భారత పోటీ ప్రోత్సాహక సంఘం
టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌ను పానాటోన్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపిన సిసిఐ
Posted On:
23 FEB 2021 11:25AM by PIB Hyderabad
కాంపిటీషన్ యాక్ట్ 2002లోని సెక్షన్ 31(1) కింద టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (టిసిఎల్)ను కొనుగోలు చేసేందుకు పానాటోన్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ (కొనుగోలుదారు)కు మంగళవారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత కలయిక ద్వారా ప్రతిపాదిత వాటాసేకరణనకు అనుగుణంగా 26.12% వాటాలకు మించకుండా లక్ష్యిత కంపెనీలో కొనుగోలుదారు (ప్రతిపాదిత కలయిక) స్వంతం చేసుకోవచ్చు. ప్రతిపాది కలయిక ఫలితంగా, కొనుగోలుదారు సంస్థ/ టఆటాగ్రూప్ తన వాటాలను 48.87% నుంచి 74.99% మించకుండా పెంచుకోవచ్చు.
కొనుగోలుదారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నమోదు చేసుకున్న సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ నాన్-డిపాజిట్ టేకింగ్ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (సిఐసి-ఎన్‌డి-ఎస్ ఐ) ( వాటాలను, సెక్యూరిటీలను కొనుగోలు చేసే సంస్థ). ఇది టాటా గ్రూప్‌కు చెందిన టాటా సన్స్‌కు అనుబంధ సంస్థ.
టిసిఎల్ అన్నది టాటా గ్రూప్‌లో భాగం, ఇది సమగ్ర సమాచార సేవలు సహా విస్త్రత శ్రేణిలో సౌకర్యాలను కల్పించే సంస్థ. ఇది హోల్‌సేల్ వాయిస్, ఎంటర్‌ప్రైజ్, కారియర్ డాటా సహా మూడు విభాగాల ద్వారా ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది. భారత దేశంలో టిసిఎల్ తన అనుబంధ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహించే దిగువన పేర్కొన్న కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది.
అంతర్జాతీయ సుదూర సేవలు (ఐఎల్‌డి) -వాయిస్
జాతీయ సుదూర సేవలు (ఎన్ ఎల్‌డి) - వాయిస్
సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థలు (యుసిఎస్)
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పి), అనుసంధానత, సందేశాలు, ఇంటర్నెట్ టెలిఫొనీ
విలువ ఆధారిత సేవలను అందించే వ్యాపారం.
ఇందుకు సంబంధించిన సిసిఐ వివరణాత్మక ఉత్తర్వులు జారీ కానున్నాయి.
****
(Release ID: 1700201)
Visitor Counter : 181