ఆర్థిక మంత్రిత్వ శాఖ

త్రిపుర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల తయారీలో తోడ్పాటుకు ఏడీబీ, భార‌త్‌ సంతకం


Posted On: 18 DEC 2020 10:35PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో పట్టణ సౌకర్యాలను మెరుగుపరచడానికి, పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల తయారీకి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), భారత ప్రభుత్వం  ఈ రోజు 4.21 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ రెడీనెస్ ఫైనాన్సింగ్ ఒప్పందంపై (పీఆర్ఎఫ్) సంతకం చేశాయి. భారత్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఒక రాష్ట్రానికి ఏడీబీ అందిస్తు‌న్న తొలి పీఆర్ఎఫ్ ఫెసిలిటీ ఇది. త్రిపుర పట్టణ, పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఉద్దేశించిన‌ పీఆర్‌ఎఫ్‌పై భారత ప్రభుత్వం త‌ర‌ఫున‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ సి.ఎస్‌.మోహపాత్ర‌, ఏడీబీ ఇండియా రెసిడెంట్ మిష‌న్‌ కంట్రీ డైరెక్టర్ శ్రీ‌ టేకో కొనిషి సంతకం చేశారు. ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే రంగాలలో కీలకమైన మౌలిక సదుపాయాల పెట్టుబడి ప్రాజెక్టులు, సంబంధిత సంస్కరణలను అభివృద్ధి చేయడం ద్వారా సమగ్ర ప్రణాళికతో పట్టణ సేవలు మరియు పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి త్రిపుర రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఫెసిలిటీ ఎంత‌గాగో తోడ్పడుతుందని డాక్టర్ మోహపాత్ర తెలిపారు. వాతావరణ మరియు విపత్తు స్థితిస్థాపకత, సమగ్రత మరియు ఉప ప్రాజెక్టుల స్థిరత్వాన్ని భరోసా చేసేటప్పుడు సాధ్యత అధ్యయనాలు, వివరణాత్మక ఇంజినీరింగ్ డిజైన్లను తయారు చేయడం మరియు రాష్ట్ర స్థాయి ఏజెన్సీల సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల యొక్క అధిక సంసిద్ధతను నిర్ధారించడం‌ ఈ సౌకర్యం యొక్క లక్ష్యం అని శ్రీ కొనిషి తెలిపారు. పట్టణ మౌలిక సదుపాయాలు మరియు పట్టణ స్థానిక సంస్థల (యుఎల్‌బీ) తక్కువ సంస్థాగత సామర్థ్యం త్రిపురలో పట్టణీకరణ నేతృత్వంలో వృద్ధికి ఆటంకం కలిగించాయి. 7 జిల్లాల ప్రధాన కార్యాలయాలు (డీహెచ్‌టీ) మరియు 13 యుఎల్‌బీలకు నీటి సరఫరా, పారిశుధ్యం, వ‌ర‌ద నీటి పారుదల, పట్టణ రహదారులు, పట్టణ సౌకర్యాలపై దృష్టి సారిస్తూనే.. రాష్ట్ర సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలకు పీఆర్ఎఫ్ సహాయం చేస్తుంది.

తగినంత మౌలిక సదుపాయాలు, ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలు లేకపోవడం వల్ల రాష్ట్ర పర్యాటక వృద్ధికి కూడా ఆటంకం క‌లుగుతుంది. ఆర్థిక వ్యవస్థకు పర్యాటక సహకారాన్ని మెరుగుపర్చాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు పీఆర్ఎఫ్ మద్దతు ఇస్తుంది మరియు సమగ్ర పర్యాటక మౌలిక సదుపాయాల ప్రణాళికల అభివృద్ధికి తోడ్పడుతుంది. మార్కెటింగ్ మరియు ప్రమోషన్ వ్యూహాలతో పాటు సౌకర్యాలను కల్పించడం, పర్యాటక ప్రదేశాలకు రహదారి అనుసంధాన‌తను మెరుగుపరచడం వంటివి ఇందులో ఉన్నాయి. పేదరికాన్ని నిర్మూలించడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తూ, సంపన్నమైన, స‌మ్మిళిత‌మైన‌, స్థితిస్థాపకంగా మరియు స్థిరమైన ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాన్ని ఏర్పాటు చేయ‌డానికి ఏడీబీ కట్టుబడి ఉంది. 1966 లో స్థాపించబడిన దీనిలో ఈ ప్రాంతం నుండి 68 మంది ఉండ‌గా ఇందులో 49 మంది సభ్యులుగా ‌ఉన్నారు.

******


(Release ID: 1681866) Visitor Counter : 191