ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఫార్మా, పరిశోధనా సంస్థల ఆమోదాల వేగవంతానికి నిపుణుల కమిటీ సిఫార్సులు

Posted On: 02 JAN 2021 7:31PM by PIB Hyderabad

కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడి ఎస్ సి వో) కు చెందిన నిపుణుల కమిటీ 2021 జనవరి 1, 2 తేదీలలో సమావేశమై ఈ దిగువ పేర్కొన్న సిఫార్సులు చేసింది. భారత ఔషధ నియంత్రణాధికారి తుది నిర్ణయం తీసుకోవటానికి పరిగణించాల్సిందిగా కోరుతూ ఈ అంశాలను ప్రస్తావించింది:

1) బహుళ నియంత్రణ షరతులకు లోబడి టీకాను నియంత్రిత అత్యవసర వాడకానికి పూణెలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతి మంజూరు చేయటం

2) ప్రజాప్రయోజనాల దృష్ట్యా పుష్కలంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ క్లినికల్ ట్రయల్స్ పద్ధతిలో, మరీ ముఖ్యంగా ఇప్పుడు తాజాగా వస్తున్న రెండో తరహా కోవిడ్ నేపథ్యంలో హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు  అనుమతి మంజూరు చేయటం

3) మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను విధివిధానాలకు అనుగుణంగా నిర్వహించటానికి అహమ్మదాబాద్ లోని కాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ కు అనుమతి మంజూరు చేయటం 

 

***(Release ID: 1685716) Visitor Counter : 9


Read this release in: English , Urdu , Hindi