రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అండమాన్ & నికోబార్ కమాండ్‌ లో ప్రారంభమైన - కోవిడ్-19 టీకా డ్రైవ్

Posted On: 19 JAN 2021 6:12PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన,  ప్రపంచంలోనే అతిపెద్ద టీకాలు వేసే కార్యక్రమంలో భాగంగా,  త్రివిధ దళాలకు చెందిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల (హెచ్.‌సి.డబ్ల్యు.ల) కోసం మొదటి దశ టీకాలు వేసే కార్యక్రమం, 2021 జనవరి, 19వ తేదీన, అండమాన్ & నికోబార్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలోని ఐ.ఎన్.హెచ్.ఎస్. ధన్వంతరి లో ప్రారంభమయ్యింది.  కమాండ్ కు చెందిన ముందు వరుసలోని కార్యకర్తలు (ఎఫ్.ఎల్.డబ్ల్యూ.లు) అందరికీ దశలవారీగా టీకాలు వేయడం జరుగుతుంది.  మొదటి దశ కింద మొత్తం 370 మోతాదుల టీకాలు,  అండమాన్ & నికోబార్ పాలనా యంత్రాంగానికి చెందిన ఆరోగ్య సేవల డైరెక్టరేటు నుండి స్వీకరించడం జరిగింది. కమాండ్ కు చెందిన వివిధ విభాగాల హెచ్.‌సి.డబ్ల్యు. లు, నోడల్ అధికారులతో పాటు వ్యాక్సినేటర్లకు కూడా టీకాలు వేసే విధానంలో అండమాన్ & నికోబార్ పాలనా యంత్రాంగం మరియు డబ్ల్యూ.హెచ్.ఓ. ప్రతినిధులు, పోర్ట్ బ్లెయిర్‌ లో శిక్షణ ఇచ్చారు.  ఈ టీకాలు వేసే కార్యక్రమాన్ని, అండమాన్ & నికోబార్ కమాండ్ కమాండర్-ఇన్-చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే  ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, సి.ఐ.ఎన్.సి.ఏ.  సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ ద్వీపాలలో కోవిడ్-19 మహమ్మారిని నివారించడానికి హెచ్.సి.డబ్ల్యూ. లు అందించిన అత్యుత్తమ సేవలను ప్రశంసించారు.  ‘ఫైటింగ్-ఫిట్’, ‘ఆపరేషన్-రెడీ’ పరిస్థితిని సాధించడంతో పాటు, మహమ్మారిని నియంత్రించి, తొలగించడానికి ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన ప్రయత్నాలకు,  ఈ టీకాలు వేసే కార్యక్రమం, మరింతగా తోడ్పడుతుందని, ఆయన పేర్కొన్నారు.  టీకాలపై వస్తున్న పుకార్లను నమ్మవద్దనీ, ఈ రంగంలోని నిపుణులను విశ్వసించాలనీ, ఆయన సిబ్బందిని కోరారు.  టీకాలు వేసుకున్న తర్వాత కూడా, కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఆయన  ఆయన నొక్కి చెప్పారు.  

ప్రోటోకాల్ ప్రకారం అన్ని ముందు జాగ్రత్త చర్యలతో పాటు కోవిడ్-19 కోసం రూపొందించిన నిబంధనను ఖచ్చితంగా పాటించి, సీనియర్ ఆరోగ్య అధికారితో పాటు, 36 మంది హెచ్.సి.డబ్ల్యు. లకు టీకాలు వేయడం జరిగింది.   తరువాతి కొద్ది రోజులలో, మిగిలిన మోతాదులను, దీవులకు చెందిన ఉత్తర, దక్షిణ ప్రాతాలలోని ఇతర యూనిట్లలో ఉన్న  వారితో పాటు,  ఇతర హెచ్.‌సి.డబ్ల్యు. లకు, దశలవారీగా ఇస్తారు.

కమాండ్ ‌లో టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో, మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చివరి దశలో సాయుధ దళాలు,  అండమాన్ & నికోబార్ పాలనాయంత్రాంగంతో కలిశాయి. 

*****


(Release ID: 1690185) Visitor Counter : 167


Read this release in: English , Hindi , Manipuri , Tamil