ్వాలని చెప్పారు. ఈ రోజు పట్టణ భారతదేశానికి "సబ్-కా- సాథ్, సబ్-కా-వికాస్, సబ్-కా-విశ్వాస్" అంటే ఇదే అని, ఆయన తెలిపారు. పౌరులకు సేవ చేసి, భాగస్వామ్యాలను నిర్మించడంతో పాటు, స్థానిక సమస్యలను స్థానికంగా పరిష్కరించడానికి, ప్రతి నగరం మరియు పట్టణం యొక్క సామర్థ్యాన్ని ఇది పెంచుతుందనీ, ఆయన వివరించారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐ.టి. శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడుతూ, డిజిటల్ శాస్త్ర పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకుంటేనే నగరాలు తెలివిగా మారుతాయని అన్నారు. ఈ కార్యక్రమాలను ప్రారంభించడంలో ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటంటే, డిజిటల్ విధానం ద్వారా మంచి పాలనకు కేంద్రీకరణ సమగ్రంగా ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఈ కేంద్రీకరణ అనేది కేవలం ఈ పథకానికి చెందిన లబ్ధిదారులలో మాత్రమే కాక, ఈ కేంద్రీకరణకు బాధ్యత వహించే అన్ని విభాగాలకు వర్తిస్తుందని, ఆయన పేర్కొన్నారు. స్వదేశీ, అభివృద్ధి, తక్కువ ఖర్చుతో పాటు సమ్మిళతమై ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని సాధించవచ్చునని, ఆయన చెప్పారు.
గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ; ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖతో కలిసి ఈ రోజు, ఇక్కడ, జాతీయ పట్టణ డిజిటల్ మిషన్ (ఎన్.యు.డి.ఎం) ను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో - గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ దుర్గా శంకర్ మిశ్రా; ఎమ్.ఈ.ఐ.టి.వై. కార్యదర్శి శ్రీ ఎ.పి.సాహ్నీ తో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన - ఇండియా అర్బన్ డేటా ఎక్స్ఛేంజ్ (ఐ.యు.డి.ఎక్స్); స్మార్ట్-కోడ్; స్మార్ట్-సిటీస్ 2.0 వెబ్-సైట్; జియోస్పేషియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జి.ఎం.ఐ.ఎస్) వంటి పలు ఇతర డిజిటల్ వ్యవస్థలను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. నగరాలను మరింత స్వావలంబన దిశగా మార్చడంతో పాటు, ఆయా నగర పౌరుల అవసరాలను తీర్చి, సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, ప్రధానమంత్రి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్న, డిజిటల్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ వంటి పధకాలను సాకారం చేయడానికి రెండు మంత్రిత్వ శాఖలు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ కార్యక్రమాలను అమలుచేస్తున్నారు.
జాతీయ పట్టణ డిజిటల్ మిషన్ (ఎన్.యు.డి.ఎం) :
జాతీయ పట్టణ డిజిటల్ మిషన్ (ఎన్.యు.డి.ఎం) - నగరాలు, పట్టణాలకు సంపూర్ణ సహాయాన్ని అందించడానికి ప్రజలు, ప్రక్రియ, వేదిక అనే మూడు ముఖ్య పునాదులపై పనిచేస్తూ, పట్టణ భారతదేశం కోసం షేర్డ్ డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోంది. 2022 నాటికి 2022 నగరాల్లోనూ, 2024 నాటికి భారతదేశంలోని అన్ని నగరాలు మరియు పట్టణాల్లోనూ, పట్టణ పాలన మరియు సేవా పంపిణీకి పౌర-కేంద్రీకృత మరియు పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానాన్ని, ఇది, సంస్థాగతీకరిస్తుంది.
* భారతదేశ వ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలు, వాటి అవసరాలు, స్థానిక సవాళ్లకు అనుగుణంగా, సమగ్రమైన, విభిన్నమైన మద్దతు నుండి ప్రయోజనం పొందటానికి వీలు కల్పించే విధంగా - గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ డిజిటల్ కార్యక్రమాలను ఏకీకృతం చేసి, పరపతిని పరీక్షించే భాగస్వామ్య డిజిటల్ మౌలిక సదుపాయాలను ఎన్.యు.డి.ఎం. సృష్టిస్తుంది.
