గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ప్రజలకు ప్రధానమంత్రి కానుక అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భవన నిర్మాణ పరిజ్ఞానాలతో దేశంలో ఇళ్ల నిర్మాణం

ఆరు లైట్ హౌస్ ప్రాజెక్టు (ఎల్ హెచ్ పి )లకు శంఖుస్థాపన

పీఎంఏవై ( పట్టణ ) అవార్డుల ప్రధానం

కొత్త సాంకేతికతలు వనరుల సామర్థ్యం పెంచి,సమర్ధంగా పర్యావరణ హితంగా ఉంటాయి

అనుబంధ మౌలిక సదుపాయాలతో ఇండోర్, రాజ్ కోట్, చెన్నై, రాంచి , అగర్తల మరియు లక్నో వద్ద ప్రాజెక్టుల నిర్మాణం

జాతీయ పోటీ ద్వారా రాష్ట్రాలు / నగరాల ఎంపిక

సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి బదిలీ చేయడానికి మరియు విస్తరణకు ఎల్ హెచ్ పిలు ప్రత్యక్ష ప్రయోగశాలలుగా పనిచేస్తాయి

వేగంగా, పర్యావరణహితంగా తక్కువ ఖర్చుతో ఒకో ప్రాంతంలో 1000 ఇళ్ల నిర్మాణం

పీఎంఏవై ( పట్టణ ) కింద ఇంతవరకు 1. 09 కోట్ల గృహాల మంజూరు- వివిధ నిర్మాణ దశల్లో 70 లక్షల గృహాలు--40 లక్షల గృహాల అప్పగింత

అందరికి అందుబాటులో ఉండే విధంగా గృహ నిర్మాణ కార్యక్రమాల రూపకల్పనకు (ఆశా-ఇండియా) అయిదు కేంద్రాల ప్రారంభం

వినూత్న నిర్మాణ సాంకేతిక అంశాలపై ‘నవరితిహ్’సర్టిఫికెట్ కోర్సు విడుదల

Posted On: 01 JAN 2021 2:52PM by PIB Hyderabad

ఆరు రాష్ట్రాలలో గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ - ఇండియా (జిహెచ్ టిసి -ఇండియా)లో నిర్మించనున్న ఆరు లైట్ హౌస్ ప్రాజెక్టు (ఎల్ హెచ్ పి )ల నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంతో భారతదేశ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభంకానున్నది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులో ముందున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక పట్టణ సంస్థలు, లబ్ధిదారులకు వారు చేసిన సేవలు, అందించిన సహకారానికి గుర్తింపుగా ఆరు తరగతులలో ప్రధానమంత్రి వార్షిక అవార్డులను కూడా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా దేశం వివిధప్రాంతాల నుంచి ఎంపిక చేసిన 88 మంది లబ్ధిదారులను సన్మానించారు. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ, ఎల్ హెచ్ పి అమలు కానున్న త్రిపుర, జార్ఖండ్ ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,గుజరాత్,తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహనిర్మాణశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, కేంద్రరాష్ట్ర కేంద్ర రాష్త్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. పీఎంఏవై అవార్డులను 2019 నుంచి కేంద్ర గృహనిర్మాణం,పట్టణ వ్యవహారాలశాఖ ప్రధానం చేస్తున్నది.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలు చేరువ చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నిర్మాణ ప్రక్రియలను అవలంబిస్తూ తక్కువ ఖర్చుతో, వేగంగా పర్యావరణహితంగా ఇళ్లను నిర్మించడానికి ఎల్ హెచ్ పి పధకం రూపొందించబడింది. ఎల్ హెచ్ పిల వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. వీటి జీవితకాలం ఎక్కువగా ఉండడమే కాకుండా తక్కువ ఖర్చుతో సురక్షితంగా వేగంగా నిర్మిచడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల ' 2022 నాటికి ప్రతిఒక్కరికి గృహవసతి' కల్పించాలన్న ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరుతుంది. పట్టణీకరణ దిశగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో అత్యాధునికమైన అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగిస్తూ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడానికి ఎల్ హెచ్ పిల ద్వారా అవకాశం కలుగుతుంది. అనుబంధ మౌలిక సదుపాయాలతో ఎల్ హెచ్ పిలను ఇండోర్( మధ్యప్రదేశ్), రాజ్ కోట్ (గుజరాత్), చెన్నై(తమిళనాడు), రాంచి( జార్ఖండ్), అగర్తల(త్రిపుర) మరియు లక్నో( ఉత్తరప్రదేశ్) చేపట్టనున్నారు. జాతీయ స్థాయిలో పోటీని నిర్వహించి రాష్ట్రాలను, ఎల్ హెచ్ పిలను చేపట్టే ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి. జిహెచ్ టిసి -ఇండియా లో భాగంగా 54 సాంకేతిక పరిజ్ఞానాలను పరిశీలించి వీటి నుంచి ఎంపిక చేసిన ఆరు సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి ఒకో ప్రాంతంలో దాదాపు 1000 గృహాలను నిర్మించడం జరుగుతుంది. "2022 నాటికి"అందరికీ గృహవసతి " కల్పించాలన్న ప్రధానమంత్రి ఆశయ సాధనకు ఎల్ హెచ్ పి లు ఎంతగానో ఉపయోగపడతాయి. నిర్మాణంలో నూతన అత్యాధునిక నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడం జరుగుతుంది. ఇవి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఉంటాయి' అని గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా అన్నారు.

