శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దిగుమతిదారు స్థాయి నుండి పి.పి.ఈ. లను ఉత్పత్తి చేసే రెండవ అతిపెద్ద తయారీదారుగా భారతదేశాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించిన - టెక్నాలజీ ఆధారిత అంకురసంస్థలు

Posted On: 31 DEC 2020 4:26PM by PIB Hyderabad

కోవిడ్-19 కి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధంలో రెండవ అతిపెద్ద వ్యక్తిగత రక్షణ సామగ్రి (పి.పి.ఈ) తయారీదారుగా భారతదేశం అంతర్జాతీయంగా గుర్తింపు పొందడంలో - దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంకురసంస్థలు అభివృద్ధి చేసి, పెంపొందించిన, తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానం - కీలక పాత్ర పోషించింది.  

కోవిడ్-19 కి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో కీలకమైన కవచాలైన, మాస్కులు, ఫేస్ షీల్డులు వంటి పి.పి.ఈ.లు మొదలైన వాటిని, వ్యాధి వ్యాప్తి నుండి రక్షణగా, ముఖ్యంగా, వైద్య నిపుణులు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పరిష్కరించేటప్పుడు, ముఖ్యంగా, వ్యాధి వ్యాప్తి నుండి రక్షణగా ఉపయోగిస్తారు.  మహమ్మారి కాలం ప్రారంభంలో భారతదేశం పి.పి.ఈ.లను దిగుమతి చేసుకోవలసి వచ్చేది. అయితే, ప్రస్తుతం, భారతదేశం, సరసమైన ధరల్లో మాస్కుల తయారీ యంత్రాలు, తక్కువ ఖర్చుతో కూడిన మాస్కులు, పునర్వినియోగానికి అనువుగా యాంటీ-వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ మాస్కులతో పాటు, ఆరోగ్య కార్యకర్తల కోసం అంకురసంస్థలు ప్రత్యేకంగా రూపొందించిన భద్రతా మాస్కులు మొదలైన వాటిని ఎగుమతి చేయడం ప్రారంభించింది.

జాతీయ శాస్త్ర, సాంకేతిక వ్యవస్ధాపకత అభివృద్ధి మండలి (ఎన్.‌ఎస్.‌టి.ఈ.డి.బి) చొరవతో, కోవిడ్-19 ఆరోగ్య సంక్షోభానికి వ్యతిరేకంగా యుద్దాన్ని బలోపేతం చేసే కేంద్రం (కవచ్) పరిధిలో, శాస్త్ర, సాంకేతిక విభాగం,  ఈ అంకుర సంస్థల్లో, చాలా వాటికి మద్దతు ఇచ్చింది.

ప్రతి నిత్యం ఉపయోగించుకునే వస్తువులను స్థానికంగా ఉత్పత్తి చేయాలనే ఉద్దేశ్యంతో, గతంలో, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ఆటోమేటిక్ శానిటరీ న్యాప్ ‌కిన్ తయారీ యంత్రాన్ని అభివృద్ధి చేసిన, ముంబాయి కి చెందిన, సరళ్ డిజైన్ సొల్యూషన్స్ అనే ఒక సంస్థ, ఇప్పుడు, మూడు పొరల సర్జికల్ మాస్కులను తయారు చేసే విధంగా వారి యంత్రాన్ని ఆధునీకరించింది.

 

"స్వచ్ఛ్" అని పిలువబడే పూర్తిగా స్వయం చాలకంగా పనిచేసే మూడు పొరల మాస్కుల తయారీ యంత్రం స్థానికంగా మాస్కులను ఉత్పత్తి చేయడంతో, తద్వారా రవాణా అవసరాన్ని తొలగిస్తోంది.  దక్షిణ భారత వస్త్ర పరిశోధనా సంస్థ (సిట్రా) ధృవీకరించిన, అధిక నాణ్యత గలిగిన, స్పన్‌ మెల్ట్ (ఎస్.‌ఎస్.‌ఎం.ఎం.ఎస్) ఆధారిత మాస్కులను, ఈ యంత్రం ఫిల్టర్ మరియు ముక్కు తీగతో చాలా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తుంది.  దీనికి తోడు, ఈ తయారీలో స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది. 

