జల శక్తి మంత్రిత్వ శాఖ

జాతీయ జలవనరుల అధ్యయన ప్రాజెక్టు ప్రగతిపై జలశక్తి శాఖ మంత్రి మధ్యంతర సమీక్ష

ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నజాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు ప్రగతిపై సమీక్ష నిర్వహించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ , సహాయ మంత్రి శ్రీ రతన్ లాల్ కటారియా

Posted On: 16 DEC 2020 6:29PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా అమలుకోసం జాతీయ జలవనరుల అధ్యయన ప్రాజెక్టు (ఎన్ హెచ్ పి) 2016లో పూర్తి కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో  ప్రారంభించిన పథకం..   ఏజెన్సీలు అమలు చేసే ఈ ప్రాజెక్టు వ్యయం కోసం ఎనిమిదేళ్లలో రూ. 3680 బడ్జెట్ కేటాయింపులు చేస్తారు. దేశంలో ఎంపిక చేసిన జల వనరుల నిర్వహణ సంస్థల సామర్ధ్యాన్ని, విశ్వసనీయతను  పెంచడం,  జల వనరులకు సంబంధించిన సమాచారాన్ని సుగమం చేయడంతో పాటు వాటి వ్యాప్తిని పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.  ఆ విధంగా  ఎన్ హెచ్ పి సమర్ధవంతంగా జల వనరులకు సంబంధించిన సమాచారాన్నిసేకరించడం ద్వారా జల వనరులను సమర్ధవంతంగా అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహణకు దోహదం చేస్తుంది.  

    ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అమలు మధ్యలో ఉన్నప్పటికినీ గణనీయమైన ప్రగతిని సాధించింది.  ముఖ్యంగా జల వనరుల పర్యవేక్షణ వ్యవష్ట, జల వనరుల సమాచార వ్యవస్థ (డబ్ల్యు ఆర్ ఐ ఎస్) ,  జల వనరుల అమలు మరియు ప్రణాళిక వ్యవస్థ  మరియు సంస్థాగత సామర్ధ్యం పెంపు వంటి క్షేత్రాలలో ప్రాజెక్టు మధ్యంతర ప్రగతి బ్రహ్మాండంగా ఉంది.  దేశవ్యాప్తంగా ఉన్న జల వనరులకు సంబంధించిన
సమాచారాన్ని వాస్తవ  సమయంలో సేకరించడానికి సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ఎన్ హెచ్ పి దృష్టిని కేంద్రీకరించిందని  కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్  షెకావత్ తెలిపారు.  దేశవ్యాప్తంగా జల వనరులలో నీటి స్థాయి, నీరు విడుదల చేయడం, వర్షపాతం తదితర  వాతావరణ విషయాలను నమోదు చేయడానికి సంబంధించిన 6500  జల - వాతావరణ స్టేషన్ల ఏర్పాటుకు కాంట్రాక్టులు కుదిరాయి.   వాటిలో 1900 స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ స్టేషన్ల నుంచి త్వరలోనే కేంద్ర సమాచార స్థావరానికి దత్తాంశాలను పంపడం జరుగుతుంది.  
    వాస్తవ  సమయంలో జలవనరులకు సంబంధించిన దత్తాంశాల సేకరణ వ్యవస్థ మరియు దాదాపు వాస్తవ సమయంలో దత్తాంశాల సేకరణ వ్యవస్థ మరియు  చేతితో దత్తాంశాలను సేకరించే స్టేషన్లు ఒకదానికొకటి కలసి పూర్తి సంపూర్ణత చేకూరుస్తాయి.  ఆ విధంగా సేకరించిన డేటా పూర్తి స్థాయిలో ఉండి జల వనరుల నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు ఉత్తమంగా ఉండటానికి దోహదం చేస్తాయి.
ఆ డేటా అంటా వెబ్ ఆధార భారత జల వనరుల సమాచార వ్యవస్థ (డబ్ల్యు ఆర్ ఐ ఎస్) ద్వారా లభ్యం కావడానికి ఎన్ హెచ్ పి సహకరిస్తుంది.  గత ప్రభుత్వాల హయాంలో పూర్తి చేయకుండా మిగిలిపోయిన పని --  అన్ని రాష్ట్రాల జల వనరులకు సంబంధించిన డేటాను ఒక కేంద్రీకృత వేదికపైకి తేవడం --  పూర్తి చేయడంలో గొప్ప విజయం సాధిచడం జరిగింది.  జాతీయ జలవనరుల అధ్యయన ప్రాజెక్టు (ఎన్ హెచ్ పి)  పర్యవేక్షణలో  దేశంలో జల వనరుల నిర్వహణలో భారీ మార్పులు వస్తాయని,  ఎన్ హెచ్ పి ఒక సమగ్ర విధానాన్ని ఆచరించడమే కాక అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తుందని మంత్రి తెలియజేశారు.

