హోం మంత్రిత్వ శాఖ

నూతన భారతదేశం స్వప్నాన్ని సాకారం చేయడానికి సి.సి.టి.ఎన్.ఎస్. మరియు ఐ.సి.జె.ఎస్. వంటి సమగ్ర సమాచార వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

ఐ.సి.జె.ఎస్. వ్యవస్థ సమాచార భాగస్వామ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడంతో పాటు, చట్టం అమలు మరియు న్యాయ వ్యవస్థల మధ్య సత్యం యొక్క ఒకే మూలాన్ని నిర్ధారిస్తుంది : శ్రీ కిషన్ రెడ్డి


"సి.సి.టి.ఎన్.‌ఎస్. & ఐ.సి.జె.ఎస్. లలో మంచి పద్ధతులు" అనే అంశంపై ఎన్.‌సి.ఆర్.‌బి. నిర్వహించిన 2వ సదస్సును ప్రారంభించిన - కేంద్ర మంత్రి

Posted On: 15 DEC 2020 6:10PM by PIB Hyderabad

నూతన భారతదేశం స్వప్నాన్ని సాకారం చేయడానికి సి.సి.టి.ఎన్.ఎస్. మరియు ఐ.సి.జె.ఎస్. వంటి సమగ్ర సమాచార వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అన్నారు.  ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ & సిస్టమ్స్ (సి.సి.టి.ఎన్.ఎస్) / ఇంటరో ‌పెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐ.సి.జె.ఎస్) లలో మంచి పద్ధతులు" అనే అంశంపై నిర్వహించిన ద్వితీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు.  రెండు రోజులపాటు జరిగే ఈ  సదస్సును నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.‌సీ.ఆర్.‌బీ) నిర్వహించింది. 

కేంద్ర దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.‌ఏ) కు చెందిన రెండు కీలకమైన ఆధునీకరణ కార్యక్రమాలు సమర్థవంతమైన చట్ట అమలుకు దారితీశాయని, శక్తిని పెంపొందించేవిగా నిరూపించామని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు.

"నేరం అధికార పరిధిని అనుసరించదు అనేది వాస్తవికత.  అందువల్ల, నేరానికి మన ప్రతిస్పందన కూడా సరిహద్దుల ద్వారా పరిమితం కాకూడదు.  నేరాన్ని వెంటనే నమోదు చేసుకోవడం, ఆ సమాచార వివరాలను భాగస్వామ్య పక్షాలందరికీ చేరవేయడం, నిస్సందేహంగా ఏదైనా చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేసే ప్రక్రియలో ముఖ్యమైన అంశం.  ఈ ఆశయమే సి.సి.టి.ఎన్.ఎస్. ప్రాజెక్టు ప్రారంభానికి దారి తీసింది,”అని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. 

“సుమారు 2000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ మిషన్ మోడ్ ప్రాజెక్టు, దర్యాప్తు మరియు పోలీసింగ్ ‌లో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టింది.  ఇది మారుమూల ప్రాంతాలలో ఉన్న పోలీసు స్టేషన్లు మరియు ఇతర కార్యాలయాలను కూడా  అనుసంధానించగలిగింది.” అని ఆయన వివరించారు. 

డేటా షేరింగ్ ‌ను ఐ.సి.జె.ఎస్. ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందనీ, చట్ట అమలు మరియు న్యాయ వ్యవస్థల మధ్య సత్యం అనే ఒకే ఒక్క మూలాన్ని నిర్ధారిస్తుందని శ్రీ కిషన్ అన్నారు.  "సమాచారం ఆధారంగా నడిచే ప్రపంచంలో, నేర న్యాయ వ్యవస్థ యొక్క కార్యాచరణ సామర్ధ్యాన్ని, ఈ ఐ.సి.జె.ఎస్. ద్విగుణీకృతం చేస్తుంది." అని ఆయన పేర్కొన్నారు. 

 

పురాతన జ్ఞానం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలయికగా, నూతన భారతావనికి అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు శ్రీ కిషన్ రెడ్డి అన్నారు.  "ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, విలువైన మార్గదర్శకత్వం మరియు హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి నిబద్ధత గల ప్రయత్నాలతో, కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అదేవిధంగా నేర,  న్యాయ వ్యవస్థను ఆధునీకరించడానికి అనేక చారిత్రాత్మక పద్దతులను అనుసరిస్తోంది." అని ఆయన చెప్పారు. 

