మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విశ్వ-భారతి విశ్వ విద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి జ్ఞానాని కి, సృజనాత్మకత కు ఎలాంటి హద్దు లేదు: ప్రధాన మంత్రి
బంగాల్ ను చూసి టాగోర్ గర్వించే వారు, ఆయన భారతదేశం లోని వైవిధ్యం అన్నా కూడా అంతగానూ గర్వించే వారు: ప్రధాన మంత్రి
దేశానికే పెద్ద పీట అనే విధానం పరిష్కార మార్గాల వైపునకు తీసుకుపోతుంది: ప్రధాన మంత్రి
ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ కు బంగాల్ ప్రేరణ గా ఉన్నది: ప‌్రధాన మంత్రి
ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణ పథం లో జాతీయ విద్య విధానం ఒక మహత్వపూర్ణమైన మైలు రాయి: ప‌్రధాన మంత్రి
Posted On:
19 FEB 2021 4:38PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు విశ్వ-భారతి విశ్వ విద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో పశ్చిమ బంగాల్ గవర్నరు, విశ్వ-భారతి రెక్టర్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖఢ్, కేంద్ర విద్య శాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్, విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే లు కూడా పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, వీర శివాజీ ని గురించి గురుదేవులు రవీంద్ర నాథ్ టాగోర్ రాసిన ఒక పద్యం లోని కొన్ని పంక్తుల ను ప్రస్తావించారు. అది తనకు ప్రేరణ ను ఇచ్చిందని చెప్తూ, అంతే కాకుండా భారతదేశం ఐక్యం గా ఉండాలంటూ కూడా పిలుపునిచ్చారు. విద్యార్థులు, అధ్యాపక సముదాయం ఏదైనా విశ్వవిద్యాలయం లో ఓ భాగం మాత్రమే కాదు, వారు ఒక చైతన్యశీల సంప్రదాయానికి ప్రతీక లు కూడాను అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. గురుదేవులు ఈ విశ్వవిద్యాలయానికి విశ్వ భారతి అనే పేరు ను పెట్టారు, విశ్వ భారతి లో జ్ఞానార్జన కు వచ్చే వారు ఎవరైనా యావత్తు ప్రపంచాన్ని భారతదేశం, భారతీయత ల దృష్టి కోణం లో నుంచి పరిశీలిస్తారని ఆయన అపేక్షించినందువల్ల విశ్వ భారతి ని జ్ఞాన ప్రాప్తి కి ఎటువంటి స్థానం గా మలచారంటే, దానిని భారతదేశ సమృద్ధ వారసత్వం లాగా చూడగలిగేటట్లు గా అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణం గా విశ్వ భారతి ని ఆయన జ్ఞానార్జన కు ఎటువంటి ప్రదేశం గా తీర్చిదిద్దారు అంటే, దానిని భారతదేశ సంపన్న వారసత్వం ద్వారా చూడగలమన్నారు. భారతీయ వారసత్వం గురించి పరిశోధన లు చేపట్టాలని, భారతీయ వారసత్వాన్ని ఒంటబట్టించుకోవాలని, నిరుపేదల సమస్యల కు పరిష్కారాల ను సాధించే దిశ లో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురుదేవులు టాగోర్ దృష్టి లో విశ్వ భారతి ఒక్క విజ్ఞానాన్ని బోధించే సంస్థ మాత్రమే కాదు, అది భారతీయ సంస్కృతి తాలూకు సర్వోన్నత లక్ష్యాన్ని దక్కించుకొనేందుకు ఒక సాధనం కూడా అని, ఆ లక్ష్యాన్ని ఎవరైనా సరే దక్కించుకోవాలి అన్నారు.
విధ విధాలైన సిద్ధాంతవాదాలు, అభిప్రాయ భేదాల మధ్య ఉంటూ మనల్ని మనం అన్వేషించుకోవాలని గురుదేవులు నమ్మేవారని ప్రధాన మంత్రి అన్నారు. బంగాల్ ను చూసి టాగోర్ గర్వపడే వారని, అయితే దీనితో పాటు ఆయన భారతదేశం తాలూకు వివిధత్వం పట్ల కూడా గర్వించే వారని ప్రధాన మంత్రి అన్నారు. గురుదేవుల భావనకు అనుగుణంగానే శాంతినికేతన్ లో మానవత వర్ధిల్లుతూ ఉండటానికి ఇదే కారణమన్నారు. విశ్వ భారతి ని జ్ఞానం తాలూకు ఒక అనంత సాగరం గా ఆయన కొనియాడారు. అనుభవం ఆధారం గా విద్య ను అందించాలన్న ఉద్దేశ్యం తో ఈ సంస్థ కు పునాదిరాయి ని వేయడమైందన్నారు. జ్ఞానాని కి, సృజనాత్మకత కు ఎటువంటి హద్దు లేదు అని ఆయన అన్నారు. ఇదే అభిప్రాయం తో గురుదేవులు ఈ మహా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారన్నారు.
