శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సిఎస్ఐఆర్-ఎన్ఏఎల్ అభివృద్ధి చేసిన స్వ‌స్థ్ వాయు నాన్ ఇన్వాజివ్ వెంటిలేట‌ర్ కు రెగ్యులేట‌ర్ అనుమ‌తి; 6 ప్రైవేట్ కంపెనీలతో టెక్నాల‌జీ వాణిజ్యీక‌ర‌ణ

నాడు పోస్టు చేయడమైనది: 05 JAN 2021 8:30PM by PIB Hyderabad

కోవిడ్‌-19 ప్రారంభ ద‌శ‌లో వెంటిలేట‌ర్ల‌కు గ‌ల‌ తీవ్ర కొర‌తను నివారించేందుకు సిఎస్ఐఆర్‌-ఐజిఐబి వైద్య‌వృత్తి నిపుణులు, సిఎస్ఐఆర్‌-ఎన్ఏఎల్ శాస్త్రవేత్త‌లు ముందుకు వ‌చ్చారు. వారు నాన్ ఇన్వేజివ్ బైలెవెల్‌ పాజిటివ్ ఎయిర్ వే ప్రెష‌ర్ వెంటిలేట‌ర్ స్వ‌స్థ్ వాయును దేశీయంగా అభివృద్ధి చేశారు. కోవిడ్‌-19 రోగుల చికిత్స‌కు అద‌న‌పు ఫీచ‌ర్ల‌తో కూడిన వెంటిలేట‌ర్ అందించ‌డం, వెంటిలేట‌ర్ల‌లో దేశం స్వ‌యం స‌మృద్ధంగా ఉండేలా చూడ‌డం దీని ల‌క్ష్యం. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన  ఆరోగ్య సేవ‌ల డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్  నియ‌మించిన నిపుణుల క‌మిటీ దీని ప‌నితీరును మ‌దింపు చేసింది. దాన్ని ఎంతో జాగ్ర‌త్త‌గా మ‌దింపు చేసిన అనంత‌రం స్వ‌స్థ్ వాయు వెంటిలేట‌ర్ ను 35 శాతం వ‌ర‌కు ఆక్సిజెన్ స‌ప్లిమెంట్ కావ‌ల‌సిన‌ కోవిడ్‌-19 రోగుల‌కు వినియోగించ‌వ‌చ్చున‌ని సిఫార‌సు చేసింది.

 

సిఎస్ఐఆర్‌-ఎన్ఏఎల్ అభివృద్ధి చేసిన ఈ స్వ‌స్థ్ వాయు...‌ హెపా ఫిల్ట‌ర్ (అధిక సామ‌ర్థ్యంతో కూడిన సూక్ష్మ ఎయిర్ ఫిల్ట‌ర్‌) అనుసంధానిత జీవ  “3డి ప్రింటెడ్ మానిఫోల్డ్ అండ్ క‌ప్ల‌ర్ గ‌ల క్లోజ్డ్ లూప్ అడాప్టివ్ కంట్రోల్ సిస్ట‌మ్‌”. ఈ  ప్ర‌త్యేక ల‌క్ష‌ణం వైర‌స్ వ్యాప్తికి చెందిన భ‌యాల‌ను తొల‌గిస్తుంది. సిపిఏపి, బై టైమ్డ్, ఆక్సిజెస్ కాన్సెంటేట‌ర్ లేదా వెలుప‌లి నుంచి క‌నెక్ట్ చేయ‌ద‌గిన ఎన్ రిచ్ మెంట్ యూనిట్ స‌దుపాయం గ‌ల‌  స్పాంటేనియ‌ల్‌/  ఆటో మోడ్ వంటి ప్ర‌త్యేక ఫీచ‌ర్లున్నాయి.

