శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
21వ శతాబ్దానికి భారత్ మ్యాప్
Posted On:
15 FEB 2021 12:48PM by PIB Hyderabad
నదుల అనుసంధానం, పారిశ్రామిక కారిడార్ల సృష్టి, స్మార్ట్ పవర్ వ్యవస్థలను అమర్చడం వంటి జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మ్యాపులు, ఖచ్చితమైన జియోస్పేషియల్ డేటా కీలకం. వ్యవసాయం, ఆర్థిక, నిర్మాణం, మైనింగ్,స్థానిక సంస్థలలో విస్తరించి ఉన్న ప్రతి ఆర్థిక ప్రయత్నంలోనూ భారతదేశ రైతులు, చిన్న వ్యాపారాలతో సహా వివిధ కార్పొరేషన్లు ఆధునిక జియోస్పేషియల్ డేటా టెక్నాలజీస్, ఆయా మ్యాపింగ్ సేవల ఆధారంగా వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం నుండి విపరీతంగా లాభపడతాయి. ప్రస్తుత అమలులో ఉన్న విధానం మ్యాపింగ్ పరిశ్రమపై గణనీయమైన ఆంక్షలను విధించిందని- మ్యాప్‌లను సృష్టించడం నుంచి పటాల వ్యాప్తి వరకు వివిధ విషయాల్లో ఆయా భారతీయ కంపెనీలు లైసెన్సులను కోరడం, ముందస్తు ఆమోదాలను, అనుమతుల తీసుకోవడం వంటి కీలక గజిబిజి వ్యవస్థను అనుసరించాల్సి వస్తుండడం గౌరవ ప్రధాన మంత్రి గమనించారు. ఈ నియంత్రణ పరిమితులు భారతదేశంలో స్టార్టప్‌లు తమ ఏర్పాటు, విస్తృతికి గాను అనవసరంగా అవినీతిపై జోలికి పోవాల్సివస్తోంది.
ఈ విధానం దశాబ్దాలుగా మ్యాప్ టెక్నాలజీలలో భారతీయ ఆవిష్కరణలకు ఆటంకం కలిగిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసుకొనేందుకు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా ఇక పైన భౌగోళిక డేటా మరియు మాప్స్‌కు వర్తించే నిబంధనలను ఇకపై గణనీయంగా సరళీకృతం చేయాలని నిర్ణయించారు. ఇందులోనే భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ భారత మ్యాపింగ్ విధానంలో మరీ ముఖ్యంగా భారతీయ కంపెనీల కోసం భారీ మార్పుల్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం తక్షణమే లభించేవిగా ఉన్న వాటిని భారతదేశంలో పరిమితం చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో ఇప్పటి వరకు పరిమితం చేస్తూ వచ్చిన జియో స్పేషియల్ డేటాను ఇక భారత దేశంలో విరివిగా అందుబాటులోకి రానుంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. భారత భూభాగంలో డిజిటల్ జియోస్పేషియల్ డేటా మరియు మ్యాప్‌లను సేకరించడం, ఉత్పత్తి చేయడం, సిద్ధం చేయడం, ప్రచారం చేయడం, నిల్వ చేయడం, ప్రచురించడం, నవీకరించడం వంటి వాటికిగాను ముందస్తు అనుమతి అవసరం లేదు. ఇకపై కార్పొరేషన్లు, ఆవిష్కర్తలు ఇకపై పరిమితులకు లోబడి ఉండరు. మా స్టార్టప్‌లు మరియు మ్యాపింగ్ ఇన్నోవేటర్లుకు సంబంధించి స్వీయ ధ్రువీకరణను ఇకపై విశ్వసించనున్నారు. ఆయా మార్గదర్శకాలకు కట్టుబడి అవసరం మేరకు మేటి తీర్పుతో వారు తమతమ డేటానే ఇకపై రూపొందిస్తారని విశ్వసించడం జరిగింది.
దీనికి తోడుగా తాజా మ్యాప్-మేకింగ్ టెక్నాలజీలను సద్వినియోగం చేసుకునేందుకు భారతీయ జియోస్పేషియల్ ఆవిష్కరణల అభివృద్ధిని ప్రోత్సహించేలా చర్యలు కూడా ప్రతిపాదించబడ్డాయి. తరువాతి తరం మ్యాపింగ్ టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుండడంతో, ఈ కొత్త విధానంతో భారతీయ ఆవిష్కర్తలకు మ్యాపింగ్‌లో గణనీయమైన పురోగతిని సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. చివరికి మన జీవితాలను సులభతరం చేస్తుంది చిన్న వ్యాపారాలకు సాధికారికతను కల్పిస్తుంది. మన భారతదేశం మ్యాపింగ్ శక్తిగా ఎదగడం, తరువాతి తరం దేశీయ పటాలను సృష్టించడం, ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం కోసం కేంద్రం ఎదురుచూస్తోంది.
****
(Release ID: 1698173)
Visitor Counter : 376