శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సైన్స్ పట్ల యువతను ఆకర్షించడంతో పాటు వారిలో వినూత్న స్ఫూర్తిని పెంపొందించడం యొక్క అవసరాన్ని సాంకేతిక పరిశోధకులు నొక్కి చెప్పారు
Posted On:
24 DEC 2020 4:55PM by PIB Hyderabad
యువతను సైన్స్ వైపు ఆకర్షించడంతో పాటు చిన్నవయస్సు నుండే వారిలో ఒక వినూత్న స్ఫూర్తిని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను డిడి న్యూస్ చర్చలో సాంకేతిక పరిశోధకులు వెల్లడించారు.
"దేశం యొక్క పురోగతి కోసం భారతదేశ ప్రతిభను సముచితంగా ఉపయోగించడం కోసం చిన్న వయస్సు నుండే యువతను సైన్స్ లోకి ఆకర్షించడం అతిపెద్ద సవాలు" అని డైరెక్టర్ జనరల్, సిఎస్ఐఆర్ డాక్టర్ శేఖర్ సి మాండే డిడి న్యూస్ లో జరిగిన సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ ద వే ఫార్వర్డ్ అనే చర్చలో వెల్లడించారు.
ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్ 2020) యొక్క ఆరవ ఎడిషన్ ప్రారంభోత్సవంలో దేశ ప్రగతి మరియు అభివృద్ధి కోసం సైన్స్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణలను ఉపయోగించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించిన తరువాత ఈ చర్చ జరిగింది.
"మనకు దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క గొప్ప సంప్రదాయం ఉంది. ఈ రంగంలో మా విజయాలు అపూర్వమైనవి, మరియు ఈ రోజు మనం ఉన్న చోటికి తీసుకెళ్లడానికి ఇది కీలక పాత్ర పోషించింది ”అని డాక్టర్ మాండే చర్చలలో అన్నారు.
కొత్త విద్యా విధానంలో ప్రవేశపెట్టిన ఈవెంట్ ఆధారిత బోధన మరియు అభ్యాసం పిల్లల మనస్సులను సైన్స్ అండ్ టెక్నాలజీలోకి ఆకర్షించడానికి మరియు శాస్త్రీయ నిగ్రహాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని ఆయన ఉద్ఘాటించారు. "పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించడానికి మరియు గ్రామాల్లోని జనాభాకు సైన్స్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణలలో పాల్గొనడానికి సమాన అవకాశాలను అందించడానికి మేము స్థానిక భాషలలో సైన్స్ మరియు టెక్నాలజీని వ్యాప్తి చేయాలి" అని ఆయన చెప్పారు.
"మన దగ్గర అవసరమైనంత ప్రతిభ ఉంది. వివిధ వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు వాటిని ఎగుమతి కూడా చేశామని అందుకు కొవిడ్-19 ఒక పెద్ద ఉదాహరణ. ప్రధానమంత్రి చేపట్టిన ఆత్మనీర్భర్ భారత్ కలను సాకారం చేసే సామర్థ్యం, ప్రతిభ మరియు నైపుణ్యం దేశంలోని శాస్త్రవేత్తలకు ఉన్నాయి ”అని డాక్టర్ మాండే నొక్కి చెప్పారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టి) సలహాదారు మరియు పిసిపిఎం హెడ్ డాక్టర్ అఖిలేష్ గుప్తా శాస్త్రీయ దృక్పదాన్ని మరియు నాణ్యమైన పరిశోధనలను అభివృద్ధి చేయడంలో ఆవిష్కరణల ప్రారంభం సహాయపడుతుందని వివరించారు. “విద్య త్వరగా మొదలవుతుంది, కాని ఆవిష్కరణ చాలా ఆలస్యంగా మొదలవుతుంది. ఆ విధానం మారాలి, ”అని డాక్టర్ గుప్తా అన్నారు.
డాక్టర్ గుప్తా సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ (STIP 2020) నాణ్యమైన పిహెచ్.డి సాధనకు సహాయపడుతుందని ఆశించారు. తద్వారా దేశ పురోగతి మరియు అభివృద్ధి కోసం కృషి చేయడానికి దేశంలోని పరిశోధకులు కృషిచేస్తారన్నారు . నైపుణ్యాన్ని మరియు వారి ఉత్సహాన్ని దేశానికి తోడ్పడే విధంగా మార్చాల్సిన అవసరం గురించి ఆయన మాట్లాడారు.
గ్రామాలు మరియు మారుమూల ప్రాంతాల ప్రజలు విజ్ఞాన శాస్త్రాన్ని ఏవిధంగా ఉపయోగిస్తున్నారన్న ఆంశాన్ని డాక్టర్ గుప్తా వివరించారు. " విజ్ఞానశాస్త్రం యొక్క అంతిమ లక్ష్యం ప్రజలను కేంద్రీకృతం చేయడం మరియు ఆర్థిక మరియు మానవ అభివృద్ధికి కీలకమైన చోదనగా ఉపయోగించడం" అని గ్రామాలకు వైఫై అందుబాటులో ఉంచే కొత్త ప్రతిపాదిత పథకాన్ని ఒక ఉదాహరణను ఉటంకిస్తూ ఆయన అభిప్రాయపడ్డారు.
"శాస్త్రీయ ప్రచురణల రంగంలో మరియు స్టార్టప్‌లలో మనం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాము. సైన్స్లో 25,000 పిహెచ్.డిలను ఉత్పత్తి చేస్తున్నాము. యుఎస్ మరియు చైనాకు దగ్గరగానే ఉన్నాము. కళాశాల పరిశోధనలో మనం 2013లో 13 వ స్థానంలో ఉన్నాము. కాని ఈ రోజు మనం 9 వ స్థానంలో ఉన్నాము ”అని అన్నారు.
స్వయం సంమృద్ధిలో సాంకేతిక రంగం పాత్రపై జరిగిన ఈ చర్చలో విజ్ఞాన భారతి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ జయంత్ సహస్రబుధే కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 1683508)
Visitor Counter : 556