ఆర్థిక మంత్రిత్వ శాఖ

వేలం ద్వారా అమ్మకానికి (రీ ఇష్యూ) ‘3.96 శాతం జీఎస్‌ 2022’, ‘5.15 శాతం జీఎస్ 2025’, ‘5.85 శాతం జీఎస్ 2030’, ‘6.80 శాతం జీఎస్ 2060’


Posted On: 18 DEC 2020 7:03PM by PIB Hyderabad

ధరల ఆధారిత వేలం ద్వారా, (i) నోటిఫై చేసిన రూ.2 వేల కోట్ల మొత్తానికి '3.96 శాతం ప్రభుత్వ సెక్యూరిటీలు, 2022' (ii) నోటిఫై చేసిన రూ.11 వేల కోట్ల మొత్తానికి ‘5.15 శాతం ప్రభుత్వ సెక్యూరిటీలు 2025’ (iii) నోటిఫై చేసిన రూ.9 వేల కోట్ల మొత్తానికి ‘5.85 శాతం ప్రభుత్వ సెక్యూరిటీలు 2030’ (iv) నోటిఫై చేసిన రూ.6 వేల కోట్ల మొత్తానికి ‘6.80 శాతం ప్రభుత్వ సెక్యూరిటీలు 2060’ అమ్మకానికి (రీ ఇష్యూ) కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పైన పేర్కొన్నవాటిలో ప్రతి సెక్యూరిటీకి సంబంధించి, రూ.2 వేల కోట్ల వరకు అదనపు సబ్‌స్క్రిప్షన్‌ నిలుపుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. బహుళ ధరల విధానంలో, రిజర్వ్‌ బ్యాంకు ముంబై కార్యాలయం ఈ వేలాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించనుంది.

'ప్రభుత్వ సెక్యూరిటీల వేలంలో పోటీ లేని బిడ్డింగ్‌ సౌకర్యం' కార్యక్రమం ప్రకారం, సెక్యూరిటీల అమ్మకంలో నోటిఫై చేసిన మొత్తంలో 5 శాతం వరకు అర్హులైన వ్యక్తులు, సంస్థలకు కేటాయిస్తారు. పోటీతత్వ, పోటీ లేని బిడ్లన్నిటినీ, 'రిజర్వ్‌ బ్యాంక్‌ కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్‌' (ఇ-కుబేర్‌) వ్యవస్థ ద్వారా ఎలక్ట్రానిక్‌ విధానంలో ఈనెల 24న సమర్పించాలి. పోటీ లేని బిడ్లను ఉదయం 10.30-11 గంటల మధ్య, పోటీతత్వ బిడ్లను ఉదయం 10.30-11.30 మధ్య సమర్పించాలి.

వేలం ఫలితాలను 24వ తేదీనే ప్రకటిస్తారు. బిడ్‌ గెలుచుకున్నవారు 28వ తేదీన నగదు చెల్లించాలి. ఎప్పటికప్పుడు సవరణలు చేస్తూ, 2018 జులై 24న ఆర్‌బీఐ జారీ చేసిన 'ఆర్‌బీఐ/2018-19/25' సర్క్యులర్‌ 'వెన్‌ ఇష్యూడ్‌ ట్రాన్జాక్షన్స్‌ ఇన్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ సెక్యూరిటీస్' మార్గదర్శకాలను అనుసరించి "వెన్‌ ఇష్యూడ్‌" ట్రేడింగ్‌కు ఈ సెక్యూరిటీలకు అర్హత ఉంటుంది.

******


(Release ID: 1681864) Visitor Counter : 166