* ఎన్.యు.డి.ఎం. అనేది పౌర-కేంద్రీకృత, పర్యావరణ వ్యవస్థ-ఆధారిత, రూపకల్పన మరియు అమలు రెండింటి సూత్రాలు ఆధారంగా ఉంటుంది. దీని వ్యూహం మరియు విధానాన్ని మొహూవా ఫిబ్రవరి, 2019 లో విడుదల చేసింది. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2019 లో విడుదల చేసిన వ్యూహం మరియు విధానానికి అనుగుణంగా, ఎన్.యూ.డి.ఎం. పాలక సూత్రాలకు కట్టుబడి ఉంటుంది, మరియు జాతీయ పట్టణ ఆవిష్కరణల కేంద్రం (ఎన్.యు.ఐ.ఎస్) యొక్క సాంకేతిక రూపకల్పన సూత్రాలను వారసత్వంగా పొందుతుంది. ప్రజలు, ప్రక్రియ, వేదిక అనే మూడు స్తంభాలపై ఆధారపడిన సూత్రాలు, ప్రమాణాలు, లక్షణాలు, ధృవపత్రాలకు దారి తీస్తాయి.
ఇండియా అర్బన్ డేటా ఎక్స్ఛేంజ్ (ఐ.యు.డి.ఎక్స్)
ఇండియన్ పట్టణ సమాచార మార్పిడి సంస్థను, స్మార్ట్-సిటీస్ మిషన్ మరియు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి) మధ్య భాగస్వామ్యంతో, అభివృద్ధి చేయడం జరిగింది. నగరాలు, పట్టణాల పాలనకూ, పట్టణ సేవల పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని భాగస్వామ్యం చేయడానికీ, అభ్యర్థించడానికీ, ఉపయోగించడానికీ వీలుగా, యు.ఎల్.బి. లతో సహా సమాచారాన్ని అందజేసేవారికీ, సమాచారాన్ని వినియోగించుకునేవారికీ ఈ ఐ.యు.డి.ఎక్స్. ఒక సౌకర్యవంతమైన ఇంటర్‌ఫేస్ గా పనిచేస్తుంది. ఐ.యూ.డి.ఎక్స్. అనేది బహిరంగ వనరుల సాఫ్ట్-వేర్ వేదిక, ఇది వివిధ సమాచార వేదికలు, తృతీయ పక్షం ద్వారా ప్రామాణీకరించబడిన, అధీకృత యాప్ లు మరియు ఇతర వనరుల మధ్య సురక్షితమైన, ప్రామాణీకరించబడిన మరియు నిర్వహించబడే సమాచార మార్పిడిని సులభతరం చేస్తుంది. ఐ.యూ.డి.ఎక్స్. లోని నగరాల సంఖ్య విస్తరిస్తున్న కొద్దీ, ఇది భారతదేశంలోని మొత్తం పట్టణ ప్రాంతాలలోని, సమాచార ఉత్పత్తిదారులు, సమాచార వినియోగదారుల మధ్య ఒకేవిధమైన, సౌకర్యవంతమైన భాగస్వామ్యానికి వీలు కల్పిస్తుంది. నగరాల్లోనూ, నగరాల మధ్యా సమాచార లోపం సమస్యను పరిష్కరించడానికి వీలుగా, ఐ.యు.డి.ఎక్స్. రూపొందించబడింది. నగరాలు పెద్ద మొత్తంలో సమాచారాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఈ సమాచారాన్ని, ప్రభుత్వ పరిధిలోనూ, అలాగే పరిశ్రలు, విద్యా సంబంధమైన సంస్థలతో పాటు, పౌర సమాజంలోని అనేక సంస్థలు నమోదు చేస్తాయి. ఈ విభిన్న రకాల సమాచారం మొత్తం వేగవంతమైన ఆవిష్కరణలకు, అలాగే పట్టణ అవసరాలు, సవాళ్లను బాగా అర్థం చేసుకోవడానికీ, తదనుగుణంగా ప్రణాళికలు రచించడానికీ వీలు కల్పిస్తుంది. రూపకల్పన ద్వారా భద్రత, గోప్యతా రక్షణలను పరిష్కరించేటప్పుడు, భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి, సమాచార నిర్మాతలు లేదా యజమానులు, తాము పంచుకున్న లేదా భాగస్వామ్యం చేసుకున్న సమాచారంపై పూర్తి నియంత్రణతో, సురక్షితమైన, నమ్మదగిన ఛానెల్ ను, ఈ ఐ.యు.డి.ఎక్స్. సృష్టిస్తుంది.