ఇండోరేలోని ఎల్ హెచ్ పి చైనాలో రూపొందినముందుగా నిర్మించిన శాండ్ విచ్ ప్యానెల్ సిస్టమ్ను వినియోగిస్తుంది. రాజ్ కోట్ లో ఫ్రాన్స్ నుండి వచ్చిన టన్నెల్ ఫార్మ్ వర్క్ ను ఉపయోగించి ఏకశిలా కాంక్రీట్ నిర్మాణంపద్ధతిని ఉపయోగిస్తారు. ఫిన్లాండ్ మరియు యుఎస్ఎ నుండి తీసుకున్న ప్రీకాస్ట్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ సిస్టమ్టెక్నాలజీ చెన్నైలో ఉపయోగించబడుతుంది. జర్మనీ నుంచి తీసుకున్న ‘3 డి వాల్యూమెట్రిక్ ప్రీకాస్ట్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ సిస్టమ్అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాంచీ లోని ఎల్ హెచ్ పి నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్ కి చెందినస్ట్రక్చరల్ స్టీల్ ఫ్రేమ్ విత్ లైట్ గేజ్ స్టీల్ ఇన్ ఫిల్ ప్యానెల్స్వ్యవస్థ అగర్తల వద్ద ఉపయోగించబడుతుంది. లక్నోలోని ఎల్ హెచ్ పికి కెనడాకి చెందినపివిసి స్టే ఇన్ ప్లేస్ ఫార్మ్ వర్క్ సిస్టమ్అనే సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది.

నిర్మాణ రంగానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి మరియు వాటికి మరింత ప్రచారం కల్పించడానికి ఎల్ హెచ్ పి లు ప్రయోగశాలలుగా ఉపయోగపడతాయి.ఐఐటీ లు / నిట్ లు / ఇంజనీరింగ్ కళాశాలలు / ప్రణాళిక మరియు ఆర్కిటెక్చర్ కళాశాలలు, బిల్డర్లు, ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల నిపుణులు మరియు ఇతర వాటాదారుల యొక్క అధ్యాపకులు మరియు విద్యార్థుల కోసం ప్రణాళిక, రూపకల్పన, పరికరాల ఉత్పత్తి, నిర్మాణ పద్ధతులు మరియు పరీక్షలు దీనిలో భాగంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం నిర్మాణ రంగంలో వేగం, స్థిరత్వం, వనరుల సామర్థ్యం, పర్యావరణహితం ఉంటాయి. విపత్తులను తట్టుకుని నిలబడే ఈ నిర్మాణాలు నాణ్యతతో ఎక్కువ కాలం మన్నుతాయి.

కొత్త మరియు ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి 2019 మార్చిలో జీహెచ్ టీసీ-ఇండియాను ప్రారంభించినప్పుడు ప్రధాని 2019-20 సంవత్సరాన్ని కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇయర్గా ప్రకటించారు. 'కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇయర్'లో భాగంగా, ఎల్ హెచ్ పిలతో పాటు, వినూత్న నిర్మాణ టెక్నాలజీలపై సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించడం మరియు జిహెచ్ టిసి- ఇండియా గుర్తించిన 54 వినూత్న గృహ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాల సంకలనంని ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి విడుదల చేశారు. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇయర్లో భాగంగా భారతదేశంలోని వల్నరబిలిటీ అట్లాస్ పై ఇ-కోర్సును గృహనిర్మాణం పట్టణ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి ఇప్పటికే ప్రారంభించారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కిందగృహ నిర్మాణ కార్యక్రమాలను అందరికి అందుబాటులో సుస్థిరంగా వుండే కార్యక్రమాలను రూపొందించడానికి (ఆశాఇండియా) ఏర్పాటు చేసిన ఐదు ఇంక్యుబేషన్ సెంటర్లను ప్రారంభించారు. వనరులను సమర్ధంగా వినియోగించడం, విపత్తులను తట్టుకుని ఎక్కువ కాలం మన్నే నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడానికి ఈ కేంద్రాలు ఈ కార్యక్రమంలో ప్రారంభించబడ్డాయి. స్వదేశీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి నిర్వహించిన పోటీలో గెలుపొందిన అయిదుగురు విజేతలను ప్రకటించారు.

స్వాతంత్ర్యం 75 వ సంవత్సరాన్ని భారతదేశం జరుపుకునే సమయానికి ప్రతి ఒక్కరికి గృహవసతి కల్పించాలన్న ప్రధానమంత్రిఆశయం నెరవేరే అంశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మిషన్ కీలక పాత్ర పోషిస్తోంది. 1.12 కోట్ల గృహాలను కేటాయించాలన్న లక్ష్యంలో భాగంగా ఇంతవరకు 1.09 Cr ఇళ్ళు మంజూరు చేయబడ్డాయి. 70 లక్షలకంటే ఎక్కువ గృహాల నిర్మాణం వివిధ దశలలో ఉంది. దాదాపు 40 లక్షల గృహాల పూర్తయి లబ్ధిదారులకు పంపిణీ చేయబడ్డాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రజలు ఆరోగ్యం, విద్య, భద్రతతో గౌరవప్రదమైన జీవనం గడపడానికి మహిళలకు సాధికారతను కల్పిస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నది.

***(Release ID: 1685564) Visitor Counter : 144