ఆయుష్

ఔష‌ధ మొక్క‌ల కోసం స‌హాయ సంఘాన్ని ప్రారంభించిన జాతీయ ఔష‌ధ మొక్క‌ల బోర్డు

Posted On: 28 DEC 2020 5:42PM by PIB Hyderabad

ఔష‌ధ మొక్క‌ల విలువ‌, స‌ర‌ఫ‌రా గొలుసులో భాగ‌స్వాముల మ‌ధ్య అనుసంధానం అవ‌స‌రం అని ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఔష‌ధ మొక్క‌ల బోర్డు (ఎన్ ఎంపిబి) యోచిస్తోంది. 
గుణాత్మ‌క మొక్క‌ల నాటేందుకు వినియోగించే సామాగ్రిపై ప‌రిశోధ‌న‌, అభివృద్ధి, సాగు, ఔష‌ధ మొక్క‌ల వాణిజ్యం/  మార్కెట్ అనుసంధాన‌త వంటి అంశాల‌పై ఎన్ ఎంపిబి స‌హాయ సంఘాలు చ‌ర్చించి, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాయి.
రైతులు, ఉత్ప‌త్తిదారుల మ‌ధ్య అనుసంధానాన్ని ఏర్పాటు చేసేందుకు, సీడ్ షెల్ఫ్ ప‌ద్ధ‌తిని ప్ర‌వేశ‌పెడుతున్నారు. ఇందులో నాణ్య‌మైన నాటేందుకు వినియోగించే సామాగ్రి (క్యూపిఎం), మంచి వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తులు (జిఎపి), మంచి పంట కోత ప‌ద్ధ‌తుల‌(జిపిహెచ్‌పి)ల‌కు సంబంధించిన అంశాలకు సంబంధించిన విష‌యాల‌ను ప‌రిష్క‌రిస్తారు. 
మొద‌టి ద‌శ‌లో ఎన్ ఎంపిబి స‌హాయ సంఘాల‌ను అశ్వ‌గంధ‌(Withania somnifera), పిప్ప‌లి (Piper longum), ఓన్లా (Phyllanthus emblica ), గుగ్గులు (Commiphora wightii ), శ‌తావ‌రి (Asparagus racemosus)వంటి ఔష‌ధ మొక్క‌ల‌కు ప్ర‌తిపాదించారు. 
ఎన్ఎంపిబి స‌హాయ సంఘానికి రిజిస్ట్రేష‌న్‌కు లింకు ఎన్ ఎంపిబి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అర్హులైన రైతులు, ఎఫ్‌పిఒలు/ ఎఫ్‌పిసి/ ఒపిఎం కేంద్రాలు/  విత్త‌న బ్యాంకులు/ న‌ర్స‌రీలు/ స‌్వ‌యం స‌హాయ‌క బృందాలు/ స‌్వ‌చ్ఛంద సంస్థ‌లు/ వ‌్యాపార‌వేత్త‌లు/ ఉత్ప‌త్తిదారులు/ ఎగుమ‌తిదారులు/  ఫార్మా/ ప‌రిశోథ‌క సంస్థ‌లు / వ‌్య‌వ‌సాయ యూనివ‌ర్సిటీలు స‌హాయ సంఘంలో భాగ‌స్వాములు కావ‌డానికి న‌మోదు చేసుకోవ‌చ్చు. 

 

***


(Release ID: 1684374) Visitor Counter : 221