దేశంలోని మొత్తం 16,098 పోలీసు స్టేషన్లలో 95 శాతం పోలీసు స్టేషన్లలో సి.సి.టి.ఎన్.ఎస్. సాఫ్ట్‌వేర్ ను వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.  97 శాతం పోలీసు స్టేషన్లలో కనెక్టివిటీ అందుబాటులో ఉంది, 93 శాతం పోలీసు స్టేషన్లు సి.సి.టి.ఎన్.ఎస్. ద్వారా 100 శాతం ఎఫ్.ఐ.ఆర్. లను నమోదుచేస్తున్నాయి. 

శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, స్మార్ట్ పోలీసింగ్ పట్ల ప్రధానమంత్రి ఆశక్తిని దృష్టిలో ఉంచుకుని. జవాబుదారీతనం, పారదర్శకత, సమాజ-ఆధారిత వ్యూహాలు మరియు సామర్థ్యంపై దృష్టి సారించి శాంతిభద్రతలను నిర్వహించడంపై నూతన విధానాలను అవలంబించడం జరిగిందని, పేర్కొన్నారు.   నేర న్యాయ వ్యవస్థలో లక్ష్యం మరియు శాస్త్రీయ విధానాన్ని ప్రోత్సహించే దృష్టితో రెండు కొత్త విశ్వవిద్యాలయాలు, కేంద్ర రక్షణ విశ్వవిద్యాలయం మరియు జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం స్థాపించబడ్డాయి.  అదే సమయంలో, పోలీసుల ఆధునికీకరణకు, రాష్ట్రాలకు అందించే సహాయం కింద, ఐటి వ్యవస్థలతో సహా తాజా ఆయుధాలు, శిక్షణా గాడ్జెట్లు, అధునాతన కమ్యూనికేషన్ మరియు ఫోరెన్సిక్ పరికరాల కొనుగోలుకు నిధులు సమకూరుతాయి.

"జీవన సౌలభ్యం మరియు సమాజ శ్రేయస్సును పెంచే దిశగా ఒక ముఖ్యమైన దశ,  2018 లో హోంమంత్రిత్వ శాఖ ప్రారంభించిన “డిజిటల్ పోలీస్ పోర్టల్ ”.  ఈ ఒక్క సెంట్రల్ పోర్టల్ ‌తో, సి.సి.టి.ఎన్.ఎస్. ఆధారిత సేవలన్నింటితో పాటు, పోలీసుల కోసం రూపొందించి వినియోగిస్తున్న వేర్వేరు యాప్ లు కూడా అనుసంధానం చేయబడి ఉంటాయి.  ఇలా అనుసంధానం చేయబడిన యాప్ లలో సి.ఆర్.ఐ-ఎం.ఏ.సి; యూనిఫై, ఎన్.డి.ఎస్.ఓ. తో పాటు సెంట్రల్ సిటిజెన్ సర్వీసెస్ వంటి ముఖ్యమైన యాప్ లు కూడా ఉన్నాయి.”అని కేంద్ర మంత్రి చెప్పారు. 

విప్లవాత్మక తాజా ప్రాజెక్టు అమలు, సమర్థవంతమైన పర్యవేక్షణ విషయంలో, శ్రీ కిషన్ రెడ్డి,  ఎన్.‌సి.ఆర్.‌బి. ని ప్రశంసిస్తూ,   ఈ గణాంకాలన్నీ  ఆకట్టుకునేవిగా,  సి.సి.టి.ఎన్.ఎస్. ను విజయవంతం చేయడానికి ప్రతి వాటాదారుడు చేసిన కృషిని ప్రతిబింబించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఒక రాష్ట్రంలో అవలంబిస్తున్న మంచి కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాల్లో ప్రతిబింబించాలని మంత్రి పిలుపునిస్తూ,  "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, ప్రభుత్వం సహకార సమాఖ్యను మార్గదర్శక మంత్రంగా ఉపయోగించుకోవడం, రాష్ట్రాలు కలిసి పనిచేయడం, కలిసి నేర్చుకోవడంతో పాటు, ఒకరినొకరు కలిసి ముందుకు నడిపించడం చాలా గొప్ప విషయం" అని పేర్కొన్నారు.