జ్ఞానం, ఆలోచన, నైపుణ్యం ఒక్కచోటే ఉండేవి కాదు, అవి ఒక గతిశీలమైనటువంటి, ఎల్లప్పటికీ కొనసాగుతూ ఉండేటటువంటి ప్రక్రియ లు అనే విషయాన్ని ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి అంటూ విద్యార్థుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. జ్ఞానం, శక్తి లతో పాటే బాధ్యత కూడా వస్తుంది అని ఆయన చెప్పారు. అధికారం లో ఉన్న వ్యక్తి సంయమనం తోను, స్పందనశీలి గాను మెలగవలసిన అవసరం ఉంటుందని, అదే విధం గా ప్రతి పండితుడు జ్ఞానం సంపాదించుకోని అటువంటి వారి పట్ల బాధ్యత తో నడుచుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
విద్యార్థుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మీరు సంపాదించిన జ్ఞానం మీ ఒక్కరిదే కాదు, అది సమాజానిది; అంతేకాదు, అది దేశం వారసత్వం కూడాను అని ప్రధాన మంత్రి అన్నారు. మీరు సంపాదించిన జ్ఞానం, నైపుణ్యం ఒక దేశాన్ని గర్వపడేటట్లు చేయగలుగుతాయి. లేదంటే అవి సమాజాన్ని అపనింద ల అంధకారం లోకి నెట్టివేసి, నాశనం చేసివేస్తాయి అని ఆయన అన్నారు. ప్రపంచం అంతటా హింస ను, భయాన్ని వ్యాపింప చేస్తున్న వారిలో అనేకులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని, ఉన్నతమైన నైపుణ్యాలను అలవరచుకొన్న వారు అని ఆయన అన్నారు. మరో పక్క ఆసుపత్రులలో, ప్రయోగశాలల్లో పని చేస్తూ, ప్రజల ను కోవిడ్ వంటి మహమ్మారుల బారి నుంచి కాపాడటం కోసం తమ ప్రాణాల ను సైతం పణం పెడుతున్న వారు కూడా ఉన్నారన్నారు. ఇది ఏ సిద్ధాంత వాదానికి సంబంధించిన ప్రశ్నో కాదు, ఇది మనస్తత్వానికి సంబంధించింది, ఇది సకారాత్మకమైందా, లేక నకారాత్మకమైందా అన్నదేనని ఆయన అన్నారు. ఈ రెండు మార్గాలూ తెరచే ఉన్నాయి అని ఆయన అన్నారు. విద్యార్థులు వారు సమస్య లో భాగం అవ్వదలచుకొన్నారా, లేక పరిష్కారం లో భాగం అవ్వదలచుకొన్నారా అనేది నిర్ణయించుకోవాలి అని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. వారు గనుక దేశానికి పెద్ద పీట వేసే వారే అయితే అప్పుడు వారి ప్రతి నిర్ణయం ఏదో ఒక పరిష్కారం దిశ లో సాగుతుంది అని కూడా ఆయన అన్నారు. ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి భయపడకండి అంటూ విద్యార్థుల కు ఆయన సలహా ఇచ్చారు. ఏదైనా కొత్త విషయాన్ని ఆవిష్కరించాలనే ఉద్వేగం, రిస్కు తీసుకొని ముందుకు సాగాలనే తపన, దేశ యువతీ యువకుల లో ఉన్నంత వరకూ దేశ భవిష్యత్తు విషయం లో ఎలాంటి చింత ఉండదు అని ఆయన అన్నారు. ఈ విధమైన పనుల లో నిమగ్నం అయ్యే యువత కు ప్రభుత్వ సమర్ధన పూర్తి గా లభిస్తుంది అంటూ ఆయన హామీని ఇచ్చారు.
సాంప్రదాయక భారతీయ విద్య వ్యవస్థ తాలూకు చారిత్రక దృఢత్వాన్ని గురించి ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, గాంధేయవాది శ్రీ ధరమ్‌పాల్ రాసిన పుస్తకం ‘ద బ్యూటిఫుల్ ట్రీ - ఇన్‌డిజినస్ ఇండియన్ ఎజుకేశన్ ఇన్ ద ఎయిటీన్త్ సెన్చరి’ ని గురించి ప్రస్తావించారు. 1820 లో జరిగిన ఒక సర్వేక్షణ లో వెల్లడి అయిన విషయాలు ఏమిటంటే ప్రతి పల్లె లో ఒకటి కన్నా ఎక్కువ గురుకులాలు ఉండేవి, వాటిని స్థానిక దేవాలయాల కు అనుబంధం గా నడిపే వారు, అక్షరాస్యత స్థాయి ఎంతో ఉన్నతం గా ఉండేదన్న అంచనాలు ఆ సర్వేక్షణ లో వెల్లడి అయ్యాయన్నారు. దీనిని బ్రిటిషు పండితులు కూడా అంగీకరించారన్నారు. గురుదేవులు రవీంద్రనాథ్ విశ్వ భారతి లో రూపొందించిన వ్యవస్థ లు భారతదేశ విద్య ను ఆధునీకరించేందుకు, దేశాన్ని దాస్యం సంకెళ్ళ ను తెంచి స్వేచ్చ ను ప్రసాదించే మాధ్యమం గా మారాయన్నారు.
