యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

టాప్స్‌ పథకం కింద హంగేరీ మరియు పోలాండ్‌లో వినేష్ ఫోగాట్‌కు 40 రోజుల విదేశీ కోచింగ్ క్యాంప్ మంజూరు చేయబడింది

Posted On: 25 DEC 2020 4:01PM by PIB Hyderabad

టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) ద్వారా ప్రభుత్వం రెజ్లర్ వినేష్ ఫోగాట్‌తో పాటు ఆమె వ్యక్తిగత కోచ్ వోలర్ అకోస్, ఆమె స్పారింగ్ భాగస్వామి ప్రియాంక ఫోగాట్ మరియు ఆమె ఫిజియోథెరపిస్ట్ పూర్ణిమా రామన్ న్గోమ్‌దిర్ కోసం 40 రోజుల శిక్షణా శిబిరాన్ని మంజూరు చేసింది. ఈ శిబిరం 2020 డిసెంబర్ 28 నుండి 2021 జనవరి 24 వరకు హంగేరిలోని బుడాపెస్ట్ లోని వాసాస్ స్పోర్ట్స్ క్లబ్‌లో మరియు పోలాండ్‌లోని స్జ్జ్రిక్‌లోని ఒలింపిక్ శిక్షణా కేంద్రంలో జనవరి 24 నుండి ఫిబ్రవరి 5, 2021 వరకు జరుగుతుంది. తద్వారా సుమారు రూ. 15.51 లక్షల రూపాయలు ఖర్చు అంటే విమాన ఛార్జీలు, స్థానిక రవాణా, బోర్డింగ్ మరియు బస ఛార్జీలు మరియు ఇతర ఖర్చులను ప్రభుత్వం అందిస్తుంది. టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకంలో ఫోగాట్ ఒక భాగం.

శిక్షణా శిబిరాన్ని ఫోగాట్ యొక్క వ్యక్తిగత కోచ్ వోలర్ అకోస్ ప్లాన్ చేశారు. ఈ శిబిరం ఆమె బరువు విభాగంలో చాలా మంది యూరోపియన్ రెజ్లర్లతో తలపడడానికి మరియు ఆమె సాంకేతిక మరియు వ్యూహాత్మక అంశాలను మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది.

ఫోగాట్ విదేశీ శిక్షణా శిబిరం కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె మాట్లాడుతూ "ఒక మల్లయోధురాలిగా నేను నా స్థాయిని తెలుసుకోవాలి మరియు మంచి మల్లయోధులతో తలపడడంతో పాటు నేను ఎక్కడ నిలబడి ఉన్నానో అంచనా వేయడానికి ఈ క్యాంప్ చాలా సహాయకారిగా ఉంటుంది." అని తెలిపారు.

2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన తరువాత మహిళల 53 కిలోల ఈవెంట్‌లో జూలై-ఆగస్టు 2021 న జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌కు ఫోగాట్ అర్హత సాధించారు. అక్టోబర్ 2020 నుండి ఎస్‌ఏఐ లక్నోలో ప్రారంభమైన మహిళల రెజ్లర్ల  జాతీయ శిబిరంలో ఫోగాట్ పాల్గొన్నారు. కరోనా వైరస్ లాక్‌డౌన్‌కు ముందు ఆమె చివరి పోటీ ప్రదర్శన ఫిబ్రవరిలో న్యూ ఢిల్లీ జరిగిన ఆసియా సీనియర్ ఛాంపియన్‌షిప్. అక్కడ ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

***



(Release ID: 1683611) Visitor Counter : 182