నీతి ఆయోగ్

భారత్-ఆస్ట్రేలియా స‌ర్క్యుల‌ర్ ఎకానమీ హాకథాన్‌ (ఐ-ఎసిఇ)’ 2021 ముగింపు సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ

భారత్-ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ (ఐ-ఎసిఇ ) హాకథాన్, 2021ని సంయుక్తంగా నిర్వహించిన నీతి ఆయోగ్ లో భాగమైన అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

నాలుగు విభాగాల్లో పాల్గొన్నభారతదేశం మరియు ఆస్ట్రేలియాలకు చెందిన అంకుర సంస్థలు / ఎంఎస్‌ఎంఇలు మరియు విద్యార్థులతో కూడిన 72 జట్లు

Posted On: 19 FEB 2021 5:13PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ లో భాగమైన అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆస్ట్రేలియా సైన్స్ ఏజెన్సీ కలసి సంయుక్తంగా నిర్వహించిన  ఇండియా-ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ (ఐ-ఎసిఇ  ) హాకథాన్2021 శుక్రవారం విజయవంతంగా ముగిసింది. వినూత్న ఆవిష్కరణలను ఆవిష్కరించిన  రెండు దేశాలకు చెందిన ఎనిమిది మంది  హాకథాన్ విజేతలుగా నిలిచారు. 

2021 ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఈ  హాకథాన్ లో భారత్ఆస్ట్రేలియా దేశాలకు అంకుర సంస్థలు / ఎంఎస్‌ఎంఇలు మరియు విద్యార్థులతో కూడిన 72 జట్లు  నాలుగు విభాగాల్లో పాల్గొన్నాయి. 

వర్చ్యువల్  విధానంలో శుక్రవారం ( 2021 ఫిబ్రవరి 19) జరిగిన ముగింపు సమావేశంలో పాల్గొన్న రెండు దేశాల ప్రధానమంత్రులు విజేతలను అభినందించి మాట్లాడారు. 

కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ విజేతలను అభినందించారు. " సర్క్యులర్ ఎకానమీ హాకథాన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే. కోవిడ్-19 నేపథ్యంలో మీ ఆవిష్కరణలు ప్రేరణ కలిగించే విధంగా వున్నాయి. పుడమి అందిస్తున్న వనరులకు మనం యజమానులం కాదు. వాటిని పరిరక్షించి భావి తరాలకు అందించడానికి ధర్మకర్తలుగా పనిచేయవలసి వుంది. వినియోగ విధానాలను పరిశీలించి,వాతావరణ సమతుల్యత దెబ్బ తినకుండా చూడడానికి ఉపకరించే మరిన్ని ఆవిష్కరణలను తీసుకుని రావడానికి మన రెండు దేశాలు ( భారత్ ఆస్ట్రేలియా) మరింతగా కృషి చేయవలసి ఉంటుంది. వీటి ఫలాలు మన రెండు దేశాలకే కాదు యావత్ ప్రపంచానికి ప్రయోజనం కలిగించాలి. వ‌స్తువుల‌ను రీసైకిల్ చేయ‌డంతిరిగి వినియోగం లోకి తెచ్చుకోవ‌డంవ్య‌ర్థాలను నిర్మూలించ‌డంవ‌న‌రులను స‌మ‌ర్ధం గా వాడుకొనే విధానాలను మెరుగు ప‌ర‌చుకోవ‌డం అనేది మ‌న జీవ‌న శైలిలో భాగంగా మారాలి. యువత విశాల దృక్పధంతో అలోచించి నూతన ఆలోచనలతో ముందుకు వచ్చే శక్తిని కలిగి ఉంటుంది.  కొవిడ్ అనంత‌ర కాలం లో నూతన ప్రపంచానికి రూపకల్పన చేసే అంశంలో భారత్ఆస్ట్రేలియా దేశాల మధ్య వున్న బంధం స్నేహం కీలకంగా ఉంటుందిఅని ప్రధానమంత్రి అన్నారు. 

నాలుగు విభాగాల్లో  (ఆహార వ్యర్థాలులోహ వ్యర్థాలుప్యాకేజింగ్ వ్యర్థాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలు) జరిగిన ఈ  హాకథాన్ లో పాల్గొడానికి 1000 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఇరు దేశాలకు చెందిన  అంకుర సంస్థలు / ఎంఎస్‌ఎంఇలు మరియు విద్యార్థులతో కూడిన 72 జట్లు మూడు రోజులపాటు జరిగిన హాకథాన్‌లో పాల్గొన్నాయి. హాకథాన్‌లో విజేతలుగా నిలిచిన భారతదేశ విజేతలు నగదు పురస్కారాలను అందుకుంటారు. వీరి ఆవిష్కరణలను మరింత మెరుగు పరచడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించడంతో పాటు వీటిని వాణిజ్య పరంగా ప్రారంభించడానికి అవసరమైన సహకారం కూడా అందజేస్తారు. 

విజేతలను అభినందించిన కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ లారి మార్షల్ శాస్త్ర పరిశోధనా రంగాలలో తమ సంస్థ భారతదేశంతో కలసి ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాదని అన్నారు. వ్యర్ధాలకు తావు లేని ఆర్ధిక వ్యవస్థ నిర్మాణానికి భారతదేశంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. 

'' సుస్థిరంగా మనుగడ సాగించడం మన రెండు దేశాలకే కాదు యావత్ ప్రపంచానికి సంబందించిన క్లిష్టమైన సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతి ఒక్కరూ కలసి పనిచేయవలసి ఉంటుంది. పరిశ్రమ పర్యావరణం ఒకదానితో ఒకటి పోటీ పడకుండా కలసి పనిచేయవలసి ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సుస్థిరతను సాధించడానికి జరిగే ప్రయత్నాలు లాభసాటిగా ఉంటూ ఆర్ధిక వెసులుబాటును కల్పించి నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి'' అని ఆయన వివరించారు. 

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె విజయరాఘవన్తూర్పు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీమతి రివా గంగూలీ దాస్ భారత ప్రతినిధులుగా సదస్సుకు హాజరయ్యారు.   పాల్గొన్న వారందరినీ అభినందించిన వీరు  స్థిరమైన అభివృద్ధి సాధించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ నూతన ఆవిష్కరణలతో సహకరించాలని కోరారు. 

కార్యక్రమంలో పాల్గొన్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ అదనపు కార్యదర్శి శ్రీ. ఆర్. రామనాన్ గత ఏడాది జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా  ఇండియా-ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ (ఐ-ఎసిఇ ) హాకథాన్, 2021 నిర్వహణకు భారత్,ఆస్ట్రేలియా దేశాల ప్రధానమంత్రులు పూర్తి సహకారాన్ని అందించారని అన్నారు.  ఇండియా-ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ (ఐ-ఎసిఇ  ) హాకథాన్, 2021 నూతన ఆవిష్కరణలు వేదికగా రెండు దేశాల మధ్య వున్న సహకారానికి వేదికగా నిలిచిందని ఆయన చెప్పారు. నూతన ఆవిష్కరణలకు నాంది పలికిన  ఇండియా-ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ (ఐ-ఎసిఇ  ) హాకథాన్, 2021ను నిర్వహించడానికి సహకరించిన  కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆయన విజేతలను అభినందించారు.  ఆవిష్కరణలు మార్కెట్ లో విజయం సాధించేలా చూడడానికి సహకరిస్తామని అన్నారు. 

***


(Release ID: 1699525) Visitor Counter : 195


Read this release in: English , Urdu , Hindi , Tamil