అదే కోవ లో, ‘నూతన జాతీయ విద్య విధానం’ కూడా పాత ఆంక్షల కు స్వస్త పలుకుతుంది, విద్యార్థులు వారి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగం లోకి తెచ్చుకొనేందుకు వారికి అవకాశాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. ఏయే విషయాల ను ఎంపిక చేసుకోవాలో, ఏ మాధ్యమం లో బోధన సాగాలో అనే అంశాల లో ఈ విధానం మార్పు చేర్పుల కు చోటు ను ఇస్తుందన్నారు. ఈ విధానం నవ పారిశ్రామికత్వాన్ని, స్వతంత్రోపాధి ని, పరిశోధన ను, నూతన ఆవిష్కరణ ను ప్రోత్సహిస్తుందన్నారు. ‘ఈ విద్య విధానం ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణ పథం లో ఒక పెద్ద మైలు రాయి గా ఉంది’ అని ప్రధాన మంత్రి అన్నారు. పరిశోధక విద్యార్థుల కు ఇటీవల లక్షల కొద్దీ పత్రికల ను ఉచితం గా ప్రభుత్వం అందుబాటు లోకి తీసుకు వచ్చింది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెటు నేశనల్ రిసర్చ్ ఫౌండేశన్ ద్వారా పరిశోధన ల నిమిత్తం 5 సంవత్సరాలలో 50 వేల కోట్ల రూపాయల సాయాన్ని ప్రతిపాదించిందన్నారు. ఈ విద్య విధానం జెండర్ ఇన్‌క్లూజన్ ఫండ్ ను గురించి ప్రస్తావించిందని, అది బాలికల కు కొత్త భరోసా ను అందించగలదన్నారు. బడికి వెళ్లి చదువుకోవడాన్ని కాస్తా మధ్య లోనే మానివేస్తున్న బాలిక ల సంఖ్య పెచ్చుపెరుగుతున్న అంశం పై సునిశిత అధ్యయనం జరిగిందని, ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు ఐచ్ఛికాల ను ఇవ్వడం, డిగ్రీ పాఠ్యక్రమాల లో సాంవత్సరిక క్రెడిట్ పద్ధతి ని తీసుకు రావడం జరిగాయన్నారు.
ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ కు బంగాల్ ప్రేరణ గా ఉందని ప్రధాన మంత్రి అంటూ, 21వ శతాబ్ది లో జ్ఞాన ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణ లో విశ్వ భారతి ఒక మహత్వపూర్ణ భూమిక ను పోషిస్తుందని, భారతదేశ జ్ఞానాన్ని, గుర్తింపు ను ప్రపంచం లో నలు మూల లకు తీసుకు పోతుందని ప్రధాన మంత్రి అన్నారు. 2047వ సంవత్సరం లో విశ్వ భారతి తాలూకు 25 పెద్ద లక్ష్యాల విషయం లో రాబోయే 25 సంవత్సరాల కాలానికి గాను ఒక దార్శనిక పత్రాన్ని తయారు చేయండి అంటూ శ్రీ మోదీ ఈ ప్రతిష్టాత్మక సంస్థ విద్యార్థుల కు పిలుపునిచ్చారు. భారతదేశాన్ని గురించి జాగృతి ని పెంపొందింప చేయాలని విద్యార్థుల కు ప్రధాన మంత్రి సూచించారు. భారతదేశం తాలూకు సందేశాన్ని అన్ని విద్యా సంస్థలు చేరవేస్తూ ఉండాలి, భారతదేశం ప్రతిష్ట ను ప్రపంచం అంతటా వృద్ధి చెందేటట్లుగా చూడాలి, ఈ అంశాల లో విశ్వ భారతి నాయకత్వం వహించాలి అని ఆయన అన్నారు. విద్యార్థులు వారి సమీప గ్రామాల ను ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధం) గా తీర్చిదిద్దడానికి, ఆయా గ్రామాల ఉత్పత్తుల ను ప్రపంచం అంతటికీ తీసుకు పోవడానికి మార్గాల ను అన్వేషించవలసిందని వారికి ప్రధాన మంత్రి పిలుపునిస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 1699443)
Visitor Counter : 111