సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ప్రధాని దార్శనికత ప్రకారం ఆత్మనిర్భర్ భారత్ సాధనకోసం ఎంఎస్ ఎంఇ రంగాన్ని ప్రోత్సహించాలంటే దృఢమైన ఆర్ధిక సహాయ మోడల్ అవసరం.
సమీకృత కృషితోనే డృఢమైన ఆర్ధిక సహాయ మోడల్ సాధన: శ‌్రీ గడ్కరీ
Posted On:
16 DEC 2020 8:37PM by PIB Hyderabad
ఎంఎస్ ఎంఇలకు కావాలసిన ఆర్ధిక సహాయాన్ని అందించే డృఢమైన ఆర్ధిక సహాయ మోడల్‌ను తయారు చేసుకోవడానికిగాను సమీకృత కృషి అవసరమని కేంద్ర ఎంఎస్ ఎంఇ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. భారతదేశ ఆర్ధికరంగానికి ఈ రంగం వెన్నెముక లాంటిదని ఆయన అన్నారు. ఆత్మనిర్భర్ లక్ష్య సాధనలో ఎంఎస్ ఎం ఇల పాత్ర కూడా కీలకమని ఆయన స్పష్టం చేశారు. నిర్వాహక మూలధనం లేకపోవడంవల్ల ప్రస్తుతం అవి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.
ఎంఎస్ ఎంఇలలకు సంబంధించిన ఫైనాన్స్ వీక్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ అలియాన్స్ ఫర్ మాస్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సంస్థ నిర్వహించింది. జిడిపిలో 30శాతం ఎంఎస్ ఎంఇలనుంచి వస్తోందని, దీన్ని 40శాతానికి తీసుకుపోవాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన అన్నారు. ఇక ఎగుమతుల రంగంలో ఎంఎస్ ఎంఇలవాటా 48 శాతమని, దీన్ని 60శాతానికి తీసుకుపోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అనేక ముఖ్యమైన ఉద్యోగాలను ఎంఎస్ ఎంఇ రంగం అందిస్తోందని అన్నారు. రానున్న ఐదేళ్లలో ఈ రంగంలో ఐదుకోట్ల ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
ఈ రంగం నగరాలు, పట్టణాల కేంద్రంగా వుందని..ఈ ధోరణిలో మార్పు రావాలని ఆయన అన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ కల్పన చేయాల్సి వుందని అన్నారు. ఈ క్రమంలో ఆర్ధిక సహాయాన్ని అందించే సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు పెట్టాలంటే కార్యనిర్వాహక మూలధనం కావాలని అన్నారు. ఇందుకోసం దృఢమైన ఆర్ధిక సహాయ వ్యవస్థ కావాలని అన్నారు.
తక్కువ వ్యయంతో, పర్యావరణ హితంగా వుండే డిజైన్లు, ఆలోచనల్ని అభివృద్ధి చేయడానికిగాను సమీకృత కృషి అవసరమని తద్వారా ఎంఎస్ ఎం ఇ రంగానికి కావాల్సిన శక్తి లభిస్తుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధనకోసం సంస్కరణలు చేపట్టి సామర్థ్యంతో పని చేసి, మార్పు తీసుకురావాలనేది ప్రధాని ఆశయమని కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
ఎంఎస్ ఎం ఇ రంగాన్ని అభివృద్ధి చేయడానికిగాను వినూత్నమైన సాంకేతికత కావాలని అన్నారు. ఈ దిశగా అనేక విధాలుగా కృషి జరిగిందనిఅన్నారు. వ్యవసాయ రంగంలోని మిగులు ఉత్పత్తులద్వారా వివిధరకాల ఇంధనాలను తయారు చేయడమే దీనికి ఉదాహరణ అని అన్నారు. వ్యర్థ పదార్థాలనుంచి సంపదను సృష్టించడంపైన దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
*****
(Release ID: 1681336)
Visitor Counter : 101