వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మొక్క‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు, మొక్క‌ల క్వారెంటైన్‌పై స‌బ్ మిష‌న్‌


మేకిన్ ఇండియాను ప్రోత్స‌హించేందుకు దేశీయ క్రిమిసంహార‌క మందుల ఉత్ప‌త్తిదారుల‌కు 6788 స‌ర్టిఫికెట్స్ ఆఫ్ రిజిస్ట్రేష‌న్ (సిఆర్‌)లు, క్రిమిసంహార‌క మందుల ఎగుమ‌తికి 1011 సిఆర్‌లు జారీ

స‌మ‌గ్ర తెగులు నిర్వ‌హ‌ణ‌క‌, హేతుబ‌ద్ధంగా క్రిమిసంహార‌కాల వాడ‌కానికి పంట నిర్దిష్ట‌, తెగులు నిర్దిష్ట ఆచ‌ర‌ణ‌ల ప్యాకేజీలు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు జారీ

Posted On: 17 FEB 2021 2:23PM by PIB Hyderabad

క్రిమి తెగుళ్ళు, వ్యాధులు, క‌లుపు మొక్క‌లు, ‌నెమ‌టోడ్లు, ఎలుక‌లు వంటి వాటి నుంచి వ్య‌వ‌సాయ పంట‌ల నాణ్య‌త‌, ఫ‌ల‌సాయపు న‌ష్టాన్ని క‌నిష్టం చేసి,  నూత‌న జాతుల వ్యాప్తి, చొర‌బాటు నుంచి మ‌న జీవ భ‌ద్ర‌త‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే ల‌క్ష్యంతో వ్య‌వ‌సాయ‌, రైతాంగ సంక్షేమ శాఖ మొక్కల ప‌రిర‌క్ష‌ణ‌, మొక్క‌ల క్వారంటీన్ కు స‌బ్ మిష‌న్ అన్న ప‌థ‌కం ద్వారా నియంత్ర‌ణ‌, పర్య‌వేక్ష‌ణ‌, నిఘా, మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ఎగుమ‌తిని సుల‌భ‌త‌రం చేసేందుకు 1200 స‌రుకు నిల్వ చేసే ప్రాంగ‌ణాలు, రైస్ మిల్లులు, ప్రాసెసింగ్ కేంద్రాలు, ఉప‌చార సౌక‌ర్యాలు, పొగ‌పారించే ఏజెన్సీలు, క్వారింటీన్ అనంత‌రం ప్ర‌వేశానికి సౌక‌ర్యాలు త‌దిత‌రాల‌ను తిరిగిప్రామాణీక‌రించ‌డం జ‌రిగింది. స‌మ‌గ్ర తెగుళ్ళ నియంత్ర‌ణ‌, క్రిమిసంహార‌కాల‌ను హేతుబ‌ద్ధంగా వాడ‌టాన్ని ప్రోత్స‌హించేందుకు లాక్‌డౌన్ స‌మ‌యంలో 14 పంట నిర్దిష్ట‌, తెగుళ్ళ నిర్దిష్ఠ ఆచ‌ర‌ణ ప్యాకేజీని రాష్ట్రాల‌కు జారీ చేయ‌డం జ‌రిగింది. మేకిన్ ఇండియాను ప్రోత్స‌హించేందుకు, దేశీయ క్రిమి సంహార‌క‌మందుల త‌యారీ దారుల‌కు 6788 స‌ర్టిఫిక‌ట్స్ ఆఫ్ రిజిస్ట్రేష‌న్‌ను (సిఆర్‌) జారీ చేయ‌డ‌మే కాక‌, క్రిమిసంహారాకాల ఎగుమ‌తుల‌కు 1011 సిఆర్ల‌ను జారీ చేశారు. విధ్వంస‌క కీట‌కాలు, తెగుళ్ళ చ‌ట్టం, 1914, క్రిమిసంహార‌కాల చ‌ట్టం, 1968 నియంత్ర‌ణ విధుల‌కు చ‌ట్ట‌ప‌రమైన చ‌ట్రాన్ని అందిస్తాయి. 
ప్రామాణిక‌మైన కార్య‌నిర్వ‌హ‌క విధానాల‌ను, ప్రోటోకాళ్ళ‌ను ఖ‌రారు చేసిన అనంత‌రం 20202-2021లో డ్రోన్ల‌ను ఉప‌యోగించి మిడ‌త‌ల దండ్ల‌ను నియంత్రించిన తొలి దేశంగా ప్ర‌పంచంలోనే భార‌త్ వాసికెక్కింది. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి భార‌త చ‌రిత్ర‌లోనే అతిపెద్ద మిడ‌త‌ల నియంత్ర‌ణ ఆప‌రేష‌న్‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించింది. దాదాపు 10 రాష్ట్రాల‌లో 5.70 ల‌క్ష‌ల హెక్టార్ల ప్రాంతంలో మిడుత‌ల దాడుల‌ను నియంత్రించారు. మిడ‌తల నియంత్ర‌ణ‌కు ఆకాశం నుంచి క్రిమి సంహార‌కాల‌ను జ‌ల్లేందుకు హెలికాప్ట‌ర్ల‌ను మోహ‌రించ‌డం ద్వారా లోకస్ట్ స‌ర్కిల్ కార్యాల‌యాలు (ఎల్‌సిఓ) నియంత్ర‌ణా సామ‌ర్ధ్యాల‌ను బ‌లోపేతం చేశారు. నేటివ‌ర‌కు, ఎల్‌సిఓలు 2,87,986 హెక్ట‌ర్ల‌లోనూ, రాష్ట్ర ప్ర‌భుత్వాలు 2,83,268 హెక్టార్ల‌లోనూ మిడ‌త‌ల‌కు వ్య‌తిరేకంగా నియంత్ర‌ణ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించాయి. 

స్థానిక మార్కెట్ల‌లో ఉల్లిపాయ‌లు అందుబాటులో ఉండేందుకు, ధ‌ర‌ల‌ను స్థిరీక‌రించేందుకు 2020లో భార‌త్‌లో ఉల్లిపాయాల దిగుమ‌తి చేసుకోవ‌డానికి నియంత్ర‌ణ‌ల‌ను వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ శాఖ స‌డ‌లించింది. కార‌ట్ విత్త‌నాల‌కు ఇరాన్ నుంచి, గోధుమ పిండి, బాస్మ‌తి బియ్యం, దానిమ్మ గింజ‌లు ఉజ్బెకిస్తాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి దానిమ్మ‌, అర్జెంటీనా నుంచి మామిడి, బాస్మ‌తి బియ్యం, నువ్వు విత్త‌నాల‌ను, పెరూ నుంచి వేరుశ‌న‌గ‌ను పొందేందుకు 2020-21లో మార్కెట్ సౌల‌భ్యాన్ని పొంద‌డం జ‌రిగింది. 

 

***
 



(Release ID: 1698702) Visitor Counter : 203