వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎస్.ఇ.జెడ్ విధానం
Posted On:
11 FEB 2021 11:45AM by PIB Hyderabad
ప్రత్యేక ఆర్ధిక మండళ్ల (ఎస్.ఇ.జెడ్) ల విధానాన్ని 2000 ఏప్రిల్ లో ప్రారంభించారు.
ప్రత్యేక ఆర్ధిక మండళ్ల చట్టం 2005ను పార్లమెంటు 2005 మే లో ఆమోదించింది. దీనికి 2005 జూన్ 23న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఎస్.ఇ.జెడ్ నిబంధనలుఉ 2006 ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వచ్చాయి.
ఎస్.ఇ.జెడ్ పథకం కింద ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1. సెజ్‌లో అధీకృత కార్యకలాపాల కు సంబంధించి , నిర్దేశిత డ్యూటీఫ్రీ ఎన్‌క్లేవ్‌ను భారతదేశ కస్టమ్స్ కు వెలుపల ఉన్న ప్రాంతంగా పరిగణిస్తారు.
1.ఎస్.ఇ.జెడ్‌లో అధీకృత కార్యకలాపాలు నిర్వహించడానికి , నిర్దేశిత డ్యూటీ ఫ్రీ ప్రాంతాన్ని భారతదేశ కస్టమ్స్ వెలుపల ఉన్నప్రాంతంగా పరిగణిస్తారు.
2. దిగుమతులు చేసుకోవడానికి లైసెన్సు అవసరం లేదు.
3. తయారీ లేదా సేవల కార్యకలాపాలను అనుమతిస్తారు.
4. ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి సంచితంగా ఐదు సంవత్సరాల పాటు ఈ యూనిట్ పాజిటివ్ నెట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ని ఆర్జించాలి.
5. దేశీయంగా అమ్మకాలు పూర్తి స్థాయి కస్టమ్స్ సుంకం, అమలులో ఉ న్న దిగుమతుల విధానానికి లోబడి ఉంటాయి.
6. ఎస్.ఇ.జెడ్ యూనిట్లు సబ్ కాంట్రాక్టింగ్ చేసుకునేందుకు స్వేచ్ఛ ఉంది.
7. ఎగుమతులు, దిగుమతుల కార్గోను కస్టమ్స్ అధికారులు సాధారణ పరీక్షలు చేయరు.
8. ఎస్.ఇ.జెడ్ చట్టం 2005 కింద ఎస్.ఇ.జెడ్ డవలపర్లు, కో డవలపర్లు యూనిట్లు పన్ను ప్రయోజనాలను పొందుతారు.
ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ హర్‌దీప్‌సింగ్ పూరి లోక్ సభలో నిన్న ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1697262)
Visitor Counter : 185