 

మహీంద్రా సంస్థ, ఈ  యంత్రాన్ని తమ ప్లాంట్ ‌కు తీసుకువెళ్ళి, లాక్‌ డౌన్ సమయంలో, మాస్కుల తయారీ ప్రారంభించి,   మాస్కుల అత్యవసర అవసరాన్ని తీర్చడానికి వీలుగా, సరఫరా వ్యవస్థకు సహాయపడింది.  అనుకుర సంస్థలు - కార్పొరేట్ సంస్థలకు మధ్య సహకారానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇది అంకురసంస్థల చురుకుదనం, ఆవిష్కరణలను కలిపి, అత్యవసర పరిస్థితుల్లో తలెత్తే అవసరాలను తీర్చడానికి కార్పొరేట్ సంస్థల సహాయం తీసుకోడానికి తోడ్పడుతుంది.

వారి ఆవిష్కరణల ద్వారా ఉత్పత్తి చేసిన సుమారు 1.4 మిలియన్ల మాస్కులను,  వైద్యులు, పోలీసులు, నర్సులు మరియు జిల్లా ఆరోగ్య విభాగాలు వంటి ఫ్రంట్‌ లైన్ కార్మికుల కోసం, క్రౌడ్ ఫండింగ్ ప్రచార కార్యక్రమాల ద్వారా. సి.ఎస్.‌ఆర్. ‌లో భాగంగా,  విరాళంగా అందజేశారు. యంత్రాలలో ఒకదానిని, ఐ.ఎస్.టి. కవచ్ ఆర్ధిక సహకారంతో, హర్యానాలోని భివానీలో ఏర్పాటు చేశారు.  ఈ యంత్రం నుండి ఉత్పత్తి చేయబడిన మాస్కులను, హర్యానా చుట్టుపక్కల రాష్ట్రాల్లోని ఫ్రంట్ ‌లైన్ కార్మికులకు పంపిణీ చేస్తున్నారు. 

బెంగళూరుకు చెందిన ప్రింటలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ, వైరస్ సంక్రమణ నుండి రక్షణ కోసం మూడు ఉత్పత్తులను అభివృద్ధి చేసింది - అవి, రక్షిత ముఖ కవచాలు, కాంటాక్ట్ ‌లెస్ డోర్ ఓపెనర్లు, ఇంట్యూబేషన్ బాక్సులు.   ఈ సంస్థ, చెన్నై కి చెందిన హెచ్.‌టి.ఐ.సి-ఐ.ఐ.టి.ఎమ్.‌త కలిసి, వీటి ఉత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు, మార్కెట్ అవసరాలను తీర్చడానికి, ఉత్పత్తుల స్థోమత, నాణ్యత, కార్యాచరణను మెరుగుపరచడానికి అవసరమైన స్థాయిని సాధించింది.  కవచ్ నిధులతో పాటు, హెచ్.‌టి.ఐ.సి-ఐ.ఐ.టి.ఎమ్.‌తో అనుబంధం, సంస్థ, తన ఉత్పత్తుల రూపకల్పనను ధృవీకరించడానికి సహాయపడింది.  అదేవిధంగా, ఇప్పటికే ఉన్న ఎమ్.ఎస్.ఎమ్.ఈ. నెట్ ‌వర్క్, సరఫరా వ్యవస్థతో పాటు లక్ష్య వినియోగదారు స్థావరంలో విజయవంతమైన విస్తరణను ఉపయోగించి పెద్ద పరిమాణంలో తయారీని వేగవంతం చేయడానికి దోహదపడింది.

