రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రైతుల ఆందోళనకు మద్దతుగా శౌర్య చక్ర అవార్డును తిరిగి ఇచ్చేశారని వచ్చిన వార్తల్లో నిజం లేదు ఇటువంటి తప్పుడు వార్తలు రక్షణ దళాల ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి

Posted On: 15 DEC 2020 4:37PM by PIB Hyderabad

రైతుల ఆందోళనకు మద్దతుగా 25,000 మంది శౌర్య చక్ర గ్రహీతలు తమ అవార్డులను తిరిగి ఇచ్చివేశారంటూ ఈ నెల 15వ తేదీన ఒక ప్రాంతీయ భాషా దినపత్రికలో వచ్చిన వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదు. రక్షణ దళాల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉన్న ఈ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదు. నిరాధారమైన ఇటువంటి వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి.

వాస్తవానికి 1956 నుంచి 2019 వరకు 2,048 శౌర్య చక్ర అవార్డులను మాత్రమే ప్రధానం చేయడం జరిగింది.

ఇటువంటి వార్తలను ప్రచురించే ముందు ప్రసార సాధనాలు వాస్తవాలను తెలుసుకుని అధికారులతో సంప్రదించాలని కోరడం జరిగింది.

***
 (Release ID: 1680817) Visitor Counter : 209