స్మార్ట్ కోడ్ వేదిక :
స్మార్ట్-కోడ్ అనేది ఒక పర్యావరణ వ్యవస్థ. వాటాదారులను వివిధ పరిష్కారాలు మరియు పట్టణ పాలన కోసం, యాప్ లకోసం బహిరంగ వనరుల కోడ్ యొక్క కేంద్రంగా దోహదపడేలా చేసే వేదిక. తిరిగి మొదటి నుండి కొత్త పరిష్కారాలను అభివృద్ధి చేయకుండా, ఇప్పటికే ఉన్న కోడ్ ల ప్రయోజనాన్ని పొందడానికి నగరాలను ప్రారంభించడం మరియు స్థానిక అవసరాలకు అనుగుణంగా వాటిని సరిచేయడం ద్వారా, అభివృద్ధిలో యు.ఎల్.బి.లు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, అదేవిధంగా, పట్టణ సవాళ్లను పరిష్కరించడానికి వీలుగా డిజిటల్ యాప్ లు వినియోగించడానికీ, ఇది రూపొందించబడింది. బహిరంగ వనరుల సాఫ్ట్-వేర్ యొక్క కేంద్రంగా, ఈ వేదికలో లభించే వనరుల కోడ్ ను ఎటువంటి లైసెన్సు రుసుము లేదా చందా రుసుము లేకుండా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అందువల్ల కొత్తగా ఒక కోడ్ ను సవరించుకోడానికీ, స్థానికంగా సంబంధిత పరిష్కారాన్ని అభివృద్ధి చేసుకోడానికీ అయ్యే సంబంధించిన ఖర్చులను తగ్గించుకోవచ్చు.
నూతన స్మార్ట్-సిటీస్ వెబ్-సైట్ వెర్షన్ 2.0 మరియు జి.ఎం.ఐ.ఎస్.
స్మార్ట్-సిటీల మిషన్ల ప్రయత్నాలు, విజయాలపై ప్రజలతో బాగా అనుసంధానం కావడానికి, అదేవిధంగా, యు.ఎల్.బి. లు, పౌరులు వారి పనికి సంబంధించిన వనరులను వినియోగించుకోవడాన్ని సులభతరం చేయడానికి, స్మార్ట్-సిటీల మిషన్ వెబ్-సైట్ అన్ని స్మార్ట్-సిటీల అవసరాలకూ, ఒకే కేంద్రంగా తిరిగి రూపకల్పన చేయడం జరిగింది. జియో-స్పేషియల్ నిర్వహణ సమాచార విధానం (జి.ఎం.ఐ.ఎస్) ఈ వెబ్‌సైట్‌తో అనుసంధానించబడింది. వెబ్-సైట్ స్మార్ట్-సిటీస్ మిషన్ కోసం ఒక ఏక గవాక్ష కేంద్రాన్ని సృష్టిస్తుంది. మిషన్ కింద ప్రారంభించిన అన్ని వేదికలకు, కార్యక్రమాలకు ఈ పోర్టల్ ముఖద్వారంగా పనిచేస్తుంది. వెబ్-సైట్, ఎటువంటి అవరోధాలు లేని ఏకీకృత వ్యవస్థ ద్వారా, వివిధ వేదికల నుండి మిషన్ సంబంధిత సమాచారం / కార్యక్రమాలను అనుసంధానం చేస్తుంది. పబ్లిక్ యూజర్ యొక్క అవసరాలను తీర్చగల ఆటోమేటెడ్ మిషన్ తాజా సమాచారాలను చూపుతుంది. వెబ్-సైట్ అత్యంత ప్రభావవంతమైన కమ్యూనికేషన్ మరియు వ్యాపించే సాధనంగా ఉపయోగించడానికి అభివృద్ధి చేయబడింది.