ఫేస్ షీల్డులు 

స్పర్శ అవసరం లేని  వస్తువులు 

ఇంట్యూబేషన్ బాక్సు

కోవిడ్-19 రోగులను పరీక్షించడానికి అవసరమైన నాసికా లేదా నోటి నుండి స్వాబ్స్ సేకరించడానికి, కోవిడ్-19 మహమ్మారి సమయంలో బహిరంగ ప్రదేశంలో లేదా టెలిఫోన్ బూత్ తరహా గదులను ఉపయోగించవలసిన అవసరం ఉంది.  బహిరంగ ప్రదేశాల్లో నమూనా సేకరణ చేపడితే,  ఆరోగ్య అభ్యాసకులు, వారి తక్షణ పని వాతావరణంతో పాటు, పి.పి.ఈ. పరికరాలు, హానికరమైన వైరస్ మోసే బిందువులకు బహిర్గతం అవుతారు.   మరోవైపు టెలిఫోన్ బూత్ తరహా గదులు కూడా అన్నిరకాల వైద్య చికిత్సా విధానాలకు అనువుగా ఉండవు.  వైద్య నిపుణులు తమకు వైరస్ సోకకుండా రోగుల నోటి స్వాబ్స్ సేకరించడానికి వీలుగా,  కోమోఫీ మెడ్ ‌టెక్ అనే సంస్థ ఎన్.టి-మాస్కును అభివృద్ధి చేసింది. ఇది పారదర్శక ఎన్-95 ముసుగు. ఇది ప్రత్యేక యాక్సెస్ పాయింట్‌ తో చేతి స్పర్శ లేకుండా నాసికా లేదా నోటి నుండి స్వాబ్స్ సేకరణకు ఉపయోగపడుతుంది. 

కేవలం రెండు నెలల కాలంలో, ఎన్.టి.-మాస్కుల ఉత్పత్తిని గణనీయంగా పెంచిన ఈ  ఈ అంకురసంస్థ, ప్రస్తుతం రోజుకు 1000 మాస్కులు తయారు చేసే స్థాయికి చేరింది.  ఈ మాస్కు, తుంపర్లను నిరోధించే పీడనం కలిగి, శ్వాసక్రియ సులువుగా జరగడానికీ, బాక్టీరియా లోపలి రాకుండా వడపోసే సామర్థ్యం వంటి అవసరమైన సౌకర్యాలు కలిగి ఉంటుంది. ఇది ఎన్.ఏ.బి.సి.బి గుర్తింపు పొందిన ప్రయోగశాల ద్వారా పరీక్షింపబడి, ధృవీకరించబడింది.

న్యూ ఢిల్లీ కి చెందిన నానోక్లీన్ గ్లోబల్ అనే సంస్థ, నానో ఫైబర్లను ఉపయోగించి నాసోమాస్క్, ఎన్.95 / ఎఫ్.ఎఫ్.పి-2 గ్రేడు  ఫేస్ మాస్కు ను అభివృద్ధి చేసింది. ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్ లకు వ్యతిరేకంగా ఇది చాలా సమర్థవంతంగా పనిచేయడంతో పాటు, శ్వాసక్రియను అధికంగా తీసుకునే శక్తిని, అతితక్కువ శ్వాస నిరోధకతనూ కలిగి ఉంటుంది.

"కవచ్"  కార్యక్రమం అమలు భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఎస్.ఐ.ఎన్.ఈ-ఐ.ఐ.టి. బొంబాయి, అంకురసంస్థలకు వివిధ దశలలో సహకరిస్తోంది.  అదనంగా, మరో ఎనిమిది ఇంక్యుబేషన్ కేంద్రాలు, భారత ఎస్.టి.ఈ.పి. లు మరియు ఇంక్యుబేటర్లతో పాటు భారతదేశంలోని వివిధ మండలాల నుండి -  ఐ.ఐ.టి., ఢిల్లీ లోని ఎఫ్.ఐ.ఐ.టి.; ఐ.ఐ.టి. కాన్పూర్ లోని ఎస్.ఐ.ఐ.సి.;  ఐ.ఐ.టి. మద్రాస్ లోని హెచ్.టి.ఐ.సి.; పూణే లోని వెంచర్ సెంటర్;  హైదరాబాద్ఐ లోని ఐ.కె.పి.నాలెడ్జ్ పార్కు;  భువనేశ్వర్ లోని కె.ఐ.ఐ.ట్-టి.బి.ఐ. వంటి సహాయక ఉపగ్రహ కేంద్రాలను, వివిధ దశలలో అంకురసంస్థలకు సహాయం అందించేందుకు గుర్తించడం జరిగింది.

*****



(Release ID: 1685275) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi , Punjabi