ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభం

Posted On: 02 FEB 2021 4:28PM by PIB Hyderabad

బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హన్స్) ద్వారా ప్రభుత్వం 2016 లో భారత మానసిక ఆరోగ్య సర్వే (ఎన్ఎంహెచ్‌ఎస్‌) ను నిర్వహించింది. దీని ప్రకారం 18 ఏళ్లు పైబడిన పెద్దలలో మానసిక రుగ్మతల శాతం సుమారు 10.6% గా ఉంది. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌ఎంహెచ్‌పి) లోని 692 జిల్లాల్లో అమలు చేయడానికి  జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (డిఎంహెచ్‌పి) మంజూరు చేయబడింది. దీని కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలకు సహకారం  లభిస్తుంది.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి) మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ (పిహెచ్‌సి) స్థాయిలలో డిఎమ్‌హెచ్‌పి కింద  ఔట్‌ పేషెంట్ సేవలు, అసెస్‌మెంట్, కౌన్సెలింగ్ /మానసిక,సామాజిక మద్దతు, తీవ్రమైన మానసిక రుగ్మత ఉన్నవారికి నిరంతర సంరక్షణ మరియు మద్దతు, మందులు,  ఔట్రిచ్‌ సేవలు, అంబులెన్స్ సేవలు మొదలైన సేవలతో పాటు జిల్లా స్థాయిలో 10 పడకల ఇన్-పేషెంట్ సదుపాయం కూడా ఉంది.

కొవిడ్-19 మహమ్మారి జనాభా మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎటువంటి అధ్యయనం చేయలేదు. అయినప్పటికీ, కొవిడ్-19 ప్రజల మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని గ్రహించి, కొవిడ్ సమయంలో అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటిలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి:

జనాభాను పిల్లలు, యువత, వృద్ధులు, మహిళలు మరియు ఆరోగ్య కార్యకర్తలు వంటి వివిధ లక్ష్య సమూహాలుగా విభజించి వారికి మానసిక, సామాజిక సహాయాన్ని అందించడానికి మానసిక ఆరోగ్య నిపుణులతో 24/7 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయడం.

సమాజంలోని వివిధ విభాగాలకు అనుగుణంగా, మానసిక ఆరోగ్య సమస్యల నిర్వహణపై మార్గదర్శకాలు / సలహాల జారీ.

ఒత్తిడి మరియు ఆందోళనలను నిర్వహించడం మరియు అందరికీ మద్దతు మరియు సంరక్షణ యొక్క వాతావరణాన్ని ప్రోత్సహించడంపై సృజనాత్మక మరియు ఆడియో-విజువల్ పద్దతుల్లో వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సలహాలు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్), బెంగళూరు- "కొవిడ్-19 పాండమిక్ కాలంలో మానసిక ఆరోగ్యం - సాధారణ వైద్య మరియు ప్రత్యేక మానసిక ఆరోగ్య సంరక్షణ సెట్టింగుల మార్గదర్శకత్వం" ద్వారా వివరణాత్మక మార్గదర్శకాల జారీ.

అన్ని మార్గదర్శకాలు, సలహాలు మరియు న్యాయవాద విషయాలను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో బిహేవియరల్ హెల్త్ - సైకోసాజికల్ హెల్ప్‌లైన్ (https://www.mohfw.gov.in/)లో పొందవచ్చు.

(ఐగోట్) -దిక్షా ప్లాట్‌ఫామ్ ద్వారా మానసిక సామాజిక మద్దతు మరియు శిక్షణను అందించడంలో నిమ్హాన్స్ చేత ఆరోగ్య కార్యకర్తల ఆన్‌లైన్ సామర్థ్యం పెంపు.

దేశంలో మానసిక ఆరోగ్య నిపుణుల కొరతను తీర్చాలనే లక్ష్యంతో, మానసిక ఆరోగ్యంలో పిజి శిక్షణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తృతీయ సంరక్షణ సౌకర్యాన్ని మెరుగుపరచడానికి మానసిక ఆరోగ్యంలో 25 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, మెంటల్ హెల్త్ స్పెషాలిటీలలో 47 పిజి శిక్షణ విభాగాలు ఉన్నాయి.  మానసిక ఆరోగ్య రంగంలో ప్రతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనకు రూ. 11 వ పంచవర్ష ప్రణాళికలో ప్రతి కేంద్రానికి  ఆర్థిక సహాయం రూ. 30 కోట్ల నుంచి రూ. 36.96 కోట్లకు పెంపు.

జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (డిఎంహెచ్‌పి) ను దేశంలోని 692 జిల్లాలకు విస్తరించారు. దీని కింద  మానసిక రుగ్మతలు / అనారోగ్యాలను గుర్తించడం, నిర్వహించడం మరియు చికిత్స చేయడం మరియు ఆత్మహత్యల నివారణ సేవలు, కార్యాలయ ఒత్తిడి నిర్వహణ,  నైపుణ్యాల శిక్షణ మరియు పాఠశాలలు మరియు కళాశాలలలో కౌన్సెలింగ్ మొదలైన కార్యక్రమాలకు ప్రతి జిల్లాకు సంవత్సరానికి 83.20 లక్షలు అందిస్తున్నారు.

మూడు కేంద్ర సంస్థలకు తగిన ఆర్థిక సహాయం కూడా అందించబడుతుంది. అవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, బెంగళూరు, లోకోప్రియా గోపీనాథ్ బోర్డోలోయ్ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, తేజ్పూర్, అస్సాం మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, రాంచీ.

ఇంకా, మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్, 2017 ప్రకారం, మానసిక ఆరోగ్య సేవలను నేషనల్ హెల్త్ మిషన్, పిఎంఎస్‌ఎస్‌వై, రాష్ట్రీయ కిషోర్ స్వస్త్య కార్యక్రమ్, ఆయుష్మాన్ భారత్, పిఎమ్‌జాయ్ వంటి సాధారణ ఆరోగ్య సేవల్లో విలీనం చేశారు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ రోజు ఇక్కడ రాజ్యసభలో వ్రాతపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

****



(Release ID: 1694746) Visitor Counter : 210


Read this release in: English , Urdu , Manipuri , Tamil