స్మార్ట్-సిటీస్ మిషన్ పై తాజా సమాచారం :
2015 లో ప్రారంభించినప్పటి నుండి, సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రయోజనాలు పౌరులందరికీ చేరేలా చేసే ప్రయత్నాలలో, స్మార్ట్-సిటీస్ మిషన్ గణనీయమైన ప్రగతి సాధించింది. స్మార్ట్ సిటీలతో కలిసి, ప్రాజెక్టులను ప్రారంభించి, పూర్తి చేయడంపై దృష్టి సారించి, గత ఏడాది ఈ మిషన్ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసింది. 2021 ఫిబ్రవరి, 21వ తేదీ నాటికి స్మార్ట్-సిటీస్ ప్రణాళికల ప్రకారం, 2,05,018 కోట్ల రూపాయల మేర ఆమోదించబడిన, మొత్తం పెట్టుబడులకు గాను, మిషన్ పరిధిలోని స్మార్ట్-సిటీలు 7 1,72,425 కోట్ల రూపాయల విలువైన 5,445 ప్రాజెక్టులను (మొత్తంలో 84 శాతం) చేపట్టాలని నిర్ణయించారు. 1,38,068 కోట్ల రూపాయల విలువైన 4,687 ప్రాజెక్టులకు (మొత్తంలో 67 శాతం) పని ఉత్తర్వులు (వర్క్ ఆర్డర్లు) జారీ చేయగా, 36,652 కోట్ల రూపాయల విలువైన 2,255 ప్రాజెక్టులు (మొత్తంలో 18 శాతం) పూర్తి అయ్యాయి.
ఇంకా, 50+ స్మార్ట్-సిటీలు తమ ఐ.సి.సి.సి.లను కోవిడ్-19 అత్యవసర కేంద్రాలుగా మార్చి, కోవిడ్ ప్రతిస్పందనతో వ్యవహరించే వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేయడం ప్రారంభించాయి. సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవడం, కోవిడ్ హాట్-స్పాట్ లు మరియు వైద్య మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, వస్తువులు, సేవల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడంతో పాటు, లాక్-డౌన్ నిర్వహణ కోసం అనేక స్మార్ట్-సిటీలలో సమగ్ర సమాచార వ్యవస్థలను అభివృద్ధి చేయడం జరిగింది.
ఇతర కార్యక్రమాలు వందకు పైగా స్మార్ట్ సిటీలలో అమలౌతున్నాయి. జీవన నాణ్యతను, నగర పనితీరును లెక్కకట్టడానికి, ఫలితం మరియు పనితీరు అంచనా విధానాన్ని 114 నగరాల్లో, జీవన సౌలభ్యం సూచిక మరియు మునిసిపల్ పనితీరు సూచికల ఆధారంగా రూపొందించడం జరిగింది. నగర పౌరుల అవగాహన సర్వే ద్వారా 31 లక్షల మంది పౌరుల నుండి సమాచారాన్ని సేకరించడం జరిగింది.
యు.ఎల్.బి. లలోని అవకాశాలను తాజా గ్రాడ్యుయేట్ల అభ్యాస అవసరాలతో సరిపోల్చడం లక్ష్యంగా, పట్టణ విజ్ఞానాన్ని నేర్చుకునే శిక్షణా కార్యక్రమం (తులిప్) పనిచేస్తోంది. 280 కి పైగా యు.ఎల్.బి. లు 14,240 మందికి శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి; ప్రస్తుతం 932 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు; ఇంతవరకు 195 మంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేశారు.
నగరాలను మరింత స్థిరంగా మరియు స్థితిస్థాపకంగా మార్చడానికి, వాతావరణ పరంగా స్మార్ట్-సిటీ లను అంచనా వేసే విధానం (సి.ఎస్.సి.ఎ.ఎఫ్) ను 100 స్మార్ట్-సిటీలలో ప్రారంభించడం జరిగింది. వాతావరణ మార్పు అనే అంశం నుండి పట్టణ ప్రణాళిక మరియు పాలనను చూసేవిధంగా, నగరాలకు సహాయపడటానికి, రెండవ విడత వార్షిక అంచనా ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. నగరాల కోసం వాతావరణ కేంద్రం (సి-3) ను ఎన్.ఐ.యు.ఏ. లో స్థాపించడం జరిగింది. ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్, స్ట్రీట్స్ ఫర్ పీపుల్ ఛాలెంజ్, నర్చరింగ్ నైబర్-హుడ్స్ ఛాలెంజ్ వంటి అనేక జాతీయ సవాళ్లు కూడా అమలౌతున్నాయి.
*****
(Release ID: 1700352)
Visitor Counter : 328