ప్రధాన మంత్రి కార్యాలయం

వెస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లోని రేవారీ - మదార్ సెక్ష‌ను ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

డబుల్ స్టాక్ కంటేన‌ర్ ట్రైన్ కు జెండా ను చూప‌డం ద్వారా ప్ర‌పంచం లోని కొన్ని దేశాల స‌ర‌స‌న చేరిన భార‌త‌దేశం

Posted On: 07 JAN 2021 1:21PM by PIB Hyderabad

వెస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డ‌బ్ల్యుడిఎఫ్‌సి) లో 306 కిలో మీట‌ర్ల పొడ‌వైన‌ రేవారీ - మదార్ సెక్ష‌ను ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.  ఈ మార్గంలో డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటేన‌ర్ ట్రేన్ కు కూడా ఆయ‌న జెండా ను చూపారు.  ఈ కార్యక్రమంలో రాజస్థాన్ మరియు హరియాణా ల‌ గవర్నర్ లు, రాజస్థాన్ మరియు హరియాణా ల‌ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్, శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ అర్జున్ రాం మేఘ్‌ వాల్, శ్రీ కైలాశ్ చౌధరీ, శ్రీ రావు ఇందర్ జీత్ సింహ్, శ్రీ రతల్ లాల్ కటారియా, శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ లు కూడా పాల్గొన్నారు.

ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంలో ప్ర‌సంగిస్తూ, దేశంలో మౌలిక స‌దుపాయాల‌ను ఆధునీక‌రించడానికి సాగుతున్న ఒక మ‌హా య‌జ్ఞం ఓ కొత్త వేగ‌గ‌తి ని అందుకొందన్నారు.  దేశాన్ని ఆధునీక‌రించ‌డానికి గ‌త 12 రోజుల‌లో రైతుల‌కు డిబిటి, ఎయర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్ లో నేశ‌న‌ల్ మొబిలిటీ కార్డు ను ప్రవేశ‌పెట్ట‌డం, ఎఐఐఎమ్ఎస్ రాజ్ కోట్ ను, ఐఐఎమ్ సంబల్ పుర్ ను, 6 న‌గ‌రాల‌లో లైట్ హౌస్ ప్రాజెక్టులను, నేశనల్ అటామిక్ టైమ్ స్కేల్ ను మ‌రియు భారతీయ నిర్దేశక్ ద్రవ్య ను, నేశ‌న‌ల్ ఇన్‌వైర‌న్ మంట‌ల్ స్టాండ‌ర్డ్స్ లబారటరీ, కొచ్చి-మంగ‌ళూరు గ్యాస్ పైప్ లైను, 100వ కిసాన్ రైలు ప్రారంభోత్సవాల తో పాటు ఈస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లో ఒక భాగానికి ప్రారంభోత్స‌వం వంటి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌భుత్వం చేపట్టింద‌ని ఆయ‌న వివ‌రించారు.  దేశాన్ని ఆధునీకరించడానికి ఈ క‌రోనా కాలంలో సైతం ఎన్నో ప్రారంభోత్స‌వాలను జ‌రపడమైంది అని కూడా ఆయ‌న వివ‌రించారు. 

క‌రోనా కు సంబంధించిన ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సీన్ కు కొద్ది రోజుల కిందట ఆమోదం లభించడం ప్ర‌జ‌ల‌లో ఒక కొత్త విశ్వాసాన్ని నింపింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ను 21వ శ‌తాబ్దంలో భార‌త‌దేశంలో ఒక పెద్ద మార్పు ను తీసుకువ‌చ్చే ప‌థ‌కం గా చూడటం జరుగుతోంది అని ఆయ‌న అభివ‌ర్ణించారు.  న్యూ భావూపుర్ - న్యూ ఖుర్జా సెక్ష‌ను ను ప్రారంభించినప్పటి నుంచి ఆ సెక్ష‌ను లో స‌ర‌కు ర‌వాణా రైలు స‌గ‌టు వేగం మూడింతలు అయింద‌ని ఆయ‌న అన్నారు.  హ‌రియాణా లోని న్యూ అతేలీ నుంచి రాజ‌స్థాన్ లోని న్యూ కిష‌న్ గంజ్ కు  మొట్ట‌మొద‌టి డబుల్‌ స్టాక్ డ్ కంటేనర్ ఫ్రైట్ ట్రేను కు జెండా ను చూప‌డం తో భార‌త‌దేశం ప్ర‌పంచం లో ఆ సదుపాయం గల కొద్ది దేశాల‌ సరసన చేరింద‌ని ఆయ‌న తెలిపారు.  ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్ర‌తి ఒక్క‌రికీ కొత్త అవ‌కాశాల‌ను, కొత్త ఆశ‌ల‌ను, ప్రత్యేకించి రాజ‌స్థాన్ లోని రైతుల‌కు, న‌వ పారిశ్రామికుల‌కు, వ్యాపార‌స్తుల‌కు కొత్త అవ‌కాశాల‌ను, కొత్త ఆశ‌ల‌ను తీసుకువ‌స్తుంద‌ని ఆయ‌న వివ‌రించారు.  డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఒక్క ఆధునిక స‌ర‌కు ర‌వాణా రైళ్ళ‌కే మార్గం కాద‌ని, అది దేశ స‌త్వ‌ర అభివృద్ధి కి కూడా ఒక కారిడార్ అని ఆయ‌న చెప్పారు.  ఈ కారిడార్ లు దేశంలో వివిధ న‌గ‌రాల‌లో కొత్త వృద్ధి కేంద్రాల ఎదుగుద‌ల‌కు ఆధారం అవుతాయ‌ని ఆయ‌న చెప్పారు.  