 

ఈ వెంటిలేట‌ర్  ఎల‌క్ర్టిక‌ల్ భ‌ద్ర‌త‌, ప‌నితీరు, బ‌యో కంపాటిబులిటీపై  ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన ఏజెన్సీ ఒక‌టి క‌ఠినంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. బెంగ‌ళూరులోని క‌మాండ్ హాస్పిట‌ల్‌, మైసూర్ మెడిక‌ల్ కాలేజి & రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ 50 మంది కోవిడ్‌-19  రోగుల‌పై స్వ‌స్థ్ వాయుకు సంబంధించిన క్లినిక‌ల్‌ప‌రీక్ష‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించాయి. కోవిడ్‌-19 రోగుల శాచ్యురేష‌న్ మెరుగుప‌ర‌చ‌డంలో “స్వ‌స్థ్ వాయు” సంతృప్తిక‌రంగా ప‌ని చేసింద‌ని క్లినిక‌ల్ ప‌రీక్ష‌ల నివేదిక‌లు స్ప‌ష్టంగా తెలియ‌చేస్తున్నాయి. సిఎస్ఐఆర్‌-ఐజిఐబి వైద్య నిపుణులు, బెంగ‌ళూరులోని క‌మాండ్ హాస్పిట‌ల్ కు చెందిన‌ సిఎస్ఐఆర్‌-ఎన్ఏఎల్ హెల్త్ సెంట‌ర్ మ‌ద్ద‌తుతో ఆ సంస్థ‌కు చెందిన ఏరోస్పేస్ శాస్త్రవేత్త‌లు, మైసూర్ కాలేజి & రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్‌, మైసూర్ ఉమ్మ‌డి కృషి ఫ‌లితం ఇది.

 

సిఎస్ఐఆర్‌-ఎన్ఏఎల్ ఆరు ప్రైవేటు కంపెనీల‌కు వాణిజ్య‌ప‌రంగా ఈ టెక్నాల‌జీని అందించింది. వాటిలో ఒక‌టి వారానికి 300 యూనిట్లు ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం గ‌ల ఉత్ప‌త్త‌తి కేంద్రం ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఇ విభాగంలోకి వ‌చ్చే కంపెనీ కూడా ఉంది. సిఎస్ఐఆర్‌-ఎన్ఏఎల్ కు ఇటీవ‌లే ఢిల్లీ ప్ర‌భుత్వం నుంచి 1200 స్వ‌స్థ్ వాయు ప‌రిక‌రాల‌కు ఆర్డ‌ర్ ల‌భించింది. ఢిల్లీలోని వివిధ ఆస్ప‌త్రుల్లో దాన్ని అమ‌ర్చి ప‌ని చేయించేందుకు కృషి జ‌రుగుతోంది. దీంతో ఈ టెక్నాల‌జీలో దేశం స్వ‌యంస‌మృద్ధి సాధించింది. భార‌త ప్ర‌భుత్వ ఆత్మ నిర్భ‌ర్ విజ‌న్ కు ల‌భించిన భారీ విజ‌యం ఇది.

 

రైట‌ప్ లు...

 

ఎంఎస్ఎంఇ టిఒటి భాగ‌స్వామ్యంలో స్వ‌స్థ్ వాయు  ఉత్ప‌త్తి కేంద్రం

 

సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్‌, బెంగ‌ళూరు అభివృద్ధి చేసిన స్వ‌స్థ్ వాయు బై పిఏపి ప‌రిక‌రం

 

ప‌రీక్ష కోసం ఏర్పాటు చేసిన ఊపిరి తిత్తుల‌కు ఆటో టెస్ట్ మోడ్ లో క‌లిపిన స్వ‌స్థ్ వాయు బై పిఏపి ప‌రిక‌రం

 

సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ స్వ‌స్థ్ వాయు బృందం

(శ్రీ రోష‌న్ ఆంథోనీ, శ్రీ కె.కుల‌శేఖ‌ర పాండ్య‌న్‌, శ్రీ ఎస్ జి. రామ‌నాథ‌న్, శ్రీ అలెగ్జాండ‌ర్ కాలే, శ్రీ సునీల్ ప్ర‌సాద్‌, శ్రీ ఇమంది రాజేష్‌, డాక్ట‌ర్ గురు గ‌ణేశ్‌, డాక్ట‌ర్ సిఎం ఆనంద‌, శ్రీ స‌త్య‌మూర్తి, శ్రీ మ‌హేశ్ కందం, శ్రీ జైదేవ్ వ్యాస్, శ్రీ బి.ప్ర‌దీప్ కుమార్‌, శ్రీ పంక‌జ్ ఆకుల‌, శ్రీ అరుల్ పాండ్య‌న్‌)

***


(రిలీజ్ ఐడి: 1686441) సందర్శకుల సూచీ సంఖ్య : : 313
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Tamil