ఉత్తమ పద్ధతులను సంకలనం రూపంలో ఉంచినందుకు శ్రీ కిషన్ రెడ్డి కూడా ఎన్.‌సి.ఆర్.‌బి. ని ప్రశంసిస్తూ,  "ఇది చట్టాలను అమలు చేసే అధికారులకు ఆలోచనల నిధిగా అందుబాటులో ఉండడంతో పాటు, రాష్ట్రాలు పరస్పరం నేర్చుకోడానికి అవకాశాలను కల్పిస్తుంది." అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎన్‌.సి.ఆర్.‌బి. డైరెక్టర్ శ్రీ రామ్ ఫాల్ పవార్ మాట్లాడుతూ, ఎన్.‌సి.ఆర్.‌బి.  ఇప్పుడు,  అనుమానితులను త్వరగా గుర్తించడం కోసం వేలి ముద్రల సేకరణ, నిల్వ మరియు సరిపోలికను ఆటోమేటిక్ గా నిర్వహించడానికి ఉపయోగపడే, నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఎన్.ఏ.ఎఫ్.ఐ.ఎస్), వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేస్తోందని చెప్పారు. "సి.సి.టి.ఎన్.ఎస్. సమాచార వ్యవస్థలో,  అరెస్టు చేసిన ప్రతి వ్యక్తికి ఇది చాలా అవసరమైన ప్రత్యేకమైన గుర్తింపును కేటాయిస్తుంది. ఎందుకంటే ఈ సమాచారమంతా భవిష్యతు వినియోగం కోసం,  ఎన్.ఏ.ఎఫ్.ఐ.ఎస్. మరియు సి.సి.టి.ఎన్.ఎస్. వద్ద అనుసంధానించబడి ఉంటుంది." అని ఆయన వివరించారు.

 

ఎన్.‌సి.ఆర్.‌బి. చేపట్టిన కార్యకలాపాల గురించి శ్రీ పవార్ వివరిస్తూ, సి.సి.టి.ఎన్.ఎస్ (రాష్ట్రాలు) అప్లికేషన్ యొక్క నవీకరించిన వ్యవస్థను, మిగతా అన్ని రాష్ట్రాలకు విడుదల చేయడానికి ముందు, హర్యానా మరియు ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు పైలట్ ప్రాతిపదికన  విడుదల చేయడం జరిగింది.   దీనితో పాటు, ఐ.సి.జె.ఎస్. అమలు కోసం, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు (యు.టి.లు) మరియు ఎన్.‌ఐ.సి. లతో ఎన్.‌సి.ఆర్.‌బి.  సమన్వయం చేస్తోంది.

"తాజా నివేదికల ఆధారంగా, 28 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లోని న్యాయస్థానాలలోనూ, 32 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలోని కారాగారాలలో సి.సి.టి.ఎన్.ఎస్. సమాచారం ఎలక్ట్రానిక్ పద్ధతిలో వినియోగించబడుతోంది. 9 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లోని న్యాయస్థానాలలోని సమాచారాన్ని సి.సి.టి.ఎన్.ఎస్. లోకి తిరిగి బదిలీ చేయడం ప్రారంభమైంది, ”అని ఆయన చెప్పారు. 

పోలీసు అధికారులు మరియు పౌరుల కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా అనేక మొబైల్ యాప్ లను అభివృద్ధి చేశాయని శ్రీ పవార్ తెలియజేశారు. సి.సి.టి.ఎన్.ఎస్. సమాచార వ్యవస్థను వినియోగించుకుని, సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభించిన వేదికల ద్వారా  పోలీసు దళాలు వేగంగా మారుతున్నాయన్న విషయాన్ని, రాష్ట్రాలు అభివృద్ధి చేసిన ఈ యాప్ లు మరియు సాధనాలు, సూచిస్తున్నాయి.

 

ఈ సందర్భంగా, ఆయా రాష్ట్రాల్లో సి.సి.టి.ఎన్.ఎస్. అమలుకు మెరుగైన కృషి చేసిన అధికారులను సత్కరించారు.

 

*****


(Release ID: 1680932)
Read this release in: English , Urdu , Hindi , Tamil