ఈస్ట‌ర్న్ ఫ్రైట్ కారిడార్ దేశం లోని వేరు వేరు ప్రాంతాల బ‌లాన్ని ఎలా పెంచుతున్న‌దో చాటి చెప్పడం మొదలెపెట్టిందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  వెస్ట‌ర్న్ ఫ్రైట్ కారిడార్ రాజ‌స్థాన్ లో, హ‌రియాణా లో వ్య‌వ‌సాయాన్ని, దానితో సంబంధం ఉన్న వ్యాపారాల‌ను సుల‌భ‌త‌రంగా మార్చివేస్తుంద‌ని, అంతేకాకుండా మ‌హేంద్ర‌గ‌ఢ్, జయ్ పుర్‌, అజ్ మేర్‌, సీక‌ర్ వంటి న‌గ‌రాల‌కు ఒక కొత్త శ‌క్తి ని స‌మ‌కూరుస్తుంద‌ని ఆయ‌న అన్నారు.  జాతీయ బ‌జారుల‌కు, అంత‌ర్జాతీయ బ‌జారుల‌కు సుల‌భంగా చేరుకొనే వీలు అనేది ఈ రాష్ట్రాల‌ లో చాలా త‌క్కువ ఖ‌ర్చు తో త‌యారీ విభాగాల‌కు, న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు త‌లుపులను తెర‌చిన‌ట్లయిందని ఆయ‌న చెప్పారు.  గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర లలోని నౌకాశ్ర‌యాల‌కు వేగంగా, చౌక‌గా సంధానించ‌బ‌డ‌టం అనేది ఆ ప్రాంతం లో కొత్త పెట్టుబ‌డి అవ‌కాశాల‌కు ప్రోత్సాహ‌క‌రం కాగ‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

ఆధునిక మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న జీవితంలో, వ్యాపారంలో కొత్త వ్య‌వ‌స్థ‌లకు కూడా అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంద‌ని, దానితో అనుబంధం క‌లిగిన ప‌నుల‌ను కూడా వేగ‌వంతం చేస్తుంద‌ని, దీనికి తోడు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లో అనేక చోద‌క శ‌క్తుల‌కు ఊతాన్ని అందిస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.  ఈ కారిడార్ ఒక్క నిర్మాణ రంగంలోనే కాకుండా సిమెంటు, ఉక్కు, ర‌వాణా వంటి ఇత‌ర రంగాల లో కూడా ఉద్యోగాల‌ను క‌ల్పిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.  డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్ర‌యోజ‌నాల‌ను గురించి ఆయ‌న మ‌రింత విపులంగా చెప్తూ, అది 9 రాష్ట్రాల‌లో 133 రైల్వే స్టేశ‌న్ ల‌ను త‌న ప‌రిధి లోకి తీసుకొంటుంద‌న్నారు.  ఈ స్టేశ‌న్ ల‌లో బ‌హుళ విధ లాజిస్టిక్ పార్కులు, ఫ్రైట్ ట‌ర్మిన‌ల్, కంటేన‌ర్ డిపో, కంటేన‌ర్ ట‌ర్మిన‌ల్‌, పార్శిల్ కేంద్రం ఉంటాయ‌న్నారు.  ఇవ‌న్నీ రైతుల‌కు, చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు, కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌కు, పెద్ద త‌యారీ సంస్థ‌ల‌కు ల‌బ్ధి ని చేకూర్చుతాయ‌ని ఆయ‌న అన్నారు.

