ఆర్థిక మంత్రిత్వ శాఖ

‘3.96 శాతం జి.ఎస్. 2022’, ‘5.15 శాతం జి.ఎస్. 2025’, ‘5.85 శాతం జి.ఎస్. 2030’ మరియు ‘కొత్త జి.ఎస్.2061’ - అమ్మకానికి వేలం (ఇష్యూ / రీ-ఇష్యూ)


Posted On: 12 FEB 2021 6:15PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం (జి.ఓ.ఐ), ఈ దిగువ పేర్కొన్న ప్రభుత్వ సెక్యూరిటీ ల అమ్మకం (ఇష్యూ / రీ ఇష్యూ) ప్రకటించింది.
 

  1. ధర ఆధారిత వేలం ద్వారా `2,000 కోట్ల (నామమాత్రపు) ప్రకటిత మొత్తానికి ‘3.96 శాతం ప్రభుత్వ సెక్యూరిటీ-2022’;
     
  2. ధర ఆధారిత వేలం ద్వారా 11,000 కోట్ల (నామమాత్రపు) ప్రకటిత మొత్తానికి ‘5.15 శాతం ప్రభుత్వ సెక్యూరిటీ-2025';
  3. ధర ఆధారిత వేలం ద్వారా 11,000 కోట్ల (నామమాత్రపు) ప్రకటిత మొత్తానికి ‘5.85 శాతం ప్రభుత్వ సెక్యూరిటీ-2030’;
  4. దిగుబడి ఆధారిత వేలం ద్వారా `7,000 కోట్ల (నామమాత్రపు) ప్రకటిత మొత్తానికి‘ కొత్త ప్రభుత్వ సెక్యూరిటీ-2061’.

పైన పేర్కొన్న ప్రతి సెక్యూరిటీలకు `2,000 కోట్ల వరకు అదనపు సభ్యత్వాన్ని నిలుపుకునే అవకాశం భారత ప్రభుత్వానికి ఉంటుంది. 2021 ఫిబ్రవరి, 18వ తేదీ గురువారం రోజున బహుళ ధరల పద్ధతిని ఉపయోగించి, ముంబై, పోర్టు లోని భారతీయ రిజర్వ్ బ్యాంకు, ముంబై ఆఫీస్, ఈ వేలాన్ని నిర్వహిస్తుంది.

ప్రభుత్వ సెక్యూరిటీల వేలంలో పోటీ లేని బిడ్డింగ్ సౌకర్యం కోసం పథకం ప్రకారం సెక్యూరిటీల అమ్మకం యొక్క ప్రకటిత మొత్తంలో 5 శాతం వరకు అర్హత ఉన్న వ్యక్తులు మరియు సంస్థలకు కేటాయించబడుతుంది.

2021 ఫిబ్రవరి 18వ తేదీన భారతీయ రిజర్వు బ్యాంకు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ-కుబేర్) వ్యవస్థపై వేలం కోసం పోటీ మరియు పోటీ లేని బిడ్లను ఎలక్ట్రానిక్ విధానంలో సమర్పించాలి. పోటీ లేని బిడ్లను ఉదయం గం. 10.30 ని. మరియు ఉదయం గం. 11.00 ని. మధ్య సమర్పించాలి. కాగా, పోటీ బిడ్లను ఉదయం గం. 10.30 ని. మరియు ఉదయం గం. 11.30 ని. మధ్య సమర్పించాలి.

2021 ఫిబ్రవరి, 18వ తేదీ, గురువారం రోజున వేలం ఫలితం ప్రకటించబడుతుంది, విజయవంతమైన బిడ్డర్లు 2021 ఫిబ్రవరి, 22వ తేదీ, సోమవారం రోజుకల్లా మొత్తం చెల్లించవలసి ఉంటుంది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన 'కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో లావాదేవీలు జారీ చేసినప్పుడు' మార్గదర్శకాలకు అనుగుణంగా సెక్యూరిటీలు “జారీ చేసినప్పుడు” ట్రేడింగ్ ‌కు అర్హులు. 2018 జూలై, 24వ తేదీ నాటి ఆర్.‌బి.ఐ/2018-19/25 ఎప్పటికప్పుడు సవరించబడింది.


 

*****

 


(Release ID: 1697611) Visitor Counter : 165


Read this release in: Manipuri , Urdu , English , Hindi