కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఇఎస్ఐసి మెడికల్ కాలేజీలో కొత్త సేవల ప్రారంభం
Posted On:
13 DEC 2020 12:13PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని ఇఎస్‌ఐసి మెడికల్ కాలేజీలో కార్మిక, ఉపాధి శాఖ మంత్రి (ఐ / సి) శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సంయుక్తంగా కొత్త సేవలు, సామగ్రిని జాతికి అంకితం చేశారు.
ప్రారంభించిన సేవలు, సామాగ్రి వివరాలు:
- ఇన్నోవేటివ్ పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్ ఆర్టిపీసీఆర్, కోవిడ్ రోగులకు ఉపయోగ సౌలభ్యం, వేగవంతమైన నమూనా ప్రాసెసింగ్ పరికరం.
- రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ - కోవిడ్ మరియు నాన్-కోవిడ్ రోగులకు కోవిడ్ బీప్ సేవలు, రిమోట్‌గా హృదయ స్పందన రేటు, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, శ్వాసకోశ రేటు మరియు ఆక్సిజన్ సంతృప్తిని కొలవడానికి సమగ్రంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఫిజియోలాజికల్ పారామీటర్ పర్యవేక్షణ వ్యవస్థ. అన్ని పారామితులను ఏకకాలంలో ఇచ్చే ధరించగలిగే పరికరంలో ఇది మొదటిది. రోగులు ధరించడానికి సౌలభ్యంగా ఉండడమే కాకుండా రికార్డింగ్ స్వయంచాలకంగా యాప్, గేట్‌వేలో సేవ్ చేయబడుతుంది. రక్తపోటును కొలవడానికి పరికరాన్ని వైద్యులు రిమోట్‌గా నియంత్రించవచ్చు
- నవ జాత శిశువుల కోసం కోవిడ్ సురక్షిత ఇంక్యుబేటర్లు, ఇప్పటికే ఉన్న ఇంక్యుబేటర్లను కొన్ని మార్పులు చేయడం ద్వారా దేశీయంగా అభివృద్ధి చేయబడ్డాయి.
- 50 డయాలసిస్ పడకలతో 24 గంటలూ డయాలసిస్ సేవలు: ఈ ఆసుపత్రికి అనుసంధానించబడి సుమారు 600 డయాలసిస్ రోగులు ఉన్నారు, వీరిని గతంలో ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేసేవారు. మహమ్మారి సమయంలో, రిఫెరల్ మరియు రవాణా, సార్స్-కోవ్-2 సంక్రమణ ప్రమాదాన్ని పెంచాయి. అందువల్ల, డయాలసిస్ సేవలను ప్రారంభించడంతో, హైదరాబాద్‌లోని అన్ని ఇఎస్‌ఐసి బీమా చేసిన వ్యక్తులు మరియు లబ్ధిదారులకు డయాలసిస్ సేవలు ఈ ఆస్పత్రులోనే లభిస్తాయి.
బీమా చేసిన కార్మికులతో పాటు కోవిడ్ -19 రోగులకు తన సేవలను అందించడానికి హైదరాబాద్ లోని సనత్ నగర్ లోని ఇఎస్ఐసి మెడికల్ కాలేజీ చేపట్టిన కృషిని కార్మిక మంత్రి ప్రశంసించారు. ఇప్పటివరకు, ఈ మెడికల్ కాలేజీ 50,000 కి పైగా కోవిడ్ నమూనాలను పరీక్షించింది. ఇఎస్‌ఐసి మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ శ్రీనివాస్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో లభించే వివిధ సౌకర్యాల గురించి ప్రముఖులకు వివరించారు.
*****
(Release ID: 1680448)
Visitor Counter : 123