రైల్వే మార్గాల ను పోలిక గా ఉపయోగించుకొంటూ, ప్ర‌స్తుతం భార‌త‌దేశం లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న తాలూకు కృషి ఏక కాలంలో రెండు ప‌ట్టాల‌పై ప‌రుగు పెడుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఆ రెండు ప‌ట్టాలలో ఒకటి వ్య‌క్తిగతం, రెండోది దేశ వృద్ధిచోదక శక్తి అని ఆయ‌న అన్నారు.  వ్య‌క్తిగ‌త స్థాయి లో- గృహ నిర్మాణం, పారిశుధ్యం, విద్యుత్తు, ఎల్‌ పిజి, ర‌హ‌దారి సంధానం, ఇంట‌ర్ నెట్ క‌నెక్టివిటీ ల‌లో చోటు చేసుకొన్న సంస్క‌ర‌ణ‌ల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  ఆ త‌ర‌హా ప‌థ‌కాల ద్వారా కోట్లాది భార‌తీయులు లాభ‌ప‌డుతున్నార‌న్నారు.  మ‌రొక ప‌ట్టా విష‌యానికి వ‌స్తే- ప‌రిశ్ర‌మ‌, న‌వ పారిశ్రామికవేత్త‌లు వంటి వృద్ధి చోద‌కాలు హైవే, రైల్వే, ఎయ‌ర్ వే, వాట‌ర్ వే ల‌తో పాటు బ‌హుళ విధ నౌకాశ్ర‌య సంధానం ద్వారా ప్ర‌యోజ‌నాన్ని పొందుతున్నట్లు ఆయన వివ‌రించారు.  ఫ్రైట్ కారిడార్ ల మాదిరిగానే ప‌రిశ్ర‌మ రంగానికి ఇక‌నామిక్ కారిడార్‌లు, డిఫెన్స్ కారిడార్‌లు, టెక్ క్ల‌స్ట‌ర్ లను కూడా స‌మ‌కూర్చ‌డం జ‌రుగుతోంద‌న్నారు.  వ్య‌క్తిగ‌త‌ స్థాయి లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న తో పాటు, ప‌రిశ్ర‌మ స్థాయి లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న భార‌త‌దేశానికి ఒక సానుకూలమైన ఇమేజ్ ను ఇస్తోందని, పెరుగుతున్న విదేశీ మార‌క ద్ర‌వ్య నిల‌వ‌ల‌లోను, భార‌త‌దేశం ప‌ట్ల విశ్వాసంలోను ఇది ప్ర‌తిబింబిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  

ఈ ప్రాజెక్టు లో సాంకేతిక స‌మ‌ర్ధ‌న‌ ను, ఆర్థిక మ‌ద్ధ‌తు ను అందించినందుకు గాను జ‌పాన్ ప్ర‌జ‌ల‌కు కూడా ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

భార‌తీయ రైల్వేల ఆధునీక‌ర‌ణ‌ కు వ్య‌క్తిగ‌త‌ స్థాయిలో, ప‌రిశ్ర‌మ ప‌ర‌ంగా, పెట్టుబ‌డి ప‌ర‌ంగా స‌మ‌న్వ‌యం నెలకొనాల్సిన అంశాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్పారు.  ఇదివ‌ర‌క‌టి కాలాల్లో ప్ర‌యాణికులు ఎదుర్కొన్న ఇబ్బందుల‌ను ప్ర‌ధాన‌ మంత్రి గుర్తుకు తెస్తూ, పరిశుభ్రత, స‌మ‌య పాల‌న‌, చ‌క్క‌ని సేవ‌, టికెట్ ల జారీ, సౌక‌ర్యాలు, భ‌ద్ర‌త రంగాల‌లో చెప్పుకోద‌గ్గ కృషి చోటుచేసుకొంద‌న్నారు.  స్టేశ‌న్ ల‌లో, బోగీ ల‌లో ప‌రిశుభ్ర‌త‌, బ‌యో డిగ్రేడ‌బుల్ టాయిలెట్ లు, వంటాపెట్టూ, ఆధునిక టికెట్ ల జారీ విధానం, తేజ‌స్ లేదా వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ ల వంటి న‌మూనా రైళ్ళు, విస్టా-డోమ్ కోచ్‌ల తాలూకు ఉదాహ‌ర‌ణ‌ల‌ను ఆయ‌న ప్రస్తావించారు.  బ్రాడ్ గేజ్ మార్గాలను వేయడం లో, విద్యుద్దీక‌ర‌ణ లో ఇదివ‌ర‌కు ఎన్న‌డూ ఎర‌గ‌ని స్థాయిలో పెట్టుబ‌డి పెట్టడం అనేది రైల్వేల వేగాన్ని, ప‌రిధి ని పెంచ‌డానికి దారి తీసింది అని ఆయ‌న ప్ర‌ముఖం గా ప్ర‌క‌టించారు.  సెమి- హై- స్పీడ్ ట్రేన్ లు, రైలు ప‌ట్టాల‌ను వేయ‌డానికి ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించ‌డం వంటి అంశాల‌ను గురించి ఆయ‌న మాట్లాడుతూ, ప్రతి ఈశాన్య ప్రాంత రాష్ట్ర రాజ‌ధాని ని  రైల్వేల‌ తో జ‌తపరచడం జ‌రుగుతుంద‌న్న ఆశ‌ ను వ్యక్తం చేశారు.  

క‌రోనా కాలం లో రైల్వేలు అందించిన ప్ర‌ముఖమైనటువంటి తోడ్పాటు ను ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెస్తూ, శ్రామికుల‌ను వారి ఇళ్ళ‌కు చేర్చ‌డంలో పోషించిన పాత్ర‌ కు గాను రైల్వేలను కొనియాడారు.



 

***
 


(Release ID: 1686778) Visitor Counter : 255