జౌళి మంత్రిత్వ శాఖ
ప్రభుత్వం, పరిశ్రమలు, బహుళ వాటాదారుల సమిష్టి ప్రయత్నాలు పిపిఇ సంక్షోభాన్ని భారతదేశానికి అవకాశంగా మార్చాయని కేంద్ర జౌళీ శాఖ మంత్రి చెప్పారు
60 రోజుల్లో, భారతదేశం పిపిఇ ఫాబ్రిక్, గార్మెంట్ తయారీదారుల స్వదేశీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది
5 లక్షల స్థిరమైన ప్రత్యక్ష ఉద్యోగాలకు భరోసా
Posted On:
11 DEC 2020 6:55PM by PIB Hyderabad
ప్రభుత్వం, పరిశ్రమలు మరియు బహుళ వాటాదారుల సమిష్టి కృషి పిపిఇ సంక్షోభాన్ని భారతదేశానికి అవకాశంగా మార్చిందని కేంద్ర జౌళీ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ పేర్కొన్నారు. ఈ రోజు ఇక్కడ ఒక వెబినార్ లో “ఆత్మ నిర్భర్ భారత్ వైపు ఒక ఉద్యమం” పై ఆమె ముఖ్య ఉపన్యాసం చేశారు. ఈ విజయవంతమైన ప్రయాణం ఇతర దేశీయ తయారీదారులకు ప్రేరణగా మారిందని, ఈ విజయ గాథ ఇతర రంగాలకు ఉదాహరణగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని మంత్రి అన్నారు. "ఆరోగ్య సంక్షోభం కారణంగా పిపిఇ తయారీపై ఒత్తిడి పెరిగినప్పటికీ, పిపిఇల విజయం ఇతర పరిశ్రమలలోని దేశీయ తయారీదారులకు కొత్త తలుపులు తెరిచింది" అని ఆమె తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య విశ్వాసం ఉందని, అందుకే ఇది విజయవంతమైందని మంత్రి చెప్పారు. “పరిశ్రమలో ఎవరూ సబ్సిడీ అడగలేదు, ప్రభుత్వం కూడా ఇస్తాననలేదు. నేను గర్వించదగ్గ మరో విషయం ఏమిటంటే, లాక్డౌన్ స్థితిలో, మేము 5 లక్షల స్థిరమైన ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించాము” అని కేంద్ర మంత్రి తెలిపారు.
పిపిఇ సూట్లు, మాస్కుల తయారీ స్థాయి ఎంత అమోఘమైన రేటుతో పెరిగిందంటే, అక్టోబర్ నాటికి దేశీయంగా 60 మిలియన్లకు పైగా పిపిఇలు ఉత్పత్తి అయ్యాయి, వీటిలో 20 మిలియన్లకు పైగా పిపిఇ సూట్లు ఎగుమతి అయ్యాయి అని శ్రీమతి ఇరానీ చెప్పారు. 150 మిలియన్లకు పైగా ఎన్ -95 మాస్కులు ఉత్పత్తి అయ్యాయి, వీటిలో 40 మిలియన్లకు పైగా మాస్కులు ఎగుమతి అయ్యాయి. సున్నా నుండి ప్రారంభించి, ఈ రోజు మన వద్ద పిపిఇ సూట్ల కోసం 1100 కంపెనీలు మరియు ఎన్ -95 మాస్క్‌ల కోసం 200 కి పైగా దేశీయ తయారీదారులు ఉన్నారు అని కేంద్ర మంత్రి చెప్పారు.
“మేము అంతర్జాతీయ ప్రమాణాలను పలుచన చేయలేదు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో లాక్డౌన్లో వచ్చిన ఏకైక పరిశ్రమ, మేము దానిని తులనాత్మక ఖర్చుతో లేదా దిగుమతి వ్యయంలో 10% వద్ద చేసాము. మేము పరిమాణంలో విస్తరించడమే కాక, ప్రపంచంలోని ఉత్తమమైన వాటితో పోల్చి చూస్తాము. పరిశ్రమ మరియు ప్రభుత్వం కలిసి వచ్చినందుకు నేను సంతోషిస్తాను" అని ఆమె తెలిపారు. పరిశ్రమల దిగ్గజాల పూర్తి మద్దతు మరియు నమ్మకానికి ఊతంగా, ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తుందని, వారి వృద్ధికి పరిశ్రమకు సహాయక వాతావరణం, పర్యావరణ వ్యవస్థను అందిస్తూనే ఉంటుందని మంత్రి అన్నారు.
పిపిఇ తయారీలో జౌళీ మంత్రిత్వ శాఖ విజయవంతమైన కథనాన్ని డాక్యుమెంట్ చేయడానికి ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్నెస్ (ఐఎఫ్సి) చేసిన కృషిని జౌళీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవి కపూర్ తన ప్రసంగంలో అభినందించారు. ఈ ప్రయాణంలో విశేషమేమిటంటే, కేవలం 60 రోజుల్లో ఏదీ లేనప్పుడు భారతదేశం ఒక పరిశ్రమను సృష్టించిందని అన్నారు.
వెబినార్‌ను ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్నెస్ (ఐఎఫ్‌సి) నిర్వహించింది మరియు ఈ కార్యక్రమంలో పరిశ్రమలు మరియు సంస్థలకు చెందిన వాటాదారులు హాజరయ్యారు. ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటివిటీనెస్ చేసిన అధ్యయనం గురించి కూడా సెషన్ చర్చించింది.
****
(Release ID: 1680159)
Visitor Counter : 104