   ప్రాజెక్టు నిపుణులు, అధికారులు తయారు చేస్తున్న విశ్లేషణాత్మక సాధనాలు,  మరియు  జ్ఞాన ఉత్పత్తుల సహాయంతో జలవనరుల నిర్వహణలో  యుక్తిపూర్వక మార్పులు రాగలవని మంత్రి తెలిపారు.  ఎంపిక చేసిన ప్రాజెక్టులలో వాస్తవ సమయంలో నీరు విడుదలకు సంబంధించిన  ప్రక్రియను యాంత్రీకరించినట్లు కూడా మంత్రి తెలిపారు.  అధికారుల పర్యవేక్షణలో సాగే ఈ వ్యవస్థను 'స్కాడా' (SCADA) వ్యవస్థ అంటారు. ఎన్ హెచ్ పి ప్రాజెక్టు కింద  తాము పూర్తి చేసిన విలువైన పనులకు సంబంధించిన సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉండే పౌరప్రదేశం (పబ్లిక్ డొమైన్)లో ఉంచాలని జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు వాటి గురించి తెలుసుకొని తమ సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు.  అదేసమయంలో  భాగస్వామ్య పక్షాల అవసరాలను, ఆకాంక్షలను పూర్తి చేయడానికి జలవనరుల సమాచార  వ్యాప్తి వేదిక ఇండియా- డబ్ల్యు ఆర్ ఐ ఎస్ (WRIS) ను మరింత మెరుగుపరచవలసిన అవసరం ఉందని మంత్రి ఉద్ఘాటించారు.  
కేంద్ర జల శక్తి శాఖ  సహాయ మంత్రి శ్రీ రతన్ లాల్ కటారియా మాట్లాడుతూ ఎన్ హెచ్ పి జాతీయ ప్రాముఖ్యత గల ప్రాజెక్టు అని,  ఇది జల వనరులకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సహకరించడంతో పాటు డేటాను ఇచ్చి పుచ్చుకోవడానికి ఏక కేంద్రక దేశవ్యాప్త  'నోడల్'  వేదికను ఏర్పాటు చేసిందని అన్నారు.  ఎన్ హెచ్ పి అమలులోకి వచ్చిన తరువాత జలవనరులకు సంబంధించిన సమాచారం సేకరణలో,  జలవనరులను సమర్ధవంతంగా నిర్వహించడంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని, విధాన నిర్ణయాలు తీసుకోవడం సులభమైందని  శ్రీ కటారియా వెల్లడించారు. సమాచార సేకరణలో ఎంతో ప్రగతి జరిగిందని చెబుతూ గడచిన నాలుగేళ్లలో 70,525 భూగర్భ జల కేంద్రాల డేటాను పంచుకోవడం ప్రారంభమైందని ఆయన తెలిపారు.  
జల వనరులకు సంబంధించిన సమాచారం, డేటా అందుబాటులో ఉన్నందువల్ల భవిష్యత్తులో దేశ జలవనరుల రంగం పరివర్తనకు బాటలు వేసే పనులెన్నో ప్రభుత్వం, ప్రయివేటు రంగం, విద్యావేత్తలు, పరిశోధనా సంస్థలు చేపట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. అంతేకాక నిర్ణయాల వెల్లడిలో పారదర్శకత వల్ల వాటి ప్రభావాన్ని గురించి ముందుగానే సమగ్ర అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు.   

****(Release ID: 1681418) Visitor Counter : 531


Read this release in: English , Urdu , Hindi , Tamil