ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఛత్తీస్ గఢ్ ‌లో గిరిజనలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోషకాహార-సహాయక వ్యవసాయానికి మద్దతునిచ్చే ప్రాజెక్టుపై సంతకం చేసిన - ప్రపంచ బ్యాంకు


Posted On: 12 FEB 2021 5:24PM by PIB Hyderabad

ఛత్తీస్ గఢ్ ‌లోని మారుమూల ప్రాంతాల్లోని గిరిజన కుటుంబాలు, ఏడాది పొడవునా, వైవిధ్యభరితమైన, పౌష్టికాహారాన్ని ఉత్పత్తి చేసే విధంగా కృషి చేయడానికి, సుస్థిర ఉత్పత్తి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, భారత ప్రభుత్వం, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకు ఈ రోజు 100 మిలియన్ డాలర్ల ప్రాజెక్టు పై సంతకాలు చేశాయి. చిరాగ్ - ఛత్తీస్‌ గఢ్ సమ్మిళిత గ్రామీణ మరియు వేగవంతమైన వ్యవసాయ వృద్ధి ప్రాజెక్టును, పౌష్టికాహార లోపం మరియు పేద ప్రజలు ఎక్కువగా ఉన్న, గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్న రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో అమలు చేయనున్నారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఎనిమిది జిల్లాల్లోని దాదాపు 1,000 గ్రామాల్లో నివసించే 1,80,000 పైగా కుటుంబాలకు ఈ ప్రాజెక్టు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ సి.ఎస్.మోహపాత్రా, ఈ సందర్భంగా, మాట్లాడుతూ, "భారతదేశంలో, వ్యవసాయం ఒక ప్రధాన జీవనోపాధి ప్రదాత, 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఛత్తీస్ ‌గఢ్ ‌లోని చిరాగ్ ప్రాజెక్టు - విభిన్న మరియు పోషకమైన ఆహారం మరియు వ్యవసాయ వ్యవస్థకు పునాది వేస్తుంది, చిన్న ఉత్పత్తి దారులను, రైతు ఉత్పత్తి సంస్థలుగా సమీకరించడంతో పాటు, లాభదాయక మార్కెట్లకు వారిని అందుబాటులో ఉంచడం ద్వారా వారి ఆదాయాలను పెంచుతుంది. అని పేర్కొన్నారు.

ఈ ఒప్పందంపై - భారత ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన, ఆర్థిక వ్యవహారాల విభాగం, అదనపు కార్యదర్శి, డాక్టర్ సి.ఎస్. మోహపాత్రా, మరియు ప్రపంచ బ్యాంకు తరపున కంట్రీ డైరెక్టర్ (ఇండియా) మిస్టర్ జునైద్ కమల్ అహ్మద్ సంతకాలు చేశారు. కాగా, ప్రాజెక్టు ఒప్పందం పై - ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ భాస్కర్ విలాస్ సాందీపని, మరియు, ప్రపంచ బ్యాంకు తరపున కంట్రీ డైరెక్టర్ (ఇండియా) మిస్టర్ జునైద్ కమల్ అహ్మద్ సంతకాలు చేశారు.

ఛత్తీస్ గఢ్ లో ఉన్న గొప్ప జీవవైవిధ్యం మరియు విభిన్న వ్యవసాయ-వాతావరణ మండలాలు - అభివృద్ధి యొక్క ప్రత్యామ్నాయ నమూనాగా గిరిజన-ఆధిపత్య దక్షిణ ప్రాంతాన్ని అనుమతించడంపైనా, దాని సహజ వనరులను ప్రభావితం చేయడంతో పాటు, స్థితిస్థాపక పంటలను విస్తరించడానికీ, పెంచడానికీ, అదేవిధంగా, ప్రతి కుటుంబ పోషక అవసరాలను జాగ్రత్తగా చూసుకునే ఉత్పత్తి వ్యవస్థకు భరోసా ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి పెట్టడానికీ అవకాశాన్ని కల్పిస్తాయి.

భారతదేశంలో ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్, శ్రీ జునైద్ కమల్ అహ్మద్ మాట్లాడుతూ, "ఈ ప్రాజెక్టు - గిరిజన మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, గిరిజన వర్గాల కోసం సమగ్ర అభివృద్ధి మార్గాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగం. పంట పద్ధతులను వైవిధ్యపరచడం, పోషణను పెంచడం, నీటిపారుదల, పంటకోత సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడులను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టడం ద్వారా, వ్యవసాయ వృద్ధి మరియు రైతు ఆదాయాల పెరుగుదల ద్వారా, మారుమూల ప్రాంతాలతో సహా - గిరిజన వర్గాలకు - ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. అని పేర్కొన్నారు.

వ్యవసాయ పోషణకు సహాయంగా ఉండటానికి, ఈ ప్రాజెక్టు, వాతావరణ స్థితిస్థాపకత మరియు లాభదాయకమైన కార్యకలాపాల శ్రేణిని అమలు చేస్తుంది. నీటి సంరక్షణ నిర్మాణాలు మరియు నీటిపారుదల సౌకర్యాలలో పెట్టుబడులు పెట్టబడతాయి; మిశ్రమ పంటలను ప్రోత్సహించే సమగ్ర వ్యవసాయ పద్ధతులు; మత్స్య సంపద మరియు పశువుల ఉత్పత్తి; వాతావరణ - అనుకూల - ఉత్పత్తి సాంకేతికతలు మరియు పద్ధతులు; మిగులు వస్తువులు లాభదాయక మార్కెట్లకు చేరుకునేలా విలువ వ్యవస్థలను అభివృద్ధి చేయడం; మరియు గిరిజన కుటుంబాలకు పౌష్టికాహారాన్ని అందుబాటులో ఉంచడం మొదలైన విషయాలలో - ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.

కోవిడ్-19 మహమ్మారి, అనంతర పరిస్థితులు ఆర్థిక అవకాశాలను, ముఖ్యంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో స్థితిగతులను, బాగా దెబ్బతీశాయి. ఈ ప్రాజెక్టు - స్థానిక ఆహార సరఫరా మరియు ఉత్పత్తిని స్థిరీకరించడానికీ, పునరుద్ధరించడానికీ, జీవనోపాధి పొందడానికీ, ఆదాయం మరియు ఉద్యోగ అవకాశాలను విస్తరించడానికీ, అదేవిధంగా మహమ్మారి-ప్రభావిత ప్రాజెక్టు ప్రాంతాలలో ప్రజలు తమ గ్రామాలకు తిరిగి రావడానికీ - సహాయపడుతుంది.

పునర్నిర్మాణం మరియు అభివృద్ధి కోసం అంతర్జాతీయ బ్యాంకు (ఐ.బి.ఆర్.‌డి) నుండి 100 మిలియన్ డాలర్ల రుణం, 5.5 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ తో సహా, 17.5 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంది.

 

 

*****

 


(Release ID: 1697596) Visitor Counter : 179


Read this release in: English